AP Teaches Transfers 2020
టీచర్ల బదిలీల ప్రక్రియ షురూ
జిల్లాలో ఉపాధ్యాయుల రేషనలైజేషన్ ప్రక్రియను వెంటనే పూర్తిచేయాలని పాఠశాల విద్య
కమిషనర్ ఉత్తర్వులు జారీచేశారు.
బదిలీ జాబితాల
తయారీకి జిల్లాల వారీ అధికారులను నియమించారు.
జిల్లా, మండల పరిషత్,
ప్రభుత్వ యాజమాన్యాల
పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను పునర్విభజన చేస్తారు.
ప్రతి పాఠశాలలో కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు...
17న కమిషనర్ ముందుకు.
- ఈ నెల 17 నాటికి రేషనలైజేషన్ జాబితాలు
- ఆదేశించిన విద్యాశాఖ కమిషనర్
- ప్రతి ప్రాథమిక పాఠశాలలో కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు ఉండేలా కసరత్తు
- ఇప్పటికే కొలిక్కి వచ్చిన జాబితాలు
- త్వరలో షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం
జిల్లాలో ఉపాధ్యాయుల రేషనలైజేషన్ ప్రక్రియను వెంటనే పూర్తిచేయాలని పాఠశాల విద్య
కమిషనర్ ఉత్తర్వులు జారీచేశారు.
బదిలీ జాబితాల
తయారీకి జిల్లాల వారీ అధికారులను నియమించారు.
జిల్లా, మండల పరిషత్,
ప్రభుత్వ యాజమాన్యాల
పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను పునర్విభజన చేస్తారు.
ప్రతి పాఠశాలలో కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు...
- గుంటూరు జిల్లా వ్యాప్తంగా 7 ప్రభుత్వ, 446 జిల్లా, మండల పరిషత్ పాఠశాలల్లో ఏకోపాధ్యాయుడుఉన్నారు.
- పదవీ విరమణ, ఆరోగ్యసమస్యలు, ట్రాన్స్ఫర్లు వంటి కారణాలతో జిల్లాలో 40 పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేరు. ఈ 40 పాఠశాలలకు అందుబాటులో ఉన్న ఇతర ఉపాధ్యాయులను పంపి బోధనలు చేయిస్తున్నారు.
- విద్యా హక్కు చట్టం ప్రకారం టీచర్లు లేని, ఏకైక టీచర్ ఉన్న పాఠశాలలు ఉండకూడదు. దీంతో
- తాజాగా ప్రకటించిన స్టాఫ్ ప్యాట్రన్ లో 1నుంచి 60 మంది విద్యార్థుల వరకు ఇద్దరు సెకండరీ గ్రేడ్ టీచర్లు(ఎస్జీటీ)ను నియమించనున్నారు.
- ఈ నిర్ణయంతో సర్దుబాట్లు,బదిలీల తర్వాత 588 పాఠశాలలకు ఇద్దరు ఉపాధ్యాయులు అందుబాటులో ఉండ నున్నారు.
- 61 నుంచి 90 మంది విద్యార్థులవరకు ముగ్గురు ఎస్జీటీలు, 91 నుంచి 120 వరకు నలుగురు, 121 నుంచి 150 దాకా ఐదుగురు, 151 మంది నుంచి 200 వరకు ఒక LFL హెడ్మాస్టర్, ఐదుగురు ఎస్జీటీలను నియమించ నున్నారు.
- రేషనలైజేషన్ ప్రక్రియకు ఈ ఏడాది ఫిబ్రవరి 29నాటికి పాఠశాలల్లో నమోదైన విద్యార్థుల వివరాలు, యూడైస్ ఆధారంగా కసరత్తు చేస్తున్నారు.
- పాఠశాలలున్న ప్రాంతాలు, అక్కడ ఉపాధ్యాయులు పొందే హెచ్ ఆర్ఎ ప్రాతిపదికగా కేటగిరీ 1,2,3,4 వారీగా జాబితాలను సిద్ధం చేయనున్నారు.
- ఆగస్టు 31 నాటికి ఒక పాఠశాలలో రెండేళ్ల సర్వీసు పూర్తిచేసిన వారు బదిలీకి అర్హులు.
- అలాగే ఐదేళ్లు పూర్తిచేసిన HM లు
- ఎనిమిదేళ్లు పూర్తిచేసిన SGT లు, స్కూలు అసిస్టెంట్లు, ఇతర కేటగిరీ టీచర్లందరూ తప్పనిసరిగా బదిలీ కావాల్సిందే.
17న కమిషనర్ ముందుకు.
- ఉపాధ్యాయుల పునర్విభజన జాబితాలు అన్నింటిని పూర్తిచేసి ఈ నెల 17 న గుంటూరు జిల్లాకు చెందిన టీచర్ల బదిలీల సమాచారం అన్ని మేనేజ్ మెంట్ల వారీగా పాఠశాల విద్యా కమిషనర్ కార్యాలయానికి రావాలని ఆదేశించారు.
- ఈ జాబితాలు ఇప్పటికే ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం
- బదిలీల ప్రక్రియలో పారదర్శకత కోసం జిల్లాలో తయారుచేసిన జాబితాలను పాఠశాల విద్య కమిషనర్ కార్యాలయంలోని యూడైస్ డేటాతో సరిపోల్చి ధ్రువీకరణ పొందాల్సి ఉంది.
- జాబితాల తయారీ అధికారం పూర్తిగా జిల్లాలకే అప్పగిస్తే తప్పులు దొర్లే అవకాశం ఉన్నందున దానికి చెక్ పెడుతూ కమిషనర్ కార్యాలయంలో జాబితాలను ధ్రువీకరించుకోవాలని ఆదేశించారు.
0 Response to "AP Teaches Transfers 2020"
Post a Comment