Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Inspiration

 కళ్ళు లేకపోయినా UPSC ఎక్జామ్ లో టాపర్ గా నిలిచిన పూర్ణ సుందరి.

పూర్ణ సుందరి ఒకటో తరగతి చదివే టప్పుడే  ఒక రోజు వాళ్ళ నాన్నతో నాన్నబోర్టు పై అక్షరాలు కనిపించడం లేదు అని చెప్పింది. వాళ్ల నాన్న కంట్లో నలక పడిఉంటుందిలే అని చెప్పాడు. రోజులు గడుస్తున్నాయి.. ఆ సమస్య అలాగే ఉండిపోవడంతో వాళ్ళ కుటుంబ సభ్యలు ఎంతో ఆందోళనకు గురయ్యారు. చాలా ఆసుపత్రులలో చూపించారు కానీ ఏ మార్పు రాలేదు. ఆరవ తరగతిలో హైస్కూల్లో చేరే సమయానికి పూర్ణ సుందరి చూపును పూర్తిగా కోల్పోయింది. మామూలు స్కూల్లో చేరితే కష్టం అనుకొని అంధుల కోసం నడిపే  ప్రత్యేక పాఠశాలలో చేరింది. అక్కడే బ్రెయిలీ నేర్చుకుంది. పూర్ణ వాళ్ళ అమ్మ ఇంట్లో ఇంటిపని వంటపని తొందరగా పూర్తి చేసేసి పూర్ణకు స్కూల్లో  జరిగే ప్రతి పాఠాన్ని చదివి వినిపించేది. పూర్ణ ఆసక్తిగా వినేది అలా వాళ్ళ అమ్మ వల్ల పదోతరగతి లో ఫస్ట్ వచ్చింది. ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉంటే వాళ్ళ అమ్మ కష్టం కూడా పెరుగుతూ ఉండేది. పూర్ణ ఇంటర్లో కూడా ఫస్ట్ వచ్చింది. ఇంతలో  తమిళనాడు ప్రభుత్వం ఉచితంగా ల్యాప్ టాప్ ను అందించింది అది పూర్ణ చదువుకు ఎంతో ఉపయోగపడింది.
ఇంటర్ నుంచి పూర్ణ సుందరి కలెక్టర్ కావాలని కలలు కనేది అందుకు తగ్గట్టుగా మెటీరియల్ సేకరించుకొంది. దాన్ని పూర్ణ ఫ్రెండ్స్  ఆడియో ఫార్మాట్ లోకి మార్చి ఇచ్చారు. వాళ్ళ అమ్మ ఉదయాన్నే 4:30 కే  పూర్ణ తో పాటు అలారం పెట్టుకుని నిద్ర లేచి పాఠాలు చదివి వినిపించేది. పూర్ణసుందరి  ఆల్ ఇండియా సివిల్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో కోచింగ్ కూడా తీసుకుంది. ఇలా పక్కా ప్రణాళికతో ప్రిపేర్ అయినప్పటికీ మూడు సార్లు (UPSC) యుపిఎస్సి ఎగ్జామ్స్ ఫెయిల్  అయ్యింది. అయినా లక్ష్యాన్ని మాత్రం మర్చిపోలేదు ప్రయత్నం వదలలేదు చివరికి 4వ ప్రయత్నంలో యూపీఎస్సీ తాజా ఫలితాలలో 286 వ ర్యాంక్ సాధించింది.
 “మహిళలు శక్తివంతులు దేన్నైనా గెలవగలరు ఎవరు ఏం చెప్పినా మనపై మనకు నమ్మకం ఉంటే చాలు చివరి విజయం మనదే అవుతుంది” అని నిరూపించింది పూర్ణ సుందరి.  ఆత్మవిశ్వాసంతో అంధురాలు అయిన పూర్ణ సుందరి సాధించిన ఈ విజయం ఎంతోమందికి స్ఫూర్తినిచ్చారు ఉందని భావిస్తున్నాను.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Inspiration"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0