Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

95% of people have the common cold!

95%మందిలో సాధారణ జ్వరాలే!
జలుబు, దగ్గులకూ పరుగెత్తు కొస్తున్నారు
అన్నీ కరోనా కాదు
ప్రముఖ జనరల్‌ మెడిసిన్‌ వైద్య నిపుణులు డా.వి.రామనరసింహం
95% of people have the common cold!

 అసలే కరోనా కాలం. పైగా వర్షాలు కురుస్తున్నాయి. జ్వరాలను వెంటేసుకొచ్చాయి. ఎవరిలోనైనా దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే ఆందోళన చెందుతున్నారు. అది కరోనానో, సాధారణ వైరల్‌ జ్వరమో తేల్చుకోలేక బెంబేలెత్తుతున్నారు. రెండింటికీ కొన్ని లక్షణాలు ఒకేలా ఉండటమే ఇందుకు కారణం. అదే సమయంలో ప్రైవేటు ఆసుపత్రులూ చికిత్సకు నిరాకరిస్తున్నాయి. మొదట కరోనా పరీక్షలు చేయాల్సిందేనంటూ చెబుతున్నాయి. ఫలితంగా ప్రభుత్వ ఆసుపత్రులకు జ్వర పీడితుల తాకిడి పెరిగింది. అసలు ఈ సీజన్‌లో వచ్చే వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు ఏంటి? కరోనాకీ, వాటికీ లక్షణాల్లో ప్రధానంగా ఎలాంటి తేడాలుంటాయి? వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు ప్రబలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వంటి అంశాలను విశాఖకు చెందిన ప్రముఖ వైద్యుడు (జనరల్‌ మెడిసిన్‌) డా.వి.రామనరసింహం ‘ఈనాడు’కు వివరించారు. ఆయన విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా, వైద్య విద్యాశాఖ అదనపు సంచాలకుడిగా పని చేసి ఉద్యోగ విరమణ చేశారు.


95%మందిలో సాధారణ జ్వరాలే!


  • కొవిడ్‌ రోగుల్లో లక్షణాలు ఎలా పెరుగుతాయంటే...
  • కరోనా సోకిన వారిలో మొదట్లో రుచి, వాసన తెలియవు. తుమ్ములు, దగ్గు ఉండొచ్చు. 
  • లో జ్వరం ఉంటుంది. కొందరిలో ఒకట్రెండు విరేచనాలు అవుతాయి. ఇవన్నీ తొలి దశలో కనిపించే లక్షణాలు.
  •  లక్షణాలు తీవ్రమయ్యే కొద్దీ జ్వరం, దగ్గు పెరుగుతాయి. ఆయాసమూ మొదలవుతుంది.
  • మూడో దశలో వ్యాధి లక్షణాలన్నీ తీవ్రస్థాయికి చేరతాయి. ఆయాసం, జ్వర తీవ్రత బాగా పెరుగుతాయి.

భయపడితే సరిపోదు

  • ప్రస్తుతం చాలామంది కరోనా అంటే భయపడుతున్నారు. 
  • జాగ్రత్తలు మాత్రం తీసుకోవడం లేదు. అప్రమత్తంగా ఉన్నప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. 
  • ఇప్పటికీ చాలామంది భౌతిక దూరం పాటించడం లేదు. మాస్క్‌లు వాడటంలేదు. 
  • పెట్టుకున్నా... ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు తీసేస్తున్నారు. దానివల్ల ప్రయోజనం లేదు. 
  • కరోనా, ఇతర వైరల్‌ ఇన్‌ఫెక్షన్లయినా... అవి ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒకటే.

తేలిగ్గా తగ్గే జబ్బును ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు

  • కరోనాతోపాటు అన్ని వైరల్‌ ఇన్ఫెక్షన్లు తేలికపాటి చికిత్సతో నయమయ్యేవే. అయితే... 
  • సమస్యను ఎంత త్వరగా గుర్తించారు? ఎంత త్వరగా చికిత్స తీసుకున్నారన్నది అత్యంత ముఖ్యం. 
  • చాలామంది పరీక్ష చేసుకుంటే పాజిటివ్‌ వస్తుందేమో అన్న భయంతో వైద్యుడి వద్దకు వెళ్లడంలేదు. 
  • తేలిగ్గా తగ్గే జబ్బును ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. 
  • ఇతర వైరస్‌లతో పోలిస్తే కరోనాతో ఉన్న ప్రధాన సమస్య అధిక వ్యాప్తి. 
  • కోవిడ్‌ రోగి దగ్గినా తుమ్మినా.. ఆ గదిలో ఉన్న వారందరికీ అంటుకుంటుంది.

60 ఏళ్లు దాటితే టీకాలు వేసుకోవాల్సిందే

  • న్యుమోనియా, ఫ్లూ జ్వరాలను నివారించేందుకు టీకాలు ఉన్నాయి. 
  • వాటికి పెద్ద ఖర్చూ కాదు. 60 ఏళ్లు దాటిన వారంతా కచ్చితంగా వీటిని వేయించుకోవాలి. 
  • మిగతా వారు వేయించుకోవడమూ మంచిదే. 
  • ఇతర వైరల్‌ జ్వరాలను తట్టుకునేందుకు విటమిన్‌-సి, డి వంటివి అధికంగా లభించే ఆహారాన్ని తినాలి. 
  • అతిగా ఆవిరి పట్టక్కరలేదు. మితంగా మేలు. ఏవేవో కషాయాలు తాగడం అంత మంచిది కాదు.



మా దగ్గరకి   చికిత్సకు వచ్చే వారిలో  95% మందిలో సాధారణ జ్వరాలే ఉంటున్నాయి. జలుబు, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తే... కరోనా అన్న భయంతో వస్తున్నారు.’
‘వైరల్‌ జ్వరాలకు శక్తిమంతమైన యాంటీబయాటిక్స్‌, ఇంజెక్షన్లు వాడాల్సిన అవసరం లేదు. వ్యాధిని మొదట్లోనే గుర్తిస్తే తక్కువ మందులతోనే నయం చేయవచ్చు.
 : డా.వి.రామనరసింహం


కొవిడ్‌, ఇతర వైరల్‌ జ్వరాల మధ్య ప్రధానమైన తేడాలు.  

కొవిడ్‌ఇతర   వైరల్‌ జ్వరాలు
●వాసన, రుచి తెలియకపోవడం●ఈ లక్షణాలు ఉండవు.
●కొందరిలో ఒకట్రెండు విరేచనాలు అవుతాయి  ●కఫం ఎక్కువగా ఉండదు,ఛాతీ నొప్పి ఉండదు●గ్యాస్ట్రో ఎంటరైటిస్‌ అయితే నీళ్ల విరేచనాలు బాధిస్తాయి.●న్యుమోనియాలో కఫం ఎక్కువగా పడుతుంది,ఛాతీ నొప్పి ఉంటుంది
●ఇన్‌ఫెక్షన్‌ 2-14 రోజుల్లో బయట పడుతుంది    ●ఛాతీ నొప్పి ఉంటుంది●ఒకటి నుంచి నాలుగు రోజుల్లో బయటపడతాయి
జ్వర తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది
●వ్యాధి లక్షణాలు నెమ్మదిగా మొదలవుతాయి  ●ఒళ్లు నొప్పులు కొంత తక్కువగా ఉంటాయి  ●వ్యాధి లక్షణాలు అకస్మాత్తుగా మొదలవుతాయి.
ఒళ్లు నొప్పులు తీవ్రంగా ఉంటాయి
●ఆయాసం ప్రధాన సమస్యగా తయారవ్వచ్చు  ●లక్షణాలు తగ్గడానికి 7-25 రోజులు పడుతుంది      ●ఆయాసం ఉండదు●వారం రోజుల్లో వ్యాధి లక్షణాలు తగ్గుతాయి


              

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "95% of people have the common cold!"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0