Inspiration
డిగ్రీ కుర్రాడు…వ్యవసాయం చేస్తూ ఏడాదికి రూ.1.52 కోట్లు సంపాదిస్తున్నాడు.! అతని ఐడియానే కాసులు కురిపిస్తుంది!
సేంద్రీయ పద్ధతిలో పండించిన ఆహారాలనే తినాలని.. రసాయనాలు వేసి పండించిన పంటల వల్ల మనకు అనారోగ్య సమస్యలు వస్తాయని ఎప్పటినుంచో వైద్య నిపుణులు చెబుతున్నారు. అయినప్పటికీ దేశంలో చాలా మంది ఇంకా రసాయనాలు వేసి పండించిన పంటలనే తింటున్నారు. ఇందుకు కారణం చాలా మందికి ఈ విషయం పట్ల అవగాహన లేకపోవడమే. అయితే ఇదే విషయాన్ని జనాలకు తెలియజేయాలనే ఉద్దేశంతోపాటు.. సేంద్రీయ పద్ధతిలో పంటలను సాగు చేయాలనే విషయాన్ని కూడా ఆ యువకుడు చాటి చెబుతున్నాడు. అతనే.. గుజరాత్‌కు చెందిన దేవేష్ పటేల్.
దేవేష్ పటేల్‌ది గుజరాత్‌లోని ఆనంద్ అనే ప్రాంతంలో ఉన్న బొరియావి అనే గ్రామం. అక్కడ అతని కుటుంబానికి 12 ఎకరాల స్థలం ఉంది. అందులో 1992 నుంచే ఆర్గానిక్ పద్ధతిలో పంటలను సాగు చేస్తున్నారు. అయితే 2005లో దేవేష్ ఓవైపు అక్కడి ఆనంద్ మర్సంటైల్ కాలేజ్ ఆఫ్ సైన్స్‌లో మేనేజ్‌మెంట్ అండ్ కంప్యూటర్ టెక్నాలజీలో డిగ్రీ చదువుతుండగానే.. సేంద్రీయ వ్యవసాయాన్ని మరిన్ని ఆధునిక పద్ధతుల్లో చేయాలనే ఉద్దేశంతో సొంతంగా సత్వ ఆర్గానిక్ అనే సంస్థను స్థాపించాడు. తరువాత తన కుటుంబ సభ్యుల సహకారంతో మరో 5 ఎకరాల స్థలాన్ని అదనంగా కౌలుకు తీసుకున్నాడు. అనంతరం డిగ్రీ పూర్తయ్యాక మొత్తం స్థలంలో ఆధునిక పద్ధతుల్లో సేంద్రీయ వ్యవసాయం చేయడం మొదలు పెట్టాడు.
దేవేష్ అలా పసుపు, అల్లం తదితర అనేక పంటలను పూర్తిగా సేంద్రీయ పద్ధతిలో పండించడం మొదలు పెట్టాడు. అందుకుగాను అతను విత్తనాలను విత్తడం కన్నా ముందుగానే భూమిని పోషకాలతో నింపేవాడు. అందుకు సేంద్రీయ ఎరువులను వాడేవాడు. తమకు ఉన్న ఆవుల ద్వారా ఉత్పత్తి అయ్యే ఎరువును సేకరించి దాంతో సేంద్రీయ ఎరువులను తయారు చేసి పంటలను సాగు చేయడం మొదలు పెట్టాడు. దీంతో సహజంగానే ఆయా పంటలకు దిగుబడి బాగా రావడం మొదలైంది. ఆ తరువాత దేవేష్ వెనుదిరిగి చూడలేదు. సేంద్రీయ పద్ధతిలో మరిన్ని పంటలను పండించడం మొదలు పెట్టాడు.
ఇక దేవేష్ తాను పండించిన పంటలను నేరుగా వినియోగదారులకే అమ్ముతాడు. మధ్యవర్తులు ఉండరు. దీని వల్ల అటు వినియోగదారులకు తక్కువ ధరలకే ఆర్గానిక్ ఉత్పత్తులు లభించేవి. మరోవైపు అమ్మినందుకు వారికి కూడా లాభాలు వచ్చేవి. క్రమ క్రమంగా దేవేష్ తన సంస్థను మరింత విస్తరించాడు. పొలం దగ్గరే కొత్తగా ఓ ప్రాసెసింట్ యూనిట్ నెలకొల్పాడు. అందులో అల్లం, పసుపులను వారే శుభ్రం చేసి వాటిని పొడి చేసి ప్యాకెట్లలో అమ్మడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో దేవేష్ ఆయా ఉత్పత్తులను విదేశాలకు కూడా ఎగుమతి చేయడం ప్రారంభించాడు. దీంతో సత్వ ఆర్గానిక్ మరింత వృద్ధి చెందింది.
అలా దేవేష్ సేంద్రీయ పంటలను సాగు చేస్తే ఆయా ఉత్పత్తులను విక్రయిస్తూ ప్రస్తుతం ఏడాదికి రూ.1.52 కోట్ల వరకు సంపాదిస్తున్నాడు. అయితే కేవలం ఇదే కాదు.. దేవేష్ తమ గ్రామంలోని 200 మంది వరకు రైతులకు సేంద్రీయ పద్ధతిలో పంటలను పండించే విధానాలతోపాటు ఆధునిక వ్యవస్థాయ పద్ధతుల్లో మెళకువలను కూడా నేర్పాడు. దీంతో అనేక మంది రైతులు దేవేష్ బాటలో సేంద్రీయ పంటల సాగు ద్వారా అధిక లాభాలు పొందుతున్నారు. ఈ విషయంలో దేవేష్‌ను అభినందించాల్సిందే..!
0 Response to "Inspiration"
Post a Comment