Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Are you looking for an education loan from a low interest lending bank?

ఎడ్యూకేషన్ లోన్ కోసం చూస్తున్నారా తక్కువ వడ్డీకే రుణమిచ్చే బ్యాంకులివే.
Are you looking for an education loan from a low interest lending bank?

కోవిడ్-19 ప్రభావంతో ఎక్కువగా ఎఫెక్టయింది విద్యార్థులే. మార్చికే లాక్ డౌన్ ప్రారంభమవడంతో పైచదువులకు వెళ్లేవాళ్ల మొదలు పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేవారి వరకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు ఏప్రిల్, మే మాసాల్లో జరగాల్సిన ముఖ్యమైన పరీక్షలు వాయిదా పడాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇటీవలే లక్షల మంది విద్యార్ధులు జాయింట్ ఎంట్రన్స్ ఎక్జామ్(జేఈఈ), నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నీట్) పరీక్షలు రాశారు. అంతేకాకుండా విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకునేవాళ్లకు కూడా ఈ సమయంలో తీరిక లేకుండా ఉన్నారు. ఇప్పుడు వీరిలో చాలా మంది విద్యా రుణం కోసం ఎదురు చూస్తున్నారు. ఉన్నత చదువుల కోసం పలు బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లకే విద్యా రుణాన్ని అందిస్తున్నాయి.
ప్రైవేటు బ్యాంకులు, విదేశీ బ్యాంకులు వ్యాపారానికి, క్రెడిట్ కార్డులకు రుణాలను అందిస్తుంటే.. ప్రభుత్వ బ్యాంకులు విద్యార్థుల కోసం ఎడ్యూకేషన్ లోన్ భారాన్ని తమపై మోస్తున్నాయి. వివిధ రకాల ప్ఱభుత్వ బ్యాంకులు విభిన్నమైన వడ్డీరేట్లతో ఈ విద్యారుణాన్ని అందిస్తున్నాయి.
యూనియన్ బ్యాంకులో తక్కువ వడ్డీకే రుణం.. 
ప్రభుత్వ బ్యాంకుల్లో కీలకమైన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అతి తక్కువ వడ్డీకే విద్యారుణాన్ని అందిస్తుంది. రూ.20 లక్షల రుణానికి 6.80 వడ్డీని 7 సంవత్సరాల కాలపరిమితిలో చెల్లించే అవకాశాన్ని కల్పించినట్ల బ్యాంక్ బజార్ నివేదిక స్పష్టం చేస్తుంది. అనంతరం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా తక్కువ వడ్డీకే రుణాలిచ్చే టాప్-10 బ్యాంకుల జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ఈ రెండు బ్యాంకులు 6.85 శాతం వడ్డీని నిర్దేశించాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంకు వడ్డీ రేటు కొద్ది ఎక్కువగా పెంచి 6.90 శాతానికి విద్యారుణాన్ని అందిస్తున్నాయి.
టాప్-10లో ఒక్క ప్రైవేటు బ్యాంకు కూడా లేదు..
అతి తక్కువ వడ్డీకే విద్యా రుణాన్ని అందించే టాప్-10 జాబితాలో ప్రైవేటు, విదేశీ బ్యాంకుల్లో ఒక్కటి కూడా లేకపోవడం గమనార్హం. వీటిలో విద్యా రుణాన్ని తక్కువ వడ్డీ రేటు(7.65)కే అందించే బ్యాంకుల్లో సౌత్ ఇండియన్ బ్యాంక్ 11వ స్థానంలో ఉంది. ప్రైవేటు సెక్టార్ బ్యాంకుల్లో ఇదొక్కటే తక్కువ వడ్డీ రేటుకు రుణాన్ని ఇస్తున్నాయి.
తక్కువ వడ్డీకే రుణాలిచ్చే బ్యాంకులు..బ్యాంకులు వడ్డీ రేటు(ఏడాదికి)

  • ఈఎంఐయూనియన్ బ్యాంకు 6.80 శాతం రూ.29,990
  • సెంట్రల్ బ్యాంకు 6.85 శాతం రూ.30,039
  • బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.85 శాతం రూ.30,039
  • పంజాన్ నేషనల్ బ్యాంక్ 6.90 శాతం రూ.30,088
  • ఎస్బీఐ 6.90 శాతం రూ.30,088
  • బ్యాంక్ ఆఫ్ బరోడా 7.00 శాతం రూ.30,185
  • ఇండియన్ బ్యాంక్ 7.15 శాతం రూ.30,332
  • ఐఓబీ 7.25 శాతం రూ.30,430
  • యూసీఓ బ్యాంకు 7.30 శాతం రూ.30,480
  • ఐడీబీఐ బ్యాంకు 7.40 శాతం రూ.30,578


రుణం కోసం అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు విద్యా రుణంపై వడ్డీరేటు, ఛార్జీలను డేటా సంకలనం కోసం పరిగణిస్తారు. తమ వెబ్ సైట్ లో పొందపరచని బ్యాంకులను జాబితాలో తీసుకోరు. 2020 సెప్టెంబరు 03 నాటికి సంబంధిత బ్యాంకు వెబ్ సైట్ నుంచి డేటాను సేకరిస్తారు. వడ్డీ రేటు ఆధారంగా బ్యాంకులను ఆరోహణ క్రమంలో జాబితాను రూపొందించారు. విద్యారుణంపై(రూ.20 లక్షల మొత్తానికి) అతి తక్కువ వడ్డీ రేటు అందించే బ్యాంకులను చేర్చారు. 7 సంవత్సరాల కాలపరిమితికి రూ.20 లక్షల రుణం వడ్డీ రేటు ఆధారంగా ఈఎంఐని లెక్కగడతారు. ప్రాసెసింగ్, ఇతర ఛార్జీలు ఈఎంఐ లెక్కింపుకు సున్నాగా భావిస్తారు. ఇందుకు జీఎస్టీ నుంచి మినహాయిస్తారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Are you looking for an education loan from a low interest lending bank?"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0