Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

The second time corona: the scientists who actually described it.


రెండోసారీ కరోనా :వాస్తవమెంటో వివరించిన శాస్త్రవేక్తలు.

ప్రస్తుతం ప్రపంచం దృష్టి కరోనా రీఇన్ఫెక్షన్‌పై పడింది. రెండోసారీ కరోనా సోకుతుందేమోననే అనుమానం ప్రజల్లో బయలు దేరింది. హాంగ్‌కాంగ్‌లో తొలిసారిగా ఇటువంటి కేసు బయటపడింది. అక్కడ.. 33 ఏళ్ల యువకుడొకరు రెండోసారి కరోనా బారిన పడ్డాడు. అయితే రెండు సందర్భాల్లోనూ రెండు భిన్నమైన వైరస్‌ల ద్వారా అతడు వ్యాధి బారిన పడ్డాడని శాస్త్రవేత్తలు నిరూపించారు. వైరస్‌ల జన్యుక్రమం పరిశీలించిన అనంతరం వారు ఈ నిర్ణయానికి వచ్చారు.

అయితే రెండోసారి కరోనా కారణంగా సదరు వ్యక్తిలో ఎటువంటి అనారోగ్య లక్షణాలు కనిపించలేదని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో రెండోసారి కరోనా బారినపడతామా అనే చర్చ ప్రపంచ వ్యాప్తంగా మొదలైంది.

ఇప్పటివరకూ జరిగిన పరిశోధన ప్రకారం.. కరోనా నుంచి కోలుకున్న వ్యక్తిలో రోగ నిరోధక శక్తి బలం పుంజుకుంటుంది. కరోనాను నిరోధించే యాంటీబాడీలు శరీరంలో అభివృద్ధి చెందుతాయి. అంతే కాకుండా.. మరోసారి శరీరంలోకి కరోనా ప్రవేశిస్తే గుర్తుపట్టేందుకు వీలుగా మెమరీ టీ, బీ కణాలు కూడా అభివృద్ధి చెందుతాయి.

అయితే కోలుకున్న 2-3 నెలల తరువాత శరీరంలోని కరోనా నిరోధక యాంటీబాడీలు సంఖ్య తగ్గుముఖం పడుతుంది. ఈ సందర్భంలో కరోనా పరీక్ష జరిపితే పాటిజిటివ్ అనే వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తొలి ఇన్ఫెక్షన్‌కు సంబంధించి శరీరం ఇంకా మృత కరోనా వైరస్‌లను విడుదల చేస్తుందని, దీని కారణంగానే పాటిజిటివ్ వచ్చే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. ఈ పరిస్థితిలో వ్యక్తుల్లో కరోనా రోగ లక్షణాలు కనిపించే అవకాశం లేదని వారంటున్నారు. ఇక హాంగ్‌కాంగ్ కేసులో రెండో రకం వైరస్ కారణంగా కరోనా సోకినట్టు నిర్ధారణ అయినప్పటికీ బాధితుడిలో ఎటువంటి రోగలక్షణాలూ కనిపించలేదని వారు చెబుతున్నారు.

దీనిపై సీఎస్ఐఆర్- ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ డైరెక్టర్ డా. అనురాగ్ అగర్వాల్ మరింత స్పష్టత నిచ్చారు. 'కరోనా రీఇన్‌ఫెక్షన్ కేసులు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. అయితే మనం ఇంతవరకూ అసలైన రీఇన్‌ఫెక్షన్ కేసు చూడలేదు. రెండూసార్లు రోగిలో కరోనా రోగ లక్షణాలు కనిపించిన ఉదంతాలు ఇంతవరకూ నమోదు కాలేదు. తొలిసారి రోగిలో వ్యాధి లక్షణాలు కనపడినా..రెండోసారి ఎటువంటి అనారోగ్యం బయటపడని ఘటనలు మాత్రమే మనం చూస్తున్నాం. రెండు సార్లూ వ్యాధి లక్షణాలు బయటపడే నిజమైన రిఇన్‌ఫెక్షన్ కేసును మనం ఇప్పటివరకూ చూడలేదు' అని డా. అనురాగ్ వ్యాఖ్యానించారు.

రెండోసారి శరీరంలోకి కరోనా వైరస్ ప్రవేశిస్తే.. మెమరీ టీ, బీ కణాలు వాటిని గుర్తుపట్టి దాడి ప్రారంభిస్తాయని పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డా. శ్రీనాథ్ తెలిపారు. ఈ కారణంగా రెండోసారి కరోనా వైరస్ పాల పడ్డా కూడా వ్యాధి తీవ్రత తక్కువగా ఉంటుందని ఆయన తెలిపారు.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "The second time corona: the scientists who actually described it."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0