Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Hari Chandan from Vijayawada Raj Bhavan on Monday participated in the Governors' Conference on New Education Policy 2020 2020 introduced by the Central Government under the leadership of President of India Ram Nath Kovind

భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా జాతీయ నూతన విద్యా విధానం 
Hari Chandan from Vijayawada Raj Bhavan on Monday participated in the Governors' Conference on New Education Policy 2020 2020 introduced by the Central Government under the leadership of President of India Ram Nath Kovind

అమలుకు ఏపీ సిద్ధం 
గవర్నర్ల సదస్సులో బిశ్వభూషణ్ హరిచందన్.

 భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా జాతీయ నూతన విద్యా విధానాన్ని తీర్చిదిద్ది నట్లు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు . కేంద్ర ప్ర భుత్వం ప్రకటించిన నూతన జాతీయ విద్యా విధానం 21 వ శతాబ్దపు ఉన్నత విద్య అవసరాలు , రానున్న సమస్యలను పరిష్కరించగలుతుందని చెప్పారు . భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం -2020 పై సోమవారం నిర్వహించిన గవర్నర్ల సదస్సులో విజయవాడ రాజ్ భవన్ నుంచి హరి చందన్ పాల్గొన్నారు . నూతన జాతీయ విద్యా విధానాన్ని స్వాగతిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు . ఉన్నత విద్యా వ్యవ స్థలో నాణ్యతా ప్రమాణాలను సాధించే లక్ష్యంతో ఏపీ ప్రభు త్వం నిజమైన స్ఫూర్తితో నూతన విద్యా విధానం అమలుకు యోచిస్తున్నట్లు సమావేశం దృష్టికి గవర్నర్ తీసుకొచ్చారు . 
పరిశోధనలో నాణ్యతతో పాటు పేటెంట్ ఆధారిత పరిశోధన , మేధో సంపత్తి హక్కలను ప్రోత్సహించేందుకు జాతీయ పరిశోధనా సంస్థతో రాష్ట్ర విశ్వ విద్యాలయాల తరు పున అవగాహన ఒప్పందం కుదుర్కున్నట్లు చెప్పారు . రాష్ట్రంలో సంస్థాగత పరిశోధనలను ప్రోత్సహించేందుకు రాష్ట్రస్థాయి పరిశోధనా మండలి ఏర్పాటు చేస్తున్నామ న్నారు . ఇదే సమయంలో విద్యా సంస్థలను పరిశ్రమలతో అనుసంధానించడం ద్వారా మెరుగైన ఫలితాలు రాబట్టేం దుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు . 
జాతీయ విద్యా విధానం -2020 సిఫారసులకు అనుగుణంగా ఆన్లైన్ , డిజిటల్ విద్యకు ప్రాముఖ్యతను ఇస్తూ మిశ్రమ అభ్యాసాన్ని ప్రోత్సహించేందుకు ఏపీ ప్రభుత్వం నూతన నిర్వహణ వ్యవస్థను అభివృద్ధి చేస్తోందని గవర్నర్ బిశ్వ భూషణ్ పేర్కొన్నారు . గ్రామీణ , వెనుకబడిన విద్యార్థులకు ఆన్లైన్ విద్యకు అవకాశం కలిపించేందుకు పట్టణ , గ్రామీణ , మారుమూల ప్రాంతాల్లో సాంకేతికత అంతరాన్ని తగ్గించేందుకు ఈ - లెర్నింగ్ కమ్యూనిటీ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు . కొత్త విధానం అధ్యయనం , అమలుకు మార్గదర్శకాలు రూపొందించేం దుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు గవర్నర్ చెప్పారు . ఉన్నత విద్యా వ్యవస్థలో నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ జాతీయ విద్యా విధానం -2020 అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు . సదస్సులో విజయవాడ రాజ్ భవన్ నుంచి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదమూలపు సురేష్ , గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా , ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర , కళాశాల విద్యా కమిషనర్ ఎంఎం నాయక్ , ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ఆచార్య హేమచంద్రారెడ్డి , గవర్నర్ సంయుక్త కార్యదర్శి శ్యామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Hari Chandan from Vijayawada Raj Bhavan on Monday participated in the Governors' Conference on New Education Policy 2020 2020 introduced by the Central Government under the leadership of President of India Ram Nath Kovind"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0