Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

From October 1, the new rules must be known and followed

అక్టోబర్ 1 నుండి కొత్తరూల్స్ అందరూ తెలుసుకోవాలి పాటించాలి.

కేంద్ర ప్రభుత్వం తాజాగా పలు నియమ నిబంధనలను మార్చింది. ముఖ్యంగా వాహనదారులు తెలుసుకోవాల్సిన విషయాలు నాలుగు ఉన్నాయి. 
ఇక మార్చిన నియమ నిబంధనలు అక్టోబర్ 1 నుంచి అందుబాటులోకి రానున్నాయి. 
కేంద్రం మార్చిన ఆ నిబంధనలను పరిశీలిస్తే... 

  • మోటార్ వాహనాల చట్టం నియమ నిబంధనల్లో కేంద్రం మార్పులు చేసింది. 
  • వాహనదారులు బయటకు వెళ్ళేటప్పుడు డ్రైవింగ్ లైసెన్స్, ఆర్ సి లాంటి ఫిజికల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాల్సిన అవసరం లేదని వాటికి సంబంధించి డిజిటల్ డాక్యుమెంట్స్ సరిపోతుందని కేంద్రం తెలిపింది. 
  • వాహనదారులు వారి డాక్యుమెంట్స్ ను డిజిలాకర్, లేదా ఎం-పరివాహన్‌ లలో డిజిటలైజ్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది.
  • అలానే వాహనదారులు డ్రైవింగ్ చేస్తూ ఫోన్ వినియోగించ్చవచ్చని కేంద్రం తెలిపింది.
  • కానీ నేవిగేషన్ కోసం మాత్రమే ఫోన్ వినియోగించాలని, ఫోన్ కూడా డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి ఏకాగ్రతను దెబ్బతీయకుండా ఉండాలని పేర్కొంది. 
  • అలానే అక్టోబర్ 1 నుంచి పెట్రోల్ బంకుల్లో క్రెడిట్ కార్డ్ పై డిస్కౌంట్లు నిలిచిపోనున్నాయి. 
  • డెబిట్ కార్డులు, వ్యాలెట్ల ద్వారా పేమెంట్ చేస్తే మాత్రం డిస్కౌంట్ పొందొచ్చు. 
  • ఇక అక్టోబర్ 1 నుంచి దేశ వ్యాప్తంగా యూనిఫాం వెహికిల్స్ రిజిస్ట్రేషన్ కార్డ్స్(ఆర్‌సీలు), డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేయబడతాయి.
  • ఇవి మైక్రోచిప్ కలిగి ఉన్న ఈ కార్స్.. క్యూఆర్ కోడ్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఫీచర్లను కూడా ఉంటాయి.
  •  వీటి ద్వారా సెంట్రలైజ్డ్ ఆన్‌లైన్ డేటాబేస్‌లో 10 ఏళ్ల వరకు వాహనదారుల వివరాలు, చెల్లించిన పెనాల్టీలను భద్రపర్చొచ్చు. 
  • ఈ డేటా పదేళ్ల వరకు గవర్నమెంట్ వద్ద ఉంటుంది.
  • ఇక అక్టోబర్ 1 నుంచి ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ఉచితంగా ఇస్తున్న గ్యాస్ కనెక్షన్లు నిలిచిపోనున్నాయి. 
  • మిఠాయి షాపుల్లో కూడా విడిగా విక్రయించే స్వీట్లకు కూడా మ్యానుఫ్యాక్చరింగ్, ఎక్స్పైరీ తేదీలను ప్రదర్శించాల్సిందేనని ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా స్పష్టం చేసింది. 
  • అలానే ఆవ నూనెను ఇతర నూనెలలో కలపడంపై కూడా నిషేధం విధించింది. 
  • ఇక విదేశాలకు ఏడు లక్షల కంటే ఎక్కువ డబ్బు ట్రాన్స్ఫర్ చేయాలంటే ఐదు శాతం పన్ను కట్టాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది.
  •  అక్టోబర్ 1 నుంచి ఈ కామర్స్ ఆపరేటర్లు వస్తువుల కొనుగోళ్లపై ఒక శాతం పన్ను విధించనున్నారు. 
  • అలానే ఎల్ఈడీ టీవీల తయారీ కోసం వినియోగించే ఓపెన్ సెల్ దిగుమతులపై కేంద్రం 5 శాతం సుంకాన్ని విధించనుంది. 
  • దీంతో టీవీల ధరలు పెరగనున్నాయి. అక్టోబర్ 1 నుంచి హెల్త్ ఇన్స్యూరెన్స్ ప్రీమియం ధరలు పెరిగే అవకాశముంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "From October 1, the new rules must be known and followed"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0