Google Tips: Do you trade online? But let's find out the following
Google Tips: ఆన్‌లైన్‌లో లావాదేవీలు చేస్తున్నారా?అయితే క్రింది విషయాలు గుర్తించు కుందాం.
మీరు ఆన్‌లైన్‌లో ఎక్కువగా లావాదేవీలు జరుపుతుంటారా? ఇలా ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ చేసేప్పుడు మోసపోతామని ఎప్పుడైనా భయపడ్డారా? ఆన్‌లైన్ మోసాలు చాలా ఎక్కువగా జరుగుతుంటాయి. మీరు ఆన్‌లైన్‌లో సేఫ్‌గా ఉండటానికి Google కొన్ని టిప్స్ చెబుతోంది. తెలుసుకోండి.
- ఎంతో అప్రమత్తంగా ఉంటే తప్ప ఆన్‌లైన్ మోసాలకు అడ్డుకట్టవేయలేం. ఆన్‌లైన్‌లో వస్తువులు, ప్రయాణం కోసం క్యాబ్, రైలు టికెట్లు, ఫ్లైట్ టికెట్లు బుక్ చేయడం లాంటివన్నీ డబ్బుతో ముడిపడి ఉన్నవే. అందుకే ఆన్‌లైన్‌లో లావాదేవీలు జరిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే సైబర్ నేరగాళ్లు మిమ్మల్ని టార్గెట్ చేయడానికి రెడీగా ఉంటారు. అందుకే అప్రమత్తంగా ఉండటం తప్పనిసరి.
- మీ ఇమెయిల్ ఐడీకి రికవరీ మొబైల్ నెంబర్ లేదా ఇమెయిల్ ఐడీ తప్పనిసరిగా ఉండాలి. అవి మారితే వివరాలు అప్‌డేట్ చేయాలి. మీ ఇమెయిల్‌ని ఎవరైనా యాక్సెస్ చేస్తే మీ రికవరీ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్‌కు అలర్ట్ వస్తుంది.
- పాస్‌వర్డ్ మేనేజర్ ఉపయోగించండి. పాస్‌వర్డ్ మేనేజర్‌తో మీరు స్ట్రాంగ్ పాస్‌వర్డ్స్ క్రియేట్ చేయడంతో పాటు వాటిని జాగ్రత్తగా స్టోర్ చేసుకోవచ్చు. Google లెక్కల ప్రకారం ఓ వ్యక్తి సగటున 120 పైగా పాస్‌వర్డ్స్ ఉపయోగిస్తారట. మీరు పాస్‌వర్డ్ మేనేజర్ ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు.
- మీ ఓఎస్, యాప్స్, బ్రౌజర్ లాంటివి ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలి. లేకపోతే వైరస్ ఎటాక్స్ తప్పవు.
- టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ తప్పనిసరి. దీని ద్వారా మీకు అదనంగా సెక్యూరిటీ లభిస్తుంది. మీరు లాగిన్ చేయాలంటే పాస్‌వర్డ్‌తో పాటు యూనిక్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
- మీ పాస్‌వర్డ్స్ వేరేవాళ్ల చేతుల్లోకి వెళ్లాయన్న అనుమానం ఉంటే Google సెక్యూరిటీ చెకప్ చేయొచ్చు. దీని ద్వారా రిపీట్ పాస్‌వర్డ్స్, సెక్యూరిటీ లోపాలు తెలుసుకోవచ్చు.
- మీకు అవసరం లేని యాప్స్, బ్రౌజర్ ఎక్స్‌టెన్షన్స్ తొలగించాలి. మీకు తెలియని యాప్స్ డౌన్‌లోడ్ చేయొద్దు. ఎలాంటి వ్యక్తిగత సమాచారాన్ని వెల్లడించొద్దు.
- పాస్‌వర్డ్ అలర్ట్ ఉపయోగించండి. మీ Google పాస్‌వర్డ్‌ని నాన్ Google సైట్స్‌లో లాగిన్ చేసేందుకు ప్రయత్నించినప్పుడు మీకు అలర్ట్స్ వస్తాయి.
- Google అకౌంట్‌లో సెక్యూరిటీలోకి వెళ్లి మేనేజ్ డివైజెస్ సెక్షన్‌లో మీరు ఉపయోగించని డివైజ్‌ల నుంచి లాగౌట్ కావాలి. లేకపోతే ఆ డివైజ్ వేరేవాళ్ల చేతుల్లోకి వెళ్తే మీ అకౌంట్‌ని యాక్సెస్ చేసే ప్రమాదముంది.
0 Response to "Google Tips: Do you trade online? But let's find out the following"
Post a Comment