Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Inspiration

ఫోన్ నుంచి పొలంలో ' ఇస్మార్ట్ వ్యవసాయం ' !
Inspiration


భారత నేలపై ఎప్పటికీ రైతే రారాజు. ఎన్ని ఒడుదొడుకులొచ్చినా.. వ్యవసాయ భూమిలో యుద్ధం చేస్తాడు అతడు. తాను ఆకలితో అలమటిస్తూ.. దేశానికి అన్నం పెడతాడు. అందుకే, అంత గొప్ప మనసున్న రాజుకు చేయూత అందించేందుకు ఓ ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారు తమిళనాడుకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులు. రైతుల కష్టాలు కాస్త అయినా తగ్గించడానికే 'స్మార్ట్ వ్యవసాయం' మొబైల్ యాప్, 'అయస్కాంత నీటి' ఫార్ములాలను తయారు చేశారు. 'స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ ప్రాజెక్ట్'లో రెండు బహుమతులను సైతం కైవశం చేసుకున్నారు.
తమిళనాడు సాలెం పట్టణానికి చెందిన ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు అధునాతన సాంకేతికతతో రైతు నేస్తాలయ్యారు. అన్నదాతల కోసం ఓ మొబైల్ యాప్ తయారు చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అయస్కాంత నీటితో 'ఆటోమెటిక్ సేద్యం' ఆవిష్కరించి సాంకేతిక రంగంలో సత్తా చాటారు.
స్మార్ట్ వ్యవసాయం
సాలెం పట్టణంలోని త్యాగరాజ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు అన్నదాతల కోసం రెండు అత్యాధునిక సాంకేతికతలను ఆవిష్కరించారు.

డిజిటల్​ ఇండియా నిర్మాణంలో 'స్మార్ట్ వ్యవసాయం' తొలిమెట్టు అంటూ ఓ మొబైల్ యాప్ రూపొందించారు కళాశాలకు చెందిన బాలికల బృందం. ఈ యాప్​కు అనుసంధానం చేసిన పరికరాలతో.. గాలిలో తేమను అంచనా వేయొచ్చు. ఆటోమేటిక్ వాటర్ సిస్టమ్ ద్వారా ఫోన్ నుంచే పంటకు నీళ్లు అందించవచ్చు. ఆటోమెటిక్ ఫెర్టిలైజేషన్ సిస్టమ్​తో ఎరువులు చల్లేయొచ్చు.

ఈ యాప్​తో రైతు ప్రతి రోజూ పొలం వద్దకు వెళ్లే అవసరం లేకుండానే పంట ఎలా ఉందో చూసుకుని, వ్యవసాయం చేయొచ్చు అంటున్నారు విద్యార్థినులు. పంటకు సమయానుకూలంగా నీరు, ఎరువులు అందేలా చూడొచ్చు అంటున్నారు.

"ఏటా ఏఐసీటీఈ, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సంయుక్తంగా ఇండియా హ్యాకథాన్ కార్యక్రమం నిర్వహిస్తున్నాయి. ఈ ఏడాది మా కళాశాల ప్రిన్సిపల్​ సూచన మేరకు మా ఆవిష్కరణలను హ్యాకథాన్​లో ప్రదర్శించాం. ఈ యాప్ మొక్కల పెరుగుదలను పర్యవేక్షిస్తుంది. అంతే కాదు, ఆటోమేటిక్ ప్లాంట్ వాటర్ సిస్టమ్ కూడా ఈ యాప్​లో అందుబాటులో ఉంది. "

-వైశాలి, ఇంజినీరింగ్ విద్యార్థిని

అయస్కాంత జలం
ఇక ఇదే కాలేజీకి చెందిన బాలుర బృందం 'అయస్కాంత నీటి' ఫార్ములాతో సేద్యం పద్ధతినే మార్చేస్తున్నారు. తక్కువ నీటితో దిగుబడి పెంచుకునే విధానాన్ని కనిపెట్టారు.

"అధునాతన సాంకేతికత ద్వారా.. పంట సాగును సులభతరం చేయడమే మా ఆవిష్కరణ లక్ష్యం. ఇందులో, పర్మాగ్ అనే అయస్కాంతాన్ని వినియోగించాం. దీనితో బోరు నీటిని మాగ్నెటిక్ గుణాలతో నింపేయొచ్చు. ఈ అయస్కాంత నీటి వల్ల.. ఎలాంటి రసాయనాల అవసరం లేకుండానే దిగుబడి పెరుగుతుంది. తక్కువ నీటితో ఎక్కువ లాభం అన్నమాట."

-దినేశ్, ఇంజినీరింగ్ విద్యార్థి.

కేంద్ర ప్రభుత్వం ఏటా 'స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ ప్రాజెక్ట్' పేరిట ఓ కార్యక్రమం నిర్వహిస్తోంది. అందులో దేశవ్యాప్తంగా వేలాది మంది కళాశాల విద్యార్థులు సరికొత్త ఆవిష్కరణలను ప్రదర్శిస్తారు. ఈ ఏడాది వ్యవసాయ రంగం విభాగంలో త్యాగరాజ కాలేజీ విద్యార్థులు చేసిన ఆవిష్కరణలు.. రెండు కేటగిరీల్లోనూ ఫస్ట్ ప్రైజ్ పొందాయి. లక్ష రూపాయల నగదు బహుమతి గెలిచేలా చేశాయి.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Inspiration"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0