Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

How do kidney stones form? How to reduce them?

మూత్రపిండాల్లో రాళ్ళూ ఎలా ఏర్పడతాయి? వాటిని ఎలా తగ్గించాలి?

How do kidney stones form? How to reduce them?

ఇటీవల రోజుల్లో వయసు తేడా లేకుండా అందరిలో కనిపిస్తున్న సమస్య కిడ్నీల్లో రాళ్ళూ. మూత్రపిండంలో లేదా మూత్ర నాళంలో ఏర్పడిన ఒక స్ఫటిక ఆకారంలో ఉండే ఘన పదార్థాన్ని కిడ్నీ లో రాళ్ళూ అంటారు. మూత్ర పిండాల్లో రాళ్ళూ ఉండే స్థితిని నిఫిరోలిథియాసిస్ అంటారు. మరియు మూత్ర నాళంలో రాళ్ళూ ఉండే స్థితిని యూరలిథియాసిస్ అంటారు.కిడ్నీ రాళ్ళు అనేవి శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు ఏర్పడతాయి .

కిడ్ని లో రాళ్ళూ ఉంటే తరచుగా కడుపు, నడుము భాగంలో తీవ్ర నొప్పిని కలిగిస్తాయి. ఈ మధ్య చాలామంది కిడ్నీల్లో రాళ్లతో బాధపడుతున్నారు. ఈ సమస్యకు కారణం… మారిన జీవన విధానం, సరైన పోషకాలు లేని ఆహారం తీసుకోకపోవడం,కృత్రిమ ఔషధాలతో పండించే ఆహారం తినడం , సమయానికి తినకపోవడం, నీరు తక్కువగా త్రాగటం లాంటివి ప్రధాన కారణాలు.అయితే మూత్ర పిండాల్లో రాళ్ళూ 4 రకాలు ఉంటాయి.
1. కాల్షియం

కాల్షియం రాళ్ళు సర్వసాధారణం.

  • బంగాళదుంప చిప్స్
  • వేరుశెనగ
  • చాక్లెట్
  • దుంపలు
  • పాలకూర ఇలాంటి పదార్థాలలో ఉండే ఒక్స్లాటే వాళ్ళ ఏర్పడతాయి.

2. యూరిక్ ఆమ్లం:

ఈ రకమైన మూత్రపిండాల రాయి మగవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. కీమోథెరపీ ద్వారా, గౌట్ ఉన్నవారిలో ఇవి తయారవుతాయి. మూత్రంలో ఆమ్లలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ రాయి అభివృద్ధి చెందుతుంది.
3. స్ట్రువిట్ :

ఈ రకమైన రాయి మూత్రపిండాల అంటు వ్యాధులు ఉన్న ఆడవారిలో ఎక్కువగా కనిపిస్తాయి. ఈ రాళ్ళు పెద్దవి మరియు మూత్ర అడ్డంకి కారణమవుతాయి. అంతర్లీన సంక్రమణను చికిత్స చేయడం స్ట్రువిట్ రాళ్ల అభివృద్ధిని నిరోధిస్తుంది.
4. సిస్టైన్:

సిస్టైన్ రాళ్ళు అరుదు. జన్యు క్రమరాహిత్య సిస్టినూరియా కలిగిన మగవారు మరియు ఆడవారిలో ఇవి ఏర్పడతాయి. ఈ రకం రాయి శరీరం లో సహజంగా సంభవించే ఒక ఆమ్లం – ఇవి మూత్రపిండాలు నుండి మూత్రం లోకి స్రావాలును విడిదల చేస్తుంది. మూత్రపిండాల సమస్యలు కలిగిన శిశువులలో మూత్రపిండాల్లో రాళ్ళు సాధారణం. ఇలా ఉన్న వారికి రోజుకు ఒక లీటరు మూత్రం కంటే తక్కువగా తయారవుతుంది.
ఒక సర్వే ప్రకారం ఆడవారి కంటే మగవారిలో ఎక్కువ శాతం మూత్ర పిండాల్లో రాళ్ల సమస్య ఉందని వెల్లడించారు. 
మనం తీసుకునే ఆహారంలో ఉప్పు శాతం తగ్గించాలి . బయట దొరికే జంక్ ఫుడ్ తక్కువ తినాలి. నిమ్మరసం త్రాగటం, పండ్ల రసాలు త్రాగటం వల్ల ,శుద్ధమైన నీటిని ఎక్కువ తీసుకోవటం వల్ల మూత్ర పిండాల్లో రాళ్ల సమస్యను చాల వరకు తగ్గించవచ్చు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "How do kidney stones form? How to reduce them?"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0