Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

The newest plan for reading

చదువుకు సరికొత్త ప్రణాళిక
The newest plan for reading


  • కొవిడ్‌ వ్యాప్తి ప్రభావంతో మారిన విధానం
  • పాఠశాలల్లో ప్రవేశాలు ప్రారంభం
  • విద్యార్థులపై నిరంతర పర్యవేక్షణ
  • తల్లిదండ్రులతో వాట్సప్‌ గ్రూపులు


సుమారుగా గత 5 నెలల నుంచి కరోనా వైరస్‌ విజృంభిస్తుండడంతో ప్రభుత్వ పాఠశాలలను గత విద్యాసంవత్సరం ముగియకముందే పాఠశాలల్లో తరగతులను నిలిపేశారు. ఇంకా కరోనా ప్రభావం తగ్గకపోవడంతో ప్రత్యామ్నాయ క్యాలెండర్‌ అమలుకు రాష్ట్ర పాఠశాల విద్యావిభాగం ఉత్తర్వులు ఇచ్చింది

సెప్టెంబర్‌ 5 నుంచి పాఠశాలల పునఃప్రారంభం చేపట్టాలని భావిస్తున్న ప్రభుత్వం అప్పటి వరకు విద్యార్థులపై పర్యవేక్షణ కొనసాగించే దిశగా ప్రణాళిక అమలుకు మార్గదర్శకాలు ఇచ్చింది. పాఠశాలల్లోను విద్యార్థుల ప్రవేశాల ప్రక్రియను కూడా ప్రారంభించారు.

కొవిడ్‌ నేపథ్యంలో విద్యార్థులకు పాఠాలు బోధించే విధానం మారుతోంది. వారి ప్రణాళిక రూపొందించుకొని అమలు చేయడం మొదలుపెట్టిన తరువాత ఉపాధ్యాయులు ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లోనూ వారానికి ఒకరోజు హాజరుకావాలి.

అందరూ ఒకేరోజు హాజరుకావాల్సిన అవసరం లేదు. వారు ఏరోజు పాఠశాలలకు హాజరుకావాలనేది పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తగిన ప్రణాళికలు రూపొందిస్తారు. హాజరైనపుడు ఉపాధ్యాయుడు బయోమెట్రిక్‌లో నమోదు చేసుకోవాల్సిన పనిలేదు.

దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు, కంటైన్మెంట్‌లో నివసిస్తున్నవారు, శారీరక వైకల్యంగలవారు, కంటైన్మెంట్‌ జోన్‌లో పాఠశాల ఉన్న వారు భౌతికంగా పాఠశాలకు హాజరుకానవసరం లేదు.

వారు కూడా తమ తరగతివారీగా, విద్యార్థివారీగా ప్రణాళికలు తప్పనిసరిగా రూపొందించాలి.

విద్యార్థుల తల్లిదండ్రులతో చరవాణిలో ఉత్తరప్రత్యుత్తరాలు జరుపుతూ ప్రణాళికలు అమలు చేయాలి.
ఉపాధ్యాయుల పనితీరుపై సమీక్ష
ఈ విద్యా సంవత్సరానికి ప్రత్యామ్నాయ క్యాలెండర్‌లో సూచించిన విధంగా ప్రతి ఉపాధ్యాయుడు రోజుకు కనీసం 15 మంది విద్యార్థుల తల్లిదండ్రులతో పిల్లలు చేపట్టాల్సిన విద్యా కార్యక్రమాలను వివరించాలి.
మరుసటి రోజు నుంచి రోజుకు ఐదుగురు చొప్పున తల్లిదండ్రులకు మళ్లీ ఫోన్‌ చేసి పిల్లల పురోగతి ఏ విధంగా ఉందో తెలుసుకోవాలి. వారానికి కనీసం 40 మంది విద్యార్థుల పురోగతిని కనుక్కోవాలి. ఆ విధంగా ఉపాధ్యాయుడు తాను చేసినరోజువారి పనిని ఒక డైరీలో నమోదు చేసుకొని ఆ పేజీని ప్రతి శనివారం ఫొటో ద్వారా డాక్యుమెంట్‌ రూపంలో Google ఫారంలో అప్‌లోడ్‌ చేయాలి.
వాట్సప్‌ గ్రూప్‌
విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ఒక వాట్సప్‌ గ్రూప్‌ రూపొందించి రోజువారీ కార్యక్రమాలు, విద్యార్థుల అభ్యసన ప్రక్రియ, విద్యార్థుల మూల్యాంకనం, ప్రగతికి సంబంధించిన విషయాలు చర్చించాలి.

విద్యార్థుల సంఖ్య పెంచేలా కృషి
జిల్లాలోని ఉప,మండల విద్యాధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రభుత్వ ఉత్తర్వులను పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తున్నాం.
పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెంచుకునేలా కసరత్తులు చేస్తున్నాం. పాఠశాలల్లో విద్యార్థులను చేర్చుకునే ప్రక్రియ ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది.
తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించేలా ప్రణాళికలు రూపొందించుకొని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అడుగులు వేస్తున్నాం.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "The newest plan for reading"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0