Schools ... not at all. Survey Report
బడులా... వద్దే వద్దు. సర్వే రిపోర్ట్
కరోనా నేపధ్యంలో మూతబడిన విద్యా సంస్థలు సెప్టెంబరు ఒకటి నంచి పునప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే... కరోనా మహమ్మరి తీవ్రత అంతకంతకూ పెరుగుతుందే తప్ప తగ్గుముఖం మాత్రం కనిపించడంలేదు. ఈ పరిస్థితుల్లో... స్కూళ్ళను తిరిగి ప్రారంభించాలా ? వద్దా ? అన్న విషయమై... విద్యాసంబంధమైన టెక్నాలజీకి చెందిన స్టార్టప్ ఎస్ పి రోబోటిక్ వర్క్స్ దేశవ్యాప్తంగా 3,600 మంది తల్లిదండ్రులు, అదే సంఖ్యలో పిల్లలను ప్రశ్నించి ఓ సర్వే నిర్వహించారు.
వాస్తవానికి... స్కూళ్లను ప్రారంభించాలా ? వద్దా ? అన్నది ప్రభుత్వ నిర్ణయమే అయినప్పటికీ... పిల్లలను స్కూళ్లకు పంపాలా ? వద్దా ? అన్న విషయమై నిర్ణయం తీసుకునేది మాత్రం తల్లిదండ్రులే. తల్లిదండ్రులు... తమ పిల్లలను స్కూళ్లకు పంపడానికి ఇష్టపడకపోతే వాటిని తెరిచినా ఎలాంటి ప్రయోజనం ఉండబోదన్న అభిప్రాయాలు వినిపిస్తోన్న షయం తెలిసిందే.
కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో తల్లిదండ్రులు తమ చిన్నారులను పాఠశాలలకు పంపేందుకు ఇష్టపడటం లేదని ఆ సర్వేలో స్పష్టంగా తేలింది.
విద్యాసంబంధమైన టెక్నాలజీకి చెందిన స్టార్టప్ ‘ఎస్ పి రోబోటిక్ వర్క్స్’ దేశవ్యాప్తంగా 3,600 మంది తల్లిదండ్రులు, అదే సంఖ్యలో పిల్లలను ప్రశ్నించి ఓ సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో... 78 శాతం మంది తల్లిదండ్రులు... తమ పిల్లలను స్కూళ్లకు పంపబోమని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది కూడా అదే తరగతి చదివించడానికైనా తాము సిద్ధమేనని వెల్లడించారు.
బెంగళూరు, ముంబై, హైదరాబాద్‌లతోపాటు మరికొన్ని మినీ మెట్రో సిటీల్లోనైతే... 82 నుండి 86 శాతం మంది తల్లిదండ్రులు ఇవే అభిప్రాయాలను వ్యక్తం చేశారు. తమ పిల్లల ఆరోగ్యాలను రిస్క్ లో పెట్టేందుకు ఏ మాత్రం సిద్ధంగా లేమని కుండబద్ధలు కొట్టారు.
అంతే కాదు... కరోనా కాలంలో 50 శాతం వరకు పిల్లల నిద్రవేళలు సవ్యంగా లేవని ఆ సర్వేలో వెల్లడైంది. పదమూడు శాతం మంది పిల్లల్లో అసలు నిద్రపోయే వేళలు పూర్తిగా క్రమబద్ధతను కోల్పోయినట్టుగా సర్వే స్పష్టం చేయడం గమనార్హం.
ఇక... పిల్లలు... స్మార్ట్ ఫోన్, టీవీ, లాప్ టాప్‌లతో గడిపే సమయం యాభై శాతం వరకు పెరిగిందని 67 శాతం మంది తల్లిదండ్రులు వెల్లడించడం విశేషం. అంతేకాదు... పిల్లల్లో 40 శాతం మందికి కరోనా భయం కారణంగా ‘ఆందోళన’ సమస్యలు పెరిగినట్టుగా సర్వేలో తేలింది.

0 Response to "Schools ... not at all. Survey Report"
Post a Comment