Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

AP TEACHERS TRANSFERS-2020

నేటి కల్లా టీచర్ల వివరాల నమోదుకు ఆదేశం.


  • బదిలీల దిశగా కసరత్తు ప్రారంభం
  • డీఈవో పూల్‌ కోటాఉపాధ్యాయులపై స్పష్టత లేమి


 ఉపాధ్యాయ బదిలీల జీఓ వెలువడకున్నా దీనికి సంబంధించిన కసరత్తుకు పాఠశాల విద్యాశాఖ అధికారికంగా శ్రీకారం చుట్టింది. సోమవారం నాటికి పాఠశాలల వారీగా ఉన్న ఖాళీ పోస్టుల వివరాలను కమిషనర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌(సీఎస్‌ఈ) లాగిన్‌కు పంపాలని జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. దీంతో బదిలీల్లో తొలి అంకానికి తెరలేచినట్లు అయింది. ఆదివారం సెలవు అయినా పలువురు ఎంఈవోలు, హైస్కూల్‌ ప్రధానోపాధ్యాయులు డీఈఓ కార్యాలయానికి చేరుకుని కంప్యూటర్‌ విభాగం సిబ్బందితో వివరాలు ఎలా ఎంఈఓ లాగిన్‌కు ఆన్‌లైన్‌లో అనుసంధానం చేయాలో అడిగి తెలుసుకున్నారు. ఇలా వచ్చిపోయే వారితో డీఈవో కార్యాలయం సందడిగా మారింది. జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్‌.ఎస్‌.గంగాభవాని జిల్లాలోని అన్ని మండల విద్యాశాఖ అధికారుల నుంచి డీఈవో లాగిన్‌కు సోమవారానికి వివరాలను అప్‌డేట్‌ చేయాలని ఆదేశించారు. జిల్లాల వారీగా ఖాళీ పోస్టులు.. ఒకే చోట 8 ఏళ్లుగా పనిచేస్తున్న ఉపాధ్యాయుల వివరాలు, ఐదేళ్ల సర్వీసు పూర్తయిన హెచ్‌ఎంల సమాచారం ప్రతిదీ తెలుస్తాయి. ఈ సమాచారం తొలుత సేకరించడం వల్ల బదిలీలకు ఎంత మంది అర్హులు కాబోతున్నారనేది ప్రభుత్వానికి స్పష్టత వస్తుంది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల వివరాలను మండల విద్యాశాఖ అధికారి, ఉన్నత పాఠశాలల్లో నెలకొన్న ఖాళీల వివరాలను ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆన్‌లైన్‌లో ఎంఈవో లాగిన్‌కు పంపాలి. ఈ వివరాల నమోదుకు ఉన్నత పాఠశాలల హెచ్‌ఎంలు సైతం సోమవారం ఎంఈఓ కార్యాలయానికి వెళ్లి ఎంఈఓ లాగిన్‌లోనే నమోదు చేయాలని సూచించారు. ఈ ప్రక్రియ నిర్వహణతో ఉపాధ్యాయవర్గంలో ఆసక్తి నెలకొంది.
కొలిక్కిరాని హేతుబద్దీకరణ.
తక్కువ మంది పిల్లలు ఉన్న పాఠశాలల్లో టీచర్ల సర్దుబాటు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. దీనిపై స్పష్టత లేకుండా బదిలీలు చేపడితే ఇబ్బందులు వస్తాయని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన జనగన్న గోరుముద్ద పథకం, నాడు-నేడు పనులతో ఆకర్షితులైన తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో నుంచి తీసుకొచ్చి సర్కారీ పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. ఈ ఏడాది చాలా పాఠశాలల్లో ప్రవేశాలు పెరిగాయి. ప్రభుత్వం మాత్రం ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి ఆయా పాఠశాలల్లో ఉన్న పిల్లల సంఖ్య, టీచర్ల నిష్పత్తి ఆధారంగా మిగులు ఉపాధ్యాయులను గుర్తించాలని ఆదేశించింది. ప్రస్తుతం ఉన్న ప్రవేశాలను పరిగణనలోకి తీసుకుని హేతుబద్ధీకరణ చేపడితే మిగులు ఉపాధ్యాయుల లెక్కలు పక్కాగా తేలడానికి ఆస్కారం ఉంటుంది. దీన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది.
వివరాల నమోదు ఇలా.
ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సిన టీచర్ల వివరాలకు సంబంధించి ట్రెజరీ ఐడీ నంబరు, ఉపాధ్యాయుని పేరు, పని చేస్తున్న పాఠశాల పేరు, ఎన్నాళ్ల నుంచి అక్కడ పని చేస్తున్నారు, సర్వీసులో ఎప్పుడు ప్రవేశించారు, ప్రస్తుతం పని చేస్తున్న పాఠశాలలో ఎప్పుడు చేరారు, బోధిస్తున్న అంశం, ఎస్‌జీటీనా, స్కూల్‌ అసిస్టెంటా?, ఏ భాషలో బోధిస్తున్నారు, గడిచిన 8 ఏళ్లలో స్పౌజ్‌ కోటా ఏమైనా వినియోగించుకున్నారా, గతంలో ఎప్పుడైనా ప్రిఫరెన్షియల్‌ కేటగిరీలో బదిలీ పొందారా, పొందితే ఆ వివరాలు నమోదు చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది.
ఉన్నతీకరించినపాఠశాలల పరిస్థితి ఏమిటి?
జిల్లాలో అడవితక్కెళ్లపాడు, వెంగళాయపాలెం, జగ్గాపురం తదితర 38 ప్రాథమికోన్నత పాఠశాలలను ఉన్నత పాఠశాలలుగా రెండేళ్ల క్రితమే ఉన్నతీకరించారు. కానీ ఇప్పటికీ ఆ స్కూళ్లకు రెగ్యులర్‌ ప్రధానోపాధ్యాయుల పోస్టు మంజూరు కాలేదు. సమీపంలో ఉన్న పాఠశాల హెచ్‌ఎంను ఇన్‌ఛార్జిగా పెట్టి పర్యవేక్షిస్తున్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకోవాలని సంబంధిత పాఠశాలల ఉపాధ్యాయులు కోరుతున్నారు. జిల్లాలో 2014 డీఎస్సీలో ఉత్తీర్ణులైన సుమారు 28 మంది ఉపాధ్యాయులకు ఇప్పటి దాకా పోస్టింగ్‌లు ఇవ్వలేదు. వారిని డీఈవో కోటా పూల్‌లో ఉంచి వారి సేవలు ఎక్కడ అవసరమైతే అక్కడకు పంపి వినియోగించుకుంటున్నారు. వీటిని బదిలీల ప్రక్రియ ప్రారంభం కాక మునుపే పరిష్కరించాలి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "AP TEACHERS TRANSFERS-2020"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0