Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Concern among CPS‌ employees

నిరీక్షణ ఫలించేనా?
సీపీఎస్‌ ఉద్యోగుల్లో ఆందోళన
నిరసనలు తెలుపుతున్న ఉపాధ్యాయులు, ఉద్యోగులు
Concern among CPS‌ employees

ఉద్యోగ విరమణ అనంతరం లేదా ఉద్యోగి మధ్యలో చనిపోయినా వారి కుటుంబానికి ఆసరాగా ఉండేది పింఛను మాత్రమే. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు 1 జనవరి 2004, రాష్ట్ర ప్రభుత్వం 1 సెప్టెంబరు 2004 నుంచి పాత పింఛను విధానాన్ని రద్దు చేస్తూ కాంట్రిబ్యూటరీ పింఛను విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. మొదట్లో అంతగా వ్యతిరేకించని ఉద్యోగులు సీపీఎస్‌ విధానంలో నష్టాలు ఆచరణలోకి వచ్చేటప్పటికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుతం ఇది ఉద్యమ రూపం దాల్చింది.

జిల్లావ్యాప్తంగా కాంట్రిబ్యూటరీ పింఛన్‌ పథకం కిందకు వచ్చే ఉద్యోగులు 16,542 మంది వరకు ఉన్నారు. వీరంతా ఈ నెల నుంచి ఆందోళన బాట పట్టారు. గత ప్రభుత్వం సీపీఎస్‌ రద్దు కోసం ఠక్కర్‌ కమిటీని ఏర్పాటు చేసింది. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నాడు ప్రతిపక్షంలో ఉండగా సీపీఎస్‌ రద్దుపై పాదయాత్రలో స్పష్టమైన ప్రకటన చేశారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సీపీఎస్‌ రద్దు చేస్తామని ప్రకటించడంతో సీపీఎస్‌ ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కమిటీ నివేదికను క్షుణ్ణంగా పరిశీలించటానికి ఉన్నతస్థాయి మంత్రుల కమిటీని వేశారు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో సీపీఎస్‌ రద్దుపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవటంతో ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు. కమిటీకి ఇచ్చిన మూడు నెలల కాలపరిమితి ముగిసింది.
2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు ఊరట?
రాష్ట్రవ్యాప్తంగా డీఎస్సీ 2003లో 16,445 ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్‌ అందించగా జిల్లాలో 450 మందికి పైగా ఉపాధ్యాయులు నియమితులయ్యారు. నోటిఫికేషన్‌ సమయానికి పాత పింఛను విధానమే అమల్లో ఉండటంతో వారికి ఓపీఎస్‌ అమలు చేసేందుకు చర్యలు చేపట్టాలని పాఠశాల విద్యాశాఖకు రాష్ట్ర ప్రభుత్వం మార్చి 15న ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాల నుంచి వారి వివరాలు సేకరిస్తున్నారు. వీరిని త్వరలోనే ఓపీఎస్‌లో చేర్చే అవకాశాలున్నాయని సంఘ నాయకులు తెలుపుతున్నాయి. పూర్తిగా సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేస్తామన్న ప్రభుత్వం ఇలా కొంత మందికే అమలు చేసి, సమష్టితత్వాన్ని, ఉద్యమాన్ని నీరుగార్చడమేనని సీపీఎస్‌ ఉద్యోగులు వాపోతున్నారు
మారిన ఉద్యమ పంథా
గతంలో సీపీఎస్‌ రద్దుకోసం రోడ్డెక్కి నిరసనలు, ధర్నాలు చేసిన ఉద్యోగ, ఉపాధ్యాయులు కరోనా ప్రభావంతో కొవిడ్‌-19 నిబంధనలు పాటిస్తూ స్థానిక ప్రజాప్రతినిధులు (ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులు)కు విజ్ఞాపక పత్రాలతో పాటు ఇంటివద్దే సత్యాగ్రహాలు నిర్వహిస్తున్నారు. ఏపీటీఎఫ్‌ ఆధ్వర్యంలో స్థానిక ప్రజాప్రతినిధులకు విజ్ఞాపన పత్రాలు అందజేసే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. యూటీఎఫ్‌ మండల కేంద్రాల్లో, ఇళ్లల్లో సత్యాగ్రహ దీక్షలు నిర్వహించింది. ‘సీపీఎస్‌ అంతం..పీఆర్టీయూ పంతం’ పేరిట జిల్లా కలెక్టర్‌, ఆర్డీవోలు, తహసీల్దార్లుకు, ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు అందించింది. మరిన్ని నిరసన కార్యక్రమాలకు సన్నద్ధమవుతున్నాయి. సీపీఎస్‌ రద్దు అంశం రాష్ట్ర పరిధిలోనిదే అని కేంద్రం చెబుతున్నప్పటికీ సాంకేతిక కారణాలతో రద్దు అమలు అంత సులువు కాదని నిపుణులు తెలుపుతున్నారు. గతంలో కేజ్రీవాల్‌ ప్రభుత్వం సీపీఎస్‌ రద్దుపై తీర్మానం చేసినా అమలు చేయకపోవటం గమనార్హం.
హామీ అమలు చేయాలి - సూర్యప్రకాశరావు, ఉపాధ్యాయుడు
ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చిన వారంలోపు సీపీఎస్‌ రద్దు చేస్తామని తెలిపారు. సాంకేతిక పరమైన అంశాల వల్ల ఆలస్యమవుతోంది. పాదయాత్రలో ఇచ్చిన హామీని అమలు చేస్తారనే భావిస్తున్నాం. అనేక మంది సీపీఎస్‌ ఉద్యోగులు రద్దు నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు.
రుణపడి ఉంటాం - బర్నబాస్‌, సీపీఎస్‌ ఉద్యోగి
సీపీఎస్‌ రద్దు చేస్తే రాష్ట్రవ్యాప్తంగా సీపీఎస్‌ ఉద్యోగుల కుటుంబాలన్నీ రుణపడి ఉంటాయి. ఇప్పటికే సీపీఎస్‌పై అనేకసార్లు మా నిరసనలు తెలిపాం. ఏ మాత్రం భద్రత లేని సీపీఎస్‌ విధానం రద్దు చేయాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు జరుగుతున్న నష్టాన్ని గుర్తించి రద్దు చేయాలి.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Concern among CPS‌ employees"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0