Good News: RBI's new policy on home loan EMIs ...!
గుడ్‌న్యూస్: హోం లోన్స్ EMI లపై ఆర్బీఐ కొత్త విధానం...!
కరోనా కట్టడి కోసం లాక్డౌన్ విధించినప్పటి నుంచి హోంలోన్స్తో పాటు ఇతర లోన్లు చెల్లించడం అందరికీ సవాల్‌గా మారింది... కోట్లాది మంది ఉపాధి కోల్పోవడం.. లక్షలాది మంది ఉద్యోగాలు ఊడిపోవడం... ఉన్నవాళ్లకు సరిగా జీతాలు రాకపోవడం ఇలా చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. ఇంకా పడుతూనే ఉన్నారు. ఇక, బతకడమే కష్టంగా మారిన సమయంలో... ఈఎంఐలు, నెలవారి చెల్లింపులు కష్టంగా మారింది. వారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని.. ఆర్బీఐ మారటోరియం విధించింది. అయితే ఈఎంఐ మారటోరియం ఈ నెల (ఆగస్టు) చివరి వరకు మాత్రమే అందుబాటులో ఉండనుంది... మొదట 3 నెలల మారటోరియం ప్రకటించిన ఆర్బీఐ.. ఆ తర్వాత దానిని పొడిగిస్తూ వచ్చింది. ఇక, మళ్లీ పొడిగించవద్దు అంటూ బ్యాంకులను నుంచి ఆర్బీఐకి విజ్ఞప్తులు వెళ్లాయి..
దీంతో. ఆర్బీఐ నుంచి లోన్ మారటోరియం అంశానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. బ్యాంకులు కూడా మారటోరియం పొడిగింపు అవసరం లేదని అభిప్రాయపడుతుండడంతో.. లోన్ తీసుకున్న వారు వచ్చే నెల నుంచి ఈఎంఐ తిరిగి చెల్లించాల్సి రావొచ్చు అని చెబుతున్నారు. అయితే హోమ్ లోన్ తీసుకున్న వారికి మాత్రం గుడ్‌న్యూస్ చెప్పే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. కరోనావైరస్ దెబ్బకి ఉద్యోగం పోవడం లేదా వేతనంలో కోత పడటం వంటి వారు ఆగస్టు 31 తర్వాత కూడా ఈఎంఐ చెల్లించాల్సిన అవసరం ఉండకపోవచ్చు.. దీనికి ఆర్బీఐ లోన్ రిస్ట్రక్చరింగ్ ఫెసిలిటీ ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఆర్బీఐ లోన్ రిస్ట్రక్చనింగ్లో భాగంలో పలు బ్యాంకులు తమ కస్టమర్లకు ఈఎంఐ డిఫర్మెంట్ ఫెసిలిటీని అందించవచ్చు అని తెలుస్తోంది.. అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ సహా పలు బ్యాంకులు హోమ్ లోన్స్‌పై రిస్ట్రక్చరింగ్ ఫెసిలిటీ అందించే యోచనలో ఉన్నట్టు సమాచారం. ఇది అమల్లోకి వస్తే.. ఉద్యోగం, ఉపాధి కోల్పోయి ఇబ్బంది పడుతున్నవారు మరి కొన్ని నెలల వరకు ఈఎంఐ చెల్లించాల్సిన అవసరం ఉండకపోవచ్చుఅని చెబుతున్నారు. అయితే, దీనిపై మరింత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది.
0 Response to "Good News: RBI's new policy on home loan EMIs ...!"
Post a Comment