Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Dhee Dhee with studies, Fast video lessons on Doordarshan Saptagiri ..

చదువులతో ఢీఢీ
  Dhee   Dhee with studies,  Fast video lessons on Doordarshan Saptagiri ..


  • దూరదర్శన్‌ సప్తగిరిలో వేగంగా వీడియో పాఠాలు..
  • అందుకోలేకపోతున్న విద్యార్థులు
  • నోట్సు రాసుకోవడానికే సమయం
  • పిల్లల సందేహాలకు దొరకని పరిష్కారం


టెలివిజన్‌ పాఠాలను విద్యార్థులు సంపూర్ణంగా అందుకోలేకపోతున్నారు. దూరదర్శన్‌ (డీడీ) సప్తగిరి ఛానల్‌లో పాఠాలను వేగంగా చెప్పడం వల్ల నోట్సు రాసుకోవడానికే సమయం సరిపోతోంది. పాఠాలు వింటున్న సమయంలో వచ్చే సందేహాలను విడిగా నమోదు చేసుకునే అవకాశమే లేకుండా పోతోంది. ఒకవేళ నమోదు చేసుకున్నప్పటికీ వాటిపై ఉపాధ్యాయులను ఫోన్‌లో సంప్రదించేందుకు వీలు కావడం లేదు. పేద, మధ్యతరగతి కుటుంబాల్లో ఫోన్లు ఇంటి పెద్ద వద్ద ఉండటం, పనుల రీత్యా ఆయన ఉదయం నుంచి రాత్రి వరకు అందుబాటులో లేకపోవడంతో ప్రశ్న ప్రశ్నలాగే మిగిలిపోతోంది. త్వరగా కొరుకుడుపడని ఆంగ్లం, గణితం, భౌతిక శాస్త్రాల విషయంలో సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి.
విద్యాఛానల్‌ ఏర్పాటు చేస్తే బాగు.
కరోనాతో విద్యా సంస్థలు మూతపడినందున విద్యా వారధి పేరుతో జులై రెండో వారం నుంచి సప్తగిరి ఛానల్‌ ద్వారా పాఠశాల విద్యాశాఖ పాఠాలను ప్రసారం చేస్తోంది. ఫోన్లు, అంతర్జాల సమస్యల నేపథ్యంలో అందరికీ సౌకర్యమని భావించి టీవీ పాఠాలను అందిస్తోంది. ప్రస్తుతం ఇది ఆచరణీయ మార్గమైనప్పటికీ తలెత్తుతున్న సమస్యలు విద్యార్థులను ఇబ్బందుల పాలు చేస్తున్నాయి. టీవీలో వచ్చే పాఠాలను రాసుకోవాలని ఉపాధ్యాయులు ప్రత్యేకించి చెప్పడంతో పిల్లలు అందుకే ప్రాధాన్యమిస్తున్నారు. వేగంగా చెప్పే పాఠాలను అర్థం చేసుకోలేకపోతున్నారు. తరగతి గదిలో ఉపాధ్యాయుడు బోర్డుపై రాసి వెనకబడిన విద్యార్థితో సహా అందరికి అర్థమయ్యే వరకు చెప్పేవారని, వీడియోలో మాత్రం డిస్‌ప్లే బోర్డుపై బోధిస్తూ తక్కువ సమయం చూపిస్తున్నారని విద్యార్థులు వాపోతున్నారు. బోధన కోసం విద్యాఛానల్‌ను ఏర్పాటు చేస్తే బాగుంటుందని విద్యావేత్తలు సూచిస్తున్నారు. అందరికీ స్మార్ట్‌ఫోన్లు లేక పోవడంతో పాఠాలను యూట్యూబ్‌లో పెట్టినప్పటికీ ఫలితం ఉండటం లేదు. పెద్ద పిల్లలను కొందరు తల్లిదండ్రులు తమతోపాటు పొలానికి తీసుకెళ్తున్నారు. ఇలాంటివారు పాఠాలను చూడటం లేదు. కొన్ని గ్రామాల్లో విద్యుత్‌ అంతరాయాలు ఆటంకమవుతున్నాయి.
పాఠ్యపుస్తకాలూ లేవు..
విద్యార్థులకు ఇంతవరకు పాఠ్యపుస్తకాలు అందలేదు. విద్యాకానుక కింద వచ్చే నెల 5న వాటిని ఇవ్వనున్నట్లు అధికారులు ప్రకటించారు. పుస్తకాలు లేకపోవడంతో వీడియో పాఠాల పునశ్చరణకు అవకాశం కరవయింది. పాఠ్యపుస్తకాలుంటే విద్యావంతులైన తల్లిదండ్రులు తమ పిల్లలకు వాటిపై అవగాహన కల్పించే అవకాశం ఉండేది. విద్యార్థుల్లో ఒకరిద్దరు మాత్రమే ఫోన్‌ చేసి సందేహాలను అడుగుతున్నారని పదో తరగతికి ఆంగ్లం బోధించే గుంటూరు ఉపాధ్యాయుడు ఒకరు తెలిపారు. పిల్లలు ఎలాంటి సందేహాలను అడగడం లేదని కృష్ణా జిల్లాకు చెందిన ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు వివరించారు. వారికి పాఠాలు అర్థమవుతున్నాయో, లేదో తెలియడం లేదన్నారు. వాట్సప్‌లో వివరాలను పంపించినా తల్లిదండ్రుల వద్ద ఫోన్లు ఉండడంతో పిల్లలు చూడలేకపోతున్నారని వివరించారు. టీవీ పాఠాలను నోటు పుస్తకంలో రాసుకుంటున్న వారిలో తరగతికి ముగ్గురు, నలుగురు మాత్రమే ఫొటోలు తీసి పంపిస్తున్నారన్నారు. కొన్నిచోట్ల ఉపాధ్యాయులు ప్రత్యేక ఆసక్తి చూపి వాట్సప్‌ గ్రూపులను ఏర్పాటుచేసి పాఠ్యాంశాల వీడియోలను పంపిస్తున్నారు.
సాంకేతిక సమస్యలతో ఇబ్బంది
పాఠాలు ప్రసారమయ్యే సమయానికి ఒక్కోసారి కరెంటు ఉండడం లేదు. ఏపీ ఫైబర్‌ కేబుల్‌ నెట్‌వర్క్‌లో సమస్యల వల్ల పాఠ్యాంశం మొత్తం వినడం కుదరడం లేదు. గణితం, ఆంగ్లంలో కొన్ని అంశాలు అర్థం కావడం లేదు.
- జీఎన్‌వీ ప్రదీప్‌, పదో తరగతి, జీవీఎంసీ అనకాపల్లి పట్టణం
ఛానల్‌ రావడం లేదు
ఆన్‌లైన్‌ తరగతులు వినేందుకు సప్తగిరి ఛానల్‌ రావడం లేదు. ప్రైవేట్‌ ఛానల్స్‌ మధ్యలో దూరదర్శన్‌ సప్తగిరి ఎక్కడుందో తెలియదు. దీంతో పాఠాలు వినలేకపోతున్నాం. పుస్తకాలు లేకపోవడంతో అయోమయంగా ఉంది.
- రజాక్‌ 6వ తరగతి, బేతంచెర్ల, కర్నూలు జిల్లా
ఆసక్తిగా బోధించాలి
రానున్న రోజుల్లో పాఠశాలలను తెరిచినా పిల్లలను పంపించాలంటే భయమేస్తోంది. ఈ సమయంలో టీవీ ద్వారా బోధించడం శుభపరిణామం. ఈ పాఠాల పట్ల పిల్లలు ఆసక్తి చూపేలా ఉపాధ్యాయులు చొరవ చూపాలి. నీతికథలు, ఛలోక్తులు వేస్తూ తరగతి గదిలోనే పాఠ్యాంశాలు వింటున్నామనే భావనను కలగజేయాలి. ఒకేచోట కూర్చుని బోధించడం వల్ల టీవీలో వార్తలు విన్నట్టు భావిస్తున్నారు. ముఖ కవళికల్లో మార్పుతో పాటు భావ ప్రకటన స్వేచ్ఛతో బోధిస్తే బాగుంటుంది. మరిన్ని ఛానళ్లలో కొంతసేపు పాఠాలు ప్రసారం చేయాలి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

1 Response to " Dhee Dhee with studies, Fast video lessons on Doordarshan Saptagiri .."

  1. ఈ సమాచారం ఎంతో ఉపయోగపడుతున్నది. ధన్యవాదాలు

    ReplyDelete