UPSC Jobs: Notification for replacement of total 559 posts ... Vacancies in Railways too.
UPSC Jobs : మొత్తం 559 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ... రైల్వేలోనూ ఖాళీలు.
UPSC CMS Exam 2020 Notification యూపీఎస్సీ కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ నోటిఫికేషన్ విడుదల చేసింది . 559 ఖాళీలను ప్రకటించింది . నోటిఫికేషన్ వివరాలు తెలుసుకుందాం.యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC కేంద్ర ప్రభుత్వ సంస్థలు, విభాగాల్లో వేర్వేరు పోస్టుల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2020 ద్వారా 559 ఖాళీలను భర్తీ చేయనుంది. భారతీయ రైల్వే, సెంట్రల్ హెల్త్ సర్వీస్‌తో పాటు పలు విభాగాల్లో ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 ఆగస్ట్ 18 చివరి తేదీ. ఎంబీబీఎస్ పాసైనవారు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను https://upsc.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. https://upsconline.nic.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి.
మొత్తం ఖాళీలు- 559
జూనియర్ స్కేల్ పోస్టులు(సెంట్రల్ హెల్త్ సర్వీసెస్)- 182
అసిస్టెంట్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్(రైల్వేస్)- 300
అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్(ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ హెల్త్ సర్వీసెస్)- 66
జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్(న్యూ ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్)- 04
జనరల్ డ్యూటీ మెడికల్ గ్రేడ్ 2- 07
ముఖ్యమైన తేదీలు
దరఖాస్తు ప్రారంభం- 2020 జూలై 29
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఆగస్ట్ 18 సాయంత్రం 6 గంటలు
ఫీజు చెల్లించడానికి చివరి తేదీ- 2020 ఆగస్ట్ 18
రాతపరీక్ష- 2020 అక్టోబర్ 22
విద్యార్హత- ఎంబీబీఎస్ పాస్ కావాలి.
వయస్సు- 2020 ఆగస్ట్ 1 నాటికి 32 ఏళ్లు.
ఎంపిక విధానం- కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ.
దరఖాస్తు ఫీజు- రూ.200. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు.
0 Response to "UPSC Jobs: Notification for replacement of total 559 posts ... Vacancies in Railways too."
Post a Comment