Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

SBI: Did the ATM transaction fail? Let us know this thing

SBI : ఏటీఎం ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయిందా ? ఈ విషయం తెలుసు కుందాం.
SBI: Did the ATM transaction fail? Let us know this thing

మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI కస్టమరా? ఎస్‌బీఐ ఏటీఎంలో తరచూ డబ్బులు డ్రా చేస్తుంటారా? అయితే మీరు కొన్ని విషయాలు జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోవాలి. ఎస్‌బీఐ ఏటీఎంలో మీ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే మీరు ఛార్జీలు చెల్లించాలి. అవును... ఫెయిల్డ్ ఏటీఎం ట్రాన్సాక్షన్ పేరుతో ఎస్‌బీఐ ఛార్జీలు వసూలు చేస్తుంది. మీ అకౌంట్‌లో సరిపడా డబ్బులు లేనప్పుడు ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవుతుంది. అప్పుడు రూ.20+జీఎస్‌టీ చొప్పున ఛార్జీలు వసూలు చేస్తుంది ఎస్‌బీఐ. అందుకే డబ్బులు డ్రా చేసేముందే మీ బ్యాలెన్స్ ఎంతో చెక్ చేసుకొని ఏటీఎంకు వెళ్లడం మంచిది. ఏటీఎంలో కాకుండా మీ బ్యాలెన్స్ ఎన్ని రకాలుగా చెక్ చేయొచ్చు

జూలై 1న ఎస్‌బీఐ ఏటీఎం విత్‌డ్రా నిబంధనలు మారిన సంగతి తెలిసిందే.

అంతకుముందు కరోనా వైరస్ సంక్షోభం కారణంగా ఏటీఎం విత్‌డ్రా విషయంలో కొన్ని మినహాయింపులు, సడలింపులు ఇచ్చింది బ్యాంకు. కానీ జూలై 1 నుంచి పాత నియమనిబంధనలను అమలులోకి తీసుకొచ్చింది. జూలై 1 నుంచి ఎస్‌బీఐ సేవింగ్స్ అకౌంట్ కస్టమర్లు 8 సార్లు మాత్రమే ఏటీఎంలో ఉచితంగా లావాదేవీలు జరపొచ్చు. 5 సార్లు ఎస్‌బీఐ ఏటీఎంలో, 3 సార్లు ఇతర బ్యాంకు ఏటీఎంలో లావాదేవీలు జరపొచ్చు. నాన్ మెట్రోలో అయితే 10 ఏటీఎం లావాదేవీలు ఉచితం. అందులో 5 ఎస్‌బీఐ ఏటీఎంలు, 5 ఇతర బ్యాంకు ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకోవచ్చు.

సేవింగ్స్ అకౌంట్‌లో రూ.1,00,000 కన్నా ఎక్కువ యావరేజ్ బ్యాలెన్స్ ఉన్న కస్టమర్లు ఎస్‌బీఐ గ్రూప్ ఏటీఎంలల్లో ఎన్నిసార్లైనా డబ్బులు డ్రా చేయొచ్చు. ఇక ఎస్‌బీఐ ఏటీఎంలల్లో రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల మధ్య రూ.10,000 కన్నా ఎక్కువ డ్రా చేయాలంటే ఓటీపీ తప్పనిసరి. ఈ నిబంధనను 2020 జనవరి 1 నుంచి అమలు చేస్తోంది బ్యాంకు. కార్డు మోసాలను అరికట్టేందుకు అదనంగా ఈ సెక్యూరిటీ ఫీచర్ అమలు చేసింది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "SBI: Did the ATM transaction fail? Let us know this thing"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0