Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Step-by-step schools?

దశలవారీగా పాఠశాలలు?
విడతల వారీ తరగతులు
విద్యా కానుకలుతో సిద్ధమవుతున్న స్కూళ్లు
ప్రతి విద్యార్థి మాస్క్
Step-by-step schools?

కరోనా నడుమ కట్టదిట్టమైన ఏర్పాట్లు
కరోనా ఉధృతి కారణంగా మార్చి మూడో వారం నుంచి పాఠశాలలు నిరవధికంగా మూతపడ్డాయి. మూసి ఉంచిన పాఠశాల తలుపులను సెప్టెంబర్ 5 నుంచి తెరవాలన్న సంకల్పంతో విద్యాశాఖ ప్రయత్నాలు చేపట్టింది. కరోనా నివారణ నిబంధనలు, షరతులను పాటిస్తూ విడతల వారీగా తరగతులు నిర్వహించేందుకు యోచిస్తోంది పాఠశాలలు తెరిచే నాటికే విద్యార్థులందరికీ ఏడు రకాల వస్తువులతో కూడిన విద్యా కానుకను ఇచ్చేందుకు సిద్ధమవుతున్న ప్రభుత్వం ఆ మేరకు తరగతుల నిర్వహణపై స్పష్టత ఇవ్వనుంది. విద్యా కానుకలో భాగంగా పాఠ్య పుస్తకాలు యూనిఫాం (కత్తిరించిన వస్త్రం), బూట్లు ఇప్పటికే జిల్లాకు చేరుకున్నాయి. వాటిని మండలాలకు అక్కడ నుంచి పాఠశాలలకు పంపిణీ చేసే ప్రక్రియ వేగంగా జరుగుతోంది. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో నాడు -నేడు పనుల ను ఈ నెలాఖరులోగా పూర్తి చేయడానికి గడువు ఉన్నప్పటికీ 20 నాటికి ముగించేలా ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ప్రధానంగా సివిల్ వర్క్ ఎదురవుతున్న ఇసుక కొరత సమస్యను అధిగమించేందుకు క్షేత్రస్థాయిలో విద్యాధికారులకు బాధ్యతలు అప్పగించగా తరగతి గదుల్లో ఫర్నిచర్, ఫ్యాన్లు లైట్లు, గ్రీన్ చాక్ బోర్డులు, విద్యుదీకరణ, శుద్ధి చేసిన తాగునీరు పరికరాలు వంటివి దాదాపు పూర్తి కావస్తున్నాయికరోనా వైరస్ విజృంభణ 

కొనసాగుతుండడంతో పరిమితులు, నియమ నిబంధనలు, షరతులను పాటించడంతోపాటు విద్యార్థుల భద్రతకు భరోసా ఇచ్చేలా తరగతుల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు అందుబాటులో ఉన్న అన్ని అంశాలను విద్యాశాఖ పరిశీలిస్తోంది. ఇప్పటికే విద్యా వారధి పేరిట అన్ని తరగతుల విద్యార్థులకు టీవీ పాఠాలు అందుబాటులోకి తేవడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియ వేగంగా జరుగుతున్న విషయం విదితమే. కాగా పాఠశాలల నిర్వహణపై విద్యాశాఖ మార్గదర్శకాలు దాదాపు ఇలా ఉండవచ్చునని భావిస్తున్నారు. అధికారిక ఉత్తర్వులు మార్గదర్శకాలు ఇంకా విడుదల కావాల్సి ఉంది. 
తరగతులు ఒకేసారి కాకుండా విడతల వారీగా ప్రారంభించే అవకాశా లున్నాయి. కొన్ని వారాల వ్యవధితో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు, జూనియర్ కళాశాలలో ప్రారంభించవచ్చు.

 ప్రతి విద్యార్థి మాస్క్ ధరించడంతోపాటు ఇంటి నుంచి వచ్చేటప్పుడే భౌతిక కదూరం పాటించే జాగ్రత్తలు తీసుకోవడంపై తల్లిదండ్రులదే బాధ్యత.

తరగతి గదిలో విద్యార్థి విద్యార్థి మధ్య కనీస దూరం ఆరు అడుగులు ఉండేలా చూస్తారు. తరగతి గదిలో 15 నుంచి 25 మంది మాత్రమే విద్యార్థులు ఉండేలా చర్యలు తీసుకుంటారు. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంటే వారిని రెండు నుంచి నాలుగు విభాగాలుగా వర్గీకరించి రెండు విభాగాలకు ఒక రోజు చొప్పున తరగతులు నిర్వహిస్తారు.

తరగతి గదిలో డెస్క్ లో విద్యార్థుల పేర్లను రాస్తారు. ఆ ప్రకారమే ప్రతిరోజు కూర్చోవాలి. సీటు మారకూడదు రోజూ హోం అసైన్ మెంట్లను విద్యార్థులకు ఇస్తారు. 

తరగతి గదుల్లోతలుపులు, కిటికీలు పూర్తిగా తెరిచి ఉంచాలి టీచర్ తో సహా విద్యార్థులందరికీ పాఠశాల ప్రవేశ ద్వారం వద్దే శరీర ఉష్ణోగ్రతలు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తారు. స్కూలు బయట తిను బండారాలు విక్రయించే దుకాణాలు ఉండకూడదు.

విద్యార్థులకు ఎట్టి పరిస్థితుల్లోనూ పుస్తకాలు, పెన్ను, పెన్సిల్, ఆహారంవంటివి తోటి విద్యార్థులకు ఇవ్వడం కాని, పరస్పరం మార్చుకోవడం కానిచేయకూడదు. సొంతంగా మంచినీళ్ల సీసా తెచ్చుకోవచ్చు.

 తరగతి గదులను నిత్యం శుభ్రం చేయించే బాధ్యత ప్రధానోపాధ్యాయుడు ప్రిన్సిపాల్ దే. ప్రతీరోజు ఉదయం అసెంబ్లీని తరగతి గదిలో మాత్రమే నిర్వహించుకోవాలి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Step-by-step schools?"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0