Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Conduct schools subject to regulations.

నిబంధనలకు లోబడి పాఠశాలలు జరపండి.

ఆరడుగుల దూరంలో ఉండాల్సిందే
21 నుంచి విద్యార్థులు పాఠశాలలను సందర్శించే అవకాశం

కొవిడ్‌-19 అన్‌లాక్‌ 4.0 సడలింపుల నేపథ్యంలో ఈ నెల 21 నుంచి పాఠశాలలను సందర్శించే విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది అనుసరించాల్సిన మార్గదర్శకాలను పాఠశాల విద్యాశాఖ జారీ చేసింది. 9, 10, ఇంటర్‌ విద్యార్థులు సహా సిబ్బంది తమ మధ్య ఆరడుగుల భౌతికదూరం తప్పక పాటించాలని పేర్కొంది. వచ్చే నెల 5న పాఠశాలలను పునఃప్రారంభించే యోచనలో ఉన్న ప్రభుత్వం ఒకటి నుంచి 8వ తరగతి విద్యార్థులను 4వ తేదీ వరకు ఇళ్ల వద్దే ఉంటూ దూరదర్శన్‌లో ప్రసారమవుతున్న విద్యావారధి, విద్యామృతం కార్యక్రమాలను వీక్షించాలని సూచించింది.
ప్రధానోపాధ్యాయుల విధులు ఇలా..
పాఠశాల ఆవరణలోని పని ప్రదేశాల్లో అంటే తరగతి గదులు, ప్రయోగశాలలు, అందరూ వినియోగించే ప్రదేశాలతో పాటు తరచూ స్పృశించే ప్రాంతాలను శానిటేషన్‌ చేయించాలి. విద్యార్థులు కూర్చునే బల్లలు, కుర్చీల మధ్య ఆరడుగుల దూరం ఉండేలా చూడాలి. విద్యార్థులు తమ రాతపుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, రబ్బర్లు, నీళ్ల సీసాలు వంటివి ఇచ్చిపుచ్చుకోకుండా చూడాలి.
9,10, ఇంటర్‌ విద్యార్థులకు సూచనలు
కంటైన్‌మెంట్‌ జోన్లు మినహా మిగిలిన ప్రాంతాల విద్యార్థులు తమ సందేహాల నివృతి కోసం స్వచ్ఛంద ప్రాతిపదికన విద్యాలయాలను సందర్శించవచ్ఛు ఇందుకు తమ తల్లిదండ్రుల నుంచి రాతపూర్వక అనుమతి తప్పక అందజేయాలి. హైటెక్‌, లోటెక్‌, నోటెక్‌ ప్రాంతాల విద్యార్థులందరికీ కొత్త విద్యాసంవత్సరంలో ప్రవేశిస్తున్న సందర్భంలో వారికి ఉపాధ్యాయులు గతేడాది పాఠ్యాంశాల పునఃసమీక్ష చేయాలి. గురుకుల, కేజీబీవీలు, వసతిగృహాల విద్యార్థులు వారి స్వస్థలాలకు దగ్గర్లోని పాఠశాలలను సందర్శించి తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్ఛు ఉపాధ్యాయులు వారి కోసం ప్రత్యేకంగా వాట్సాప్‌ గ్రూపులను ఏర్పాటు చేయాలి. బేస్‌లైన్‌ మూల్యాంకనానికి ప్రథమ్‌ యాప్‌ ద్వారా ప్రశ్నపత్రాన్ని అందుబాటులో ఉంచుతారు.
సగం మంది ఉపాధ్యాయులు
విద్యావారధి కార్యక్రమం అమలులో భాగంగా ఆన్‌లైన్‌ పాఠ్యాంశాల బోధనకు, విద్యార్థుల సందేహాల నివృత్తికి 50 శాతం మంది ఉపాధ్యాయులు హాజరు కావాల్సి ఉంది. కంటైన్‌మెంట్‌ జోన్ల పరిధిలోని వారికి మాత్రం అనుమతి లేదు. ఈ మేరకు స్పష్టమైన నిబంధనలు జారీ చేశారు.
ప్రతి ఒక్కరూ ముఖాలకు మాస్క్‌లు, లేదా తొడుగులు విధిగా ధరించాలి.

  • కనీసం 40 నుంచి 60 సెకన్లపాటు చేతులను సబ్బుతో తరచూ శుభ్రం చేసుకోవాలి.
  • అవసరం మేరకు శానిటైజర్లను కనీసం 20సెకన్ల పాటు వినియోగించాలి.
  • దగ్గు, జలుబు, ముక్కు కారడం వంటి లక్షణాలు ఉన్న వ్యక్తులు తప్పనిసరిగా టిష్యూ, చేతి రుమాలు వినియోగించాలి. ముంజేతిని అడ్డుగా పెట్టుకోవాలి.
  • కరోనా అనుమానిత లక్షణాలు ఉంటే ముందుగానే స్వచ్ఛందంగా తెలియజేయాలి.
  • బహిరంగంగా ఉమ్మి వేయడం నిషేధం.
  • ఆరోగ్యసేతు యాప్‌ను అవకాశం ఉన్నచోట డౌన్‌లోడ్‌ చేసుకుని చరవాణుల్లో నిక్షిప్తం చేసుకోవాలి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Conduct schools subject to regulations."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0