Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Cash transfer to farm electricity

వ్యవసాయ విద్యుత్తుకు నగదు బదిలీ
Cash transfer to farm electricity


  • రైతు ప్రత్యేక ఖాతా వ్యవసాయ విద్యుత్తుకు నగదు బదిలీ లో సొమ్ము జమ
  • మార్గదర్శకాలు విడుదలచేసిన రాష్ట్ర ప్రభుత్వం
  • డిసెంబరు నాటికి ఒక జిల్లాలో అమలు
  • రాష్ట్రవ్యాప్తంగా 2021-22 నుంచి


వ్యవసాయ విద్యుత్‌కు నగదు బదిలీ పథకం అమలు కోసం మార్గదర్శకాలను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులనిచ్చింది. నాలుగు రంగాల్లో సంస్కరణలు తేవాలన్న కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు ఉచిత వ్యవసాయ విద్యుత్‌ పొందుతున్న రైతులకు నగదు బదిలీ చేస్తున్నట్లు పేర్కొంది. 2020 డిసెంబరు 31నాటికి కనీసం ఒక జిల్లాలో పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలిపింది. 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి పూర్తి స్థాయిలో అమలు చేయనున్నట్లు వివరించింది. ప్రభుత్వం బదిలీ చేసిన నగదు నుంచి రైతులు విద్యుత్‌ కంపెనీలకు బిల్లు చెల్లించేలా చూడాలన్న కేంద్రం నిబంధన మేరకు విధివిధానాలను రూపొందించింది.
ప్రయోజనాలివీ..

  • రైతు సొంత డబ్బు పైసా వెచ్చించాల్సిన  అవసరం లేదు. నెలలో వినియోగించిన విద్యుత్‌ ఆధారంగా బిల్లు మొత్తాన్ని ప్రభుత్వం ముందుగా రైతు ఖాతాలో జమ చేస్తుంది. అంతే మొత్తాన్ని రైతు విద్యుత్‌ కంపెనీకి చెల్లించాలి.
  • రైతుకు ప్రభుత్వం నుంచి ఎంత సాయం అందుతుందనేది తెలుస్తుంది.
  • రైతు నేరుగా బిల్లు చెల్లించటం వల్ల నాణ్యమైన విద్యుత్‌ కోసం డిస్కంలను ప్రశ్నించే హక్కు వస్తుంది.
  • కంపెనీలు కొనుక్కునే విద్యుత్‌కు సంబంధించిన వినియోగం, వృథా లెక్కలను తెలుసుకునే అవకాశమేర్పడుతుంది. నష్టాలను అరికట్టే వీలుంటుంది.

ప్రత్యేక బ్యాంకు ఖాతాలు

  • విద్యుత్‌ నగదు బదిలీకి మాత్రమే వినియోగించేలా రైతుల పేరిట ప్రత్యేక బ్యాంకు ఖాతాలను తెరుస్తారు. 
  • ప్రస్తుతం రైతులు వినియోగించే ఖాతాల్లో జమ చేస్తే పాత అప్పుల కింద బ్యాంకులు ఈ మొత్తాన్ని మళ్లించే అవకాశం ఉంది.
  •  దీనివల్ల డిస్కంలకు బిల్లుల చెల్లింపులో జాప్యమేర్పడుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని రైతుల పేరు, ఆధార్‌ నెంబరు వివరాలతో దరఖాస్తులను డిస్కంలు సర్వర్‌లో నిక్షిప్తం చేసి ప్రభుత్వానికి ఇస్తాయి. 
  • ఈ వివరాల ఆధారంగా బ్యాంకు ఖాతాలను తెరిచే ప్రక్రియను ఆర్థిక శాఖ నిర్వహిస్తుంది.
  • నెలవారీగా డిస్కంలు రూపొందించిన బిల్లుల సొమ్మును ఇంధన శాఖ ఆమోదంతో ఆర్థిక శాఖ సమకూరుస్తుంది.
  •  రైతు ఖాతాల్లో జమ చేసి రైతు ప్రమేయం లేకుండానే విద్యుత్‌ కంపెనీల ఖాతాల్లోకి బదిలీ చేస్తారు.

మీటర్ల ఏర్పాటు

  • అవకాశమున్న చోట స్మార్ట్‌మీటర్లు, లేదంటే ఇన్‌ఫ్రారెడ్‌ సమాచార ప్రామాణికం (ఐఆర్‌డీఏ) ఉన్న మీటర్లను ఏర్పాటుచేస్తారు. వీటికి అవసరమైన నిధులను విద్యుత్‌ బిల్లుతో కలిపి రాయితీ రూపంలో ప్రభుత్వం ఇస్తుంది.
  •  బిల్లు చెల్లింపులో జాప్యమైనా విద్యుత్‌ సరఫరా నిలిపేయకూడదు. ప్రతి నెలా విద్యుత్‌ కంపెనీలు మీటరు రీడింగ్‌ నమోదు చేసి బిల్లులను రూపొందించి ప్రభుత్వానికి ఇస్తాయి.

పథకం అమలుకు కమిటీలు
ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి అధ్యక్షుడిగా, ఇంధన శాఖ కార్యదర్శి కన్వీనర్‌గా ఉన్న ప్రభుత్వ స్థాయి కమిటీ పథకం అమలును పర్యవేక్షిస్తుంది. సీఎఫ్‌ఎంఎస్‌ సీఈవో, వ్యవసాయశాఖ కమిషనర్‌, రెవెన్యూశాఖ వెబ్‌లాండ్‌ ఇన్‌ఛార్జి అధికారి సభ్యులుగా ఉంటారు. డిస్కంల సీఎండీల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బోర్డు కూడా పర్యవేక్షిస్తుంది. జిల్లా, డివిజన్‌, మండల, గ్రామస్థాయిలో కమిటీలను ఏర్పాటుచేస్తారు.
నమోదు ప్రక్రియ

  • ప్రస్తుతం ఉచిత వ్యవసాయ విద్యుత్‌ పొందుతున్న 18 లక్షల మంది రైతులకు ఈ పథకం వర్తిస్తుంది.
  • గ్రామకమిటీల ఆధ్వర్యంలో రైతుల నుంచి దరఖాస్తులను తీసుకుంటారు. 
  • కేవైసీ, ఆధార్‌, బోరు కోఆర్డినేట్స్‌, సర్వేనెంబరు వివరాలను దరఖాస్తుతోపాటు సేకరిస్తారు.
  • పాసు పుస్తకం, భూయాజమాన్య హక్కు పత్రం ఆధారంగా కనెక్షన్‌ను ప్రస్తుతమున్న హక్కుదారుడి పేరిట నమోదు చేస్తారు.
  •  ప్రస్తుత యజమాని పేరు మార్పునకు అవసరమైన పత్రాలు అందుబాటులో లేకుంటే గ్రామ రెవెన్యూ అధికారి ధ్రువీకరణ వాంగ్మూలం ఆధారంగా మార్పు చేస్తారు. 
  • పేరు మార్పు విచారణ ప్రక్రియను సంబంధిత డిస్కం ఏఈ ఫోన్‌లో వీడియో తీసి భద్రపరచాలి.
  • అనధికార కనెక్షన్లు, అదనపు లోడ్‌ వినియోగిస్తున్న వారిని గుర్తించి నిర్దేశిత డిపాజిట్‌, ఛార్జీలు చెల్లించాకే క్రమబద్ధీకరిస్తారు.
  • వ్యవసాయ కనెక్షన్‌ ఉన్న యజమాని పేరు, హక్కు పత్రాలు, ఆధార్‌ కార్డు, బ్యాంకు ఖాతాలో పేరు ఒకేలా ఉండేలా సరిచూస్తారు.
  • విద్యుత్‌ కంపెనీలు, ఆర్థిక శాఖ సీఎఫ్‌ఎంఎస్‌, వ్యవసాయ శాఖ ఈ-పంట వివరాలు, రెవెన్యూశాఖ వెబ్‌ల్యాండ్‌ సమాచారం.. 
  • నాలుగు చోట్ల ఒకే రకమైన డేటా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
  • వ్యవసాయ ఉచిత విద్యుత్‌ పథకం కోసం ఏటా రూ.8,400 కోట్లు, గృహ విద్యుత్‌ రంగానికి రూ.1,707 కోట్లు, మత్స్య రంగానికి రూ.450 కోట్లు, ఎస్సీ. ఎస్టీ వర్గాలకు నెలకు 200 యూనిట్లలోపు అందించే ఉచిత విద్యుత్‌ పథకం కోసం రూ.220 కోట్లను రాయితీగా ప్రభుత్వం కేటాయించింది. 
  • చేనేతలు, స్వర్ణకారులు, రజకులు, క్షురకులకు కలిపి 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.11 వేల కోట్ల మొత్తాన్ని విద్యుత్‌ రాయితీ రూపేణా ప్రభుత్వం భరిస్తోంది.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Cash transfer to farm electricity"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0