Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

How to "Education Online" in Government Schools

సర్కారీ బడుల్లో "ఆన్లైన్ విద్య" ఎలా

కరోనా కారణంగా దేశవ్యాప్తంగా సుమారు 15 లక్షల పాఠశాలలు మూతపడి 26 కోట్ల మంది విద్యార్థులు చదువులకు దూరమయ్యారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఇప్పుడప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొనేలా కనబడటం లేదు. ఈ నేపథ్యంలో విద్యా వ్యవస్థ ఆన్​లైన్​ బాటపట్టింది. ఇప్పటికే పట్టణ ప్రాంతాల్లోని ప్రైవేటు, కార్పొరేటు, ఐసీఎస్‌ఈ, సీబీఎస్‌ఈ పాఠశాలల విద్యార్థులు స్మార్ట్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌, ట్యాబ్‌ల ద్వారా జూమ్‌, మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌మీట్‌ వంటి వీడియో కాలింగ్‌ అప్లికేషన్‌ల ద్వారా ఆన్‌లైన్‌ పాఠాలను వింటున్నారు. కానీ సర్కారీ బడుల్లో మౌలిక వసతులు లేక విద్యార్థులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రభుత్వ పాఠశాలల విద్యను బలోపేతం చేస్తూ ఆన్‌లైన్‌ ద్వారా అందరికీ విద్యను అందించడం శ్రేయస్కరం.

కరోనా సృష్టించిన కల్లోలంతో అన్ని రంగాలతోపాటు విద్యారంగం సైతం అస్తవ్యస్తంగా మారింది. దేశవ్యాప్తంగా సుమారు 15 లక్షల పాఠశాలలు మూతపడి 26 కోట్ల విద్యార్థులు చదువులకు దూరమయ్యారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఇప్పుడప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొనేలా కనబడటం లేదు. మరోవైపు- విద్యార్థులు దీర్ఘకాలంపాటు చదువులకు దూరమైతే భవిష్యత్తులో తీవ్ర దుష్ఫలితాలు చవిచూడాల్సి వస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల దృష్టిని చదువులపైకి మరల్చాల్సి ఉంది. ఇందుకోసం ఆన్‌లైన్‌ పాఠాలను అందించడం మేలైన మార్గం. ప్రస్తుత విద్యాసంవత్సరం ప్రారంభం కాకపోయినా ఇప్పటికే పట్టణ ప్రాంతాల్లోని ప్రైవేటు, కార్పొరేటు, ఐసీఎస్‌ఈ, సీబీఎస్‌ఈ పాఠశాలల విద్యార్థులు స్మార్ట్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌, ట్యాబ్‌ల ద్వారా జూమ్‌, మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌మీట్‌ వంటి వీడియో కాలింగ్‌ అప్లికేషన్‌ల ద్వారా ఆన్‌లైన్‌ పాఠాలను వింటున్నారు. ఆధునిక సాంకేతిక, పరిజ్ఞానం, ఉపకరణాల ద్వారా అందుబాటులోకి వచ్చే ఆన్‌లైన్‌ పాఠాలు కేవలం 30శాతం ఉన్నత, మధ్యతరగతి వర్గాల విద్యార్థులకే అందే అవకాశం ఉంది. మిగతా 70శాతం విద్యార్థులు- గ్రామీణ, కొండ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల్లో చదువుకునే నిరుపేదలే. నిరక్షరాస్యులైన తల్లిదండ్రులే వీరి నేపథ్యం. పైగా, ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు యథావిధిగా పనిచేస్తేనే అల్పాదాయ వర్గాల చిన్నారులకు పౌష్టికాహారం అందుతుంది. లేనిపక్షంలో వారు పోషకాహారానికి దూరమై అన్ని రకాల సామర్థ్యాలు దెబ్బతినే ప్రమాదముంది.
ఉపాధ్యాయులకు శిక్షణ అవసరం
దేశంలోని సర్కారు బడులను కరోనా మరింత సంక్షోభంలో పడేసింది. మౌలిక సదుపాయాల కొరతకు తోడు ఆన్‌లైన్‌ పాఠాలకు అవసరమైన స్మార్ట్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌, ట్యాబ్‌లను కొనుగోలు చేసే, అంతర్జాల కనెక్షన్‌ ఏర్పాటు చేసుకొనే ఆర్థిక స్థోమత సర్కారు బడి విద్యార్థులకు తక్కువే. ఇప్పటికీ గ్రామీణ, గిరిజన, ప్రాంతాల్లో 40శాతానికి ఫోన్లు, అంతర్జాల సదుపాయాలే లేవు. ఇప్పటికిప్పుడు ఆన్‌లైన్‌ పాఠాలంటే ప్రభుత్వ బడుల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇరువర్గాలకూ కొత్త పరిణామమే. దీంతో వీడియో కాలింగ్‌ అప్లికేషన్‌తో ఆన్‌లైన్‌ పాఠాలను ఎలా బోధించాలి? ఎలాంటి ఉపకరణాలు ఉపయోగించాలి? ఎలాంటి పద్ధతిలో బోధించడం ద్వారా పిల్లలను ఆకట్టుకోగలం వంటి విషయాల్లో ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొంది. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వ ఉపాధ్యాయులు సాంకేతిక పరిజ్ఞాన నైపుణ్యాన్ని పెంపొందించుకుని విద్యార్థులకు బోధించే అవకాశాల్ని అందిపుచ్చుకోవాలి. ప్రభుత్వం కూడా ఆన్‌లైన్‌ పాఠాల బోధనపై ఉపాధ్యాయులకు అవసరమైన శిక్షణ అందించే దిశగా యత్నించాలి.

ఇటీవల కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల్లో సెప్టెంబర్‌ నుంచి ఆన్‌లైన్‌ పాఠాలు నిర్వహించాలని సూచించింది. ఎన్సీఈఆర్టీ మార్గదర్శకాల ఆధారంగా స్థానిక అవసరాలనూ దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర విద్యాశాఖ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆన్‌లైన్‌ విద్యను అందించేందుకు యత్నించాలి. అంతర్జాలం ద్వారానే కాకుండా గ్రామీణ విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఉపగ్రహ ఛానల్‌ ద్వారానూ బోధించాలి. ఇందుకోసం వివిధ టీవీ ఛానళ్లు, కేబుల్‌ టీవీ, సామాజిక రేడియో, రెయిన్‌బో ఎఫ్‌ఎం, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన దూరదర్శన్‌ ఛానళ్లయిన సప్తగిరి, యాదగిరి, టీ-శాట్‌ల ద్వారా ఆన్‌లైన్‌ విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి. యూట్యూబ్‌ వంటి సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకోగల వీలుంది. ఇందుకు వీడియో, ఆడియో రికార్డింగ్‌లను ఉపయోగించవచ్ఛు.
ఆన్‌లైన్‌ బోధన అందరికీ అందాలి
ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రామాణిక మార్గదర్శకాలు పేర్కొన్నట్లుగా పాఠశాలల్లో 10-12 తరగతుల విద్యార్థులకు ప్రత్యక్షంగా బోధించాలి. ఆన్‌లైన్‌ తరగతుల కోసం విద్యార్థులకు సెక్షన్ల వారీగా టైంటేబుల్‌ను, వేళల్ని నిర్ణయించాలి. ఉపాధ్యాయుల బోధనా సమయం, పాఠ్య ప్రణాళిక, పని దినాలు, మూల్యాంకన విధానంలో అవసరమైన మార్పులూచేర్పులూ చేపట్టాలి. అవసరమైతే క్రాష్‌ కోర్సును సైతం ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలించాలి. సంప్రదాయ తరహా బోధన మాత్రమే కాకుండా సమ్మిళిత, దూరవిద్య పద్ధతుల్లో బోధిస్తూ పరస్పర చర్చల ద్వారా వీడియో తరగతులను కోడ్‌ కాస్ట్‌ ద్వారా అందించాలి. ఎన్సీఈఆర్టీ రూపొందించిన సురక్షిత ఆన్‌లైన్‌ అధ్యయనం ద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయులు స్వీయ డిజిటల్‌ అభ్యసనం చేపట్టవచ్ఛు రాష్ట్రాల్లో విద్యాశాఖ, ఎస్సీఈఆర్టీల సమన్వయంతో క్షేత్రస్థాయిలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులను సమన్వయ పరుస్తూ ఆన్‌లైన్‌ విద్యాబోధన కార్యక్రమాన్ని ముందుకు నడిపించాలి. రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రభుత్వ పాఠశాలల విద్యను బలోపేతం చేస్తూ ఆన్‌లైన్‌ ద్వారా అందరికీ విద్యను అందించడం శ్రేయస్కరం

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "How to "Education Online" in Government Schools"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0