Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

AP TEACHERS TRANSFERS 2020

టీచర్ల బదిలీ ఖాయం
AP TEACHERS TRANSFERS 2020

వారం రోజుల్లోగా ఉత్తర్వులు
కమిషనరేట్లో ప్రత్యేకంగా విభాగం
ఇప్పటికే ఖాళీలను గుర్తించిన డీఈఓలు
సర్దుబాటుపైనా స్పష్టత వచ్చే అవకాశం


 • రాష్ట్రంలోని ప్రభుత్వ,జిల్లా, మండల పరిషత్ పాఠశాలల్లో ఉపాధ్యాయల బదిలీల అంశంపై విద్యాశాఖ చేపట్టిన కసరత్తు చివరిఅంకానికి చేరుకుంది.
 • ఇప్పటికే జిల్లాలవారీగా డీఈఓలుఖాళీలతోపాటు లాంగ్ స్టాండింగ్ వివరాలను పాఠశాల విద్యాశాఖకు పంపించారు. ఉపాధ్యాయుల సర్దుబాటు విషయంలో డీఈఓలు పలు అనుమానాలను లేవనెత్తుతున్నారు. 
 • ఈ నేపథ్యంలో బదిలీలు, సర్దుబాటుపై అనుమానాల నివృత్తి చేయడంతోపాటు అన్నింటిని ఆన్లైన్ చేసేందుకు విద్యాశాఖ కమిషనరేట్లో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు.
 • పాఠశాల విద్య డైరెక్టర్ వాడ్రేవు చిన్నవీరభద్రుడుఆదేశాల మేరకు ఎన్‌సీఈఆర్‌టీ ఐటీ సెల్ కు చెందిన సీహెవీ రమేష్ కుమార్, డైరెక్టరేట్ లోని జూనియర్ అసిస్టెంట్ టీ శ్రీహరిని ఆ విభాగంలో నియమించారు.
 • ఉపాధ్యాయ బదీలు, సర్దుబాటు ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ఆవిభాగం పని చేస్తుందని చినవీరభద్రుడు అన్ని జిల్లాల డీఈఓలకు సర్క్యులర్స్ పంపించారు.
 • ఖాళీలు, సర్దుబాటు పై ఏమైనా అనుమానాలు ఉంటే డీఈఓలు ప్రత్యేక సెల్ లోని సిబ్బందితో మాట్లాడి నివృత్తి చేసుకోవాలన్నారు.
 • అలాగే బదిలీకి అర్హత ఉన్న ఉపాధ్యాయులలో ఎవరెవరు స్పౌజ్ అవకాశాన్ని ఉపయోగించు కున్నారు, టీచర్స్ ఏ గ్రేడ్ లో(HRA ఆధారంగా) ఉన్నారు, వారికి ఎన్ని పాయింట్లు వస్తాయోనన్న అంశాలపైనా ప్రత్యేకంగా కసరత్తు జరుగుతోంది.
 • మరోవైపు డీఎస్సీ - 2018 SGT  అభ్యర్థులకు పోస్టింగ్స్ ఇచ్చేందుకు విద్యాశాఖ మంత్రి డాక్టర్ఆదిమూలపు సురేష్ మంగళవారం ప్రణాళికను విడుదల చేశారు.
 • ఆ సమయంలోనే వారం రోజుల్లోగా ఉపాధ్యాయ బదిలీలపై ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు వెల్లడించారు.
 • డీఎస్సీ - 2018 అభ్యర్థులకు పోస్టింగ్స్ ఇస్తున్నందున తాజా బదిలీలలో ఎవరికీ అన్యాయం జరగదని తెలిపారు. ఉపాధ్యాయుల సర్దుబాటు పైనా స్పష్టత వస్తుందని పేర్కొన్నారు.
 • మరోవైపు విద్యాశాఖ ఉపాధ్యాయుల సర్దుబాటుకు సంబంధించి ప్రాథమికంగా మార్గదర్శకాలను సిద్ధం చేసింది.
 • అన్ని జిల్లాల డీఈఓలు, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించిన అనంతరమే విద్యార్థి, ఉపాధ్యాయులు నిష్పత్తిని ఖరారు చేశారు. ప్రాథమిక పాఠశాలలో 60 మందిలోపు విద్యార్థులుంటే రెండు SGT టీచర్ పోస్టులు ఉంటాయని విద్యాశాఖ తెలిపింది.
 • అలాగే 61 నుంచి 90 మంది ఉంటే ముగ్గురు, 91 నుంచి 120 మందికి నలుగురు, 121 నుంచి 150 మందికి ఐదు పోస్టులను మంజూరు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు.
 • విద్యార్థుల సంఖ్య 151 నుంచి 200 ఉన్న స్కూళ్లకు అదనంగా హెడ్ మాస్టర్ పోస్టును మంజూరు చేస్తారు.
 • విద్యార్థుల సంఖ్య 200 పైన ఉన్న స్కూళ్లలో ప్రతి 40 మందికి ఒక SGT పోస్టును మంజూరు చేయాలని భావిస్తున్నారు. 
 • జిల్లాల్లో మిగిలిన ఉపాధ్యాయులు అవసరమైన స్కూళ్లలో నియమిస్తారు.
 • గతంలో నిర్వహించిన సర్దుబాటులో డీఈఓ పూల్ లో ఉన్న ఉపాధ్యాయులకు కూడా అవసరమైన స్కూళ్లకు బదిలీ చేస్తారు.
 • విద్యార్థుల సంఖ్య 151 దాటితేనే  LFL
 • హెచ్ఎం పోస్టు ఉంటుందని, ఆలోపు ఉన్న స్కూళ్లలో LFL HM ను SGT గా పరిగణించనున్నారు.
 • ఉపాధ్యాయ బదిలీల మార్గదర్శకాలు వెలువడిన తర్వాతే వీటిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
 • ప్రాథమికోన్నత పాఠశాలల్లో వందలోపు విద్యార్థులుంటే నాలుగు సబ్జెక్ట్ ఉపాధ్యాయులను నియమించనుండగా,
 • 140 దాటితే ఆరుగురు, 386-420 ఉంటే ప్రతి 35 మందికి ఒక స్కూల్ అసిస్టెంట్ పోస్టును అదనంగా ఇస్తారు
 • ఉన్నత పాఠశాలల్లోనూ విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయ పోస్టులను ఉంచాలని విద్యాశాఖ భావిస్తోంది.
 • హైస్కూళ్లలో 240 మంది విద్యార్థులుంటే నాలుగు పోస్టులు,280లోపుంటే ఐదు, 320కి ఆరు, 360కి ఏడు, 400 మంది విద్యార్థులుంటే ఎనిమిది ఉపాధ్యాయ పోస్టులు ఉంచేలా చర్యలు చేపడుతున్నారు.
 • మూడు నెలల క్రితమే ఉపాధ్యాయుల బదిలీలు జరగాల్సి ఉండగా, కరోనా
 • కారణంగా ప్రక్రియ వాయిదా పడుతూ వస్తోంది.
 • మరోవైపు బదిలీల కటాఫ్ తేదీపైనా ఒక స్పష్టత ఇవ్వాలని  ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "AP TEACHERS TRANSFERS 2020"

Post a Comment