whatsApp: Recover deleted photos and videos on WhatsApp like this
WhatsApp : వాట్సప్‌లో డిలిట్ అయిన ఫోటోలు , వీడియోలు తిరిగి పొందండి ఇలా
మీరు వాట్సప్‌లో ఏదైనా ఫోటోను అనుకోకుండా డిలిట్ చేశారా? దాచుకుందామనుకున్న వీడియో పొరపాటున డిలిట్ అయిందా? మళ్లీ ఆ ఫోటో, వీడియో ఎలా పొందాలో అర్థం కావట్లేదా? చాలా సింపుల్. మీరు వాట్సప్‌లో డిలిట్ చేసిన ఫోటోలు, వీడియోలు తిరిగి పొందొచ్చు. ఇదేమీ పెద్ద సమస్య కాదు. సాధారణంగా ఇలాంటి పొరపాట్లు జరుగుతుంటాయని యూజర్లకు అనుకూలంగా ఫీచర్స్ తీసుకొస్తూ ఉంటుంది వాట్సప్. గతంలో అయితే వాట్సప్‌లో ఫోటోలు, వీడియోలు డిలిట్ చేస్తే ఇక రీస్టోర్ చేయడం సాధ్యమయ్యేది కాదు. ఆ ఫోటోలు, వీడియోలు పంపినవారిని మళ్లీ సెండ్ చేయమని అడగాల్సి వచ్చేది. కానీ ఇప్పుడా సమస్యే లేదు. మీరు వాట్సప్‌లో డిలిట్ చేసిన ఫోటోలు, వీడియోలతో పాటు ఇతర ఫైల్స్‌ని రీస్టోర్ చేయొచ్చు.
ఎలాగో వివరణ
World Photography Day: మీ స్మార్ట్‌ఫోన్‌కి కెమెరా ఎంత అవసరం... తెలుసుకోండి World Photography Day: ఫోటోలు బాగా రావాలా? బెస్ట్ కెమెరా ఉన్న 8 స్మార్ట్‌ఫోన్స్ ఇవే
వాట్సప్‌లో పొరపాటున డిలిట్ అయిన ఫోటో, వీడియో లేదా ఇతర ఫైల్ ఎన్ని రోజుల క్రితం మీకు వచ్చిందో ఓసారి చూడండి. గత 30 రోజుల్లో వచ్చిందంటే ఆ ఫైల్ ఎక్కడికీ పోదు. మీకు ఫైల్ పంపిన వారి ఛాట్ ఓపెన్ చేసి ఆ ఫైల్ వెతికి సులువుగా డౌన్‌లోడ్ చేయొచ్చు. అయితే ఈ అవకాశం మీకు ఫైల్ వచ్చిన 30 రోజుల వరకు మాత్రమే. అప్పటివరకు ఆ ఫైల్ వాట్సప్ సర్వర్‌లోనే ఉంటుంది. 30 రోజులు దాటిందంటే వాట్సప్ సర్వర్ నుంచి కూడా ఫైల్ డిలిట్ అవుతుంది. కాబట్టి మీరు 30 రోజుల్లోనే ఆ ఛాట్ నుంచి ఫైల్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే మీరు ఛాట్ డిలిట్ చేయకుండా ఉంటేనే ఇది సాధ్యం. మీరు ఒకవేళ ఛాట్ డిలిట్ చేసినట్టైతే అందులోని ఏ ఫైల్ కూడా తిరిగి డౌన్‌లోడ్ చేయలేరు.
ఇలా వాట్సప్‌లో యూజర్లకు తెలియని ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ చాలానే ఉన్నాయి. ఇలాంటి మరిన్ని ఫీచర్స్ తీసుకొచ్చేందుకు వాట్సప్ ఎప్పుడూ కసరత్తు చేస్తూనే ఉంటుంది. త్వరలో స్టిక్కర్స్‌ని సెర్చ్ చేసే ఫీచర్‌ని తీసుకురాబోతోంది వాట్సప్. ఇలా సెర్చ్ ఆప్షన్ గతంలో కేవలం ఎమొజీ, గిఫ్ ఫైల్స్‌కు మాత్రమే ఉండేది. ఎమొజీ, గిఫ్ ఫైల్స్‌ని మాత్రమే సెర్చ్ ఆప్షన్ సపోర్ట్ చేస్తుంది. మీరు మూడ్‌కి తగ్గట్టుగా Happy, Sad, Birthday, Love అని ఎమొజీ లేదా గిఫ్ ఫైల్స్ సెర్చ్ చేయొచ్చు. ఇలా సెర్చ్ చేసే ఆప్షన్ స్టిక్కర్లకు లేదు. అందుకే స్టిక్కర్‌లో కూడా సెర్చ్ ఆప్షన్ తీసుకురానుంది వాట్సప్. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను బీటా యూజర్లు టెస్ట్ చేస్తున్నారు.
0 Response to "whatsApp: Recover deleted photos and videos on WhatsApp like this"
Post a Comment