Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Vaccine available only after one year

ఏడాది తర్వాతే అందుబాటులోకి వ్యాక్సిన్‌
ఉచిత పంపిణీ కోసం నిధుల సమీకరణ
ప్రపచం ఆరోగ్య సంస్థ చీఫ్‌ సైంటిస్టు సౌమ్య స్వామినాథన్‌
Vaccine available only after one year

చెన్నై : కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావాలంటే ఏడాది లేదా ఏడాదిన్నర సమయం పడుతుందని, అంతవరకు ప్రజలు ఓపికతో ఉండాల్సిన అవసరం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ సైంటిస్ట్‌ సౌమ్య స్వామినాథన్‌ అన్నారు. ఒకటి లేదా రెండు వ్యాక్సిన్‌లు పూర్తి పరీక్షల సమాచారాన్ని ఈ ఏడాది చివరి నాటికి పొందే అవకాశాలున్నాయని అన్నారు. 'సాధారణ ప్రజలకు వ్యాక్సిన్‌ ఉచితంగా లభించే అవకాశం ఉంది. అందుకు ప్రపంచ స్థాయిలో నిధులను సమీకరిస్తున్నాం' అని ఆమె తెలిపారు. కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వానికి సౌమ్య అందించిన విలువైన సూచనలకు కృతజ్ఞతగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆమెకు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి అవార్డును ప్రదానం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా 200 వ్యాక్సిన్లు అభివృద్ధి దిశలో ఉన్నాయని ఆమె తెలిపారు. వ్యాక్సిన్‌ అభివృద్ధికి ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలు జారీ చేసిందని, వాటికి అనుగుణంగా ఉన్నవాటికే అధికారాలు, లైసెన్సులు ఇస్తారని తెలిపారు. వ్యాక్సిన్‌ కోసం సమాచారం ఇచ్చే దశకు ఏ వ్యాక్సినూ ఇంకా చేరుకోలేదని, ఈ ఏడాది చివరి నాటికి ఒకటి లేదా రెండు వ్యాక్సిన్లు మూడు దశల పరీక్షలతో కూడిన సమాచారంతో ముందుకు వస్తాయని ఆశిస్తున్నట్లు సౌమ్య తెలిపారు.
భారత్‌లో వ్యాక్సిన్‌ ట్రయల్‌ ఫేజ్‌-1 దశ నడుస్తోందని అన్నారు. ఇంకా 2,3 దశలు పూర్తి చేసేందుకు 9 నుండి 12 నెలలు పడుతుందని చెప్పారు. వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చేంత వరకు ప్రజలు ఎంతో ఓపికతో ఉండాలని, భౌతిక దూరం పాటించాలని, మాస్క్‌లు ధరించాలని, గుంపులు గుంపులుగా ఉండే ప్రాంతాలకు దూరంగా ఉండాలని చెప్పారు. మరో ఏడాది పాటు..ఈ నూతన జీవితానికి సర్దుకుపోవాలని, ఇది మన సామాజిక బాధ్యతని హితవు పలికారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Vaccine available only after one year"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0