Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

GATE 2021: Good news for those who want to write the gate .. Dates change!

GATE 2021 : గేట్ రాయాలనుకుంటున్న వారికి గుడ్ న్యూస్ .. తేదీల్లో మార్పు !
GATE 2021: Good news for those who want to write the gate .. Dates change!

GATE 2021 : గేట్ పరీక్ష రాయాలని భావించి ఇంత వరకు రిజిస్టర్ కాని విద్యార్థులకు ఐఐటీ ముంబై గుడ్ న్యూస్ చెప్పింది . రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అక్టోబర్ 7 వరకు గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది 

GATE-2021 రాయాలనుకుని ఇంత వరకు రిజిస్టర్ కాని విద్యార్థులకు ఐఐటీ బాంబే గుడ్ న్యూస్ చెప్పింది. పరీక్ష రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని అక్టోబర్7 వరకు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణ ఫీజుతోనే అక్టోబర్ 7 వరకు దరఖాస్తులు అంగీకరిస్తామని ఓ ప్రకటనలో ఐఐటీ బాంబే స్పష్టం చేసింది. మొదట ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 30 ఆఖరు తేదీగా ప్రకటించారు. అయితే ఈ తేదీని పొడిగించాలని విద్యార్థుల నుంచి అనేక అభ్యర్థనలు రావడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
అదనపు రుసుంతో దరఖాస్తు చేసుకునే ఆఖరు తేదీని సైతం అధికారులు పొడిగించారు. మొదట విడుదలైన షెడ్యూల్ లో అక్టోబర్ 1 నుంచి అదే నెల 7వ తేదీ వరకు అదనపు రుసుంతో ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. అయితే మార్చిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 8 నుంచి అక్టోబర్ 8వరకు ఈ అదనపు ఫీజుతో గేట్ పరీక్షకు రిజిస్టర్ చేసుకునే అవకాశం కల్పించారు.

గేట్ ఎగ్జామ్ ను వచ్చే సంవత్సరం(2021) ఫిబ్రవరిలో నిర్వహించనున్నారు. ఆరు రోజులు, 12 సెషన్లలో ఈ పరీక్ష జరగనుంది. ఫిబ్రవరి 5 నుంచి 7 వరకు, అదే నెల 12 నుంచి 14 వరకు ఈ పరీక్షను నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ పరీక్ష గురించి ముఖ్యమైన అప్ డేట్స్, ఇతర సమాచారం గురించి గేట్ 2021 వెబ్ సైట్ ను సందర్శించాలని అధికారులు సూచించారు.
GATE 2021 రిజిస్ట్రేషన్ ఇలా..

  • అధికారిక వెబ్ సైట్ gate.iitb.ac.in ఓపెన్ చేయాలి.
  • అనంతరం GATE Online Application Processing System(GOAPS) ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • అనంతరం ‘register here’ పై క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి.
  • కరెక్టు వివరాలతో ఫారం నింపాలి.
  • అనంతరం రిజిస్ట్రేషన్ ఐడీ, పాస్ వర్డ్ ను సేవ్ చేసుకోవాలి.
  • ఫీజు చెల్లిస్తే మీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అవుతుంది.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "GATE 2021: Good news for those who want to write the gate .. Dates change!"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0