Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Inspiration

ప్రపంచ రారాజు .. అపర కుబేరుడు .. జెఫ్ బెజోస్


Inspiration

జెఫ్ బెజోస్.. ప్రపంచ అపర కుబేరుడు. కరోనాతో ఆర్థిక వ్యవస్థలన్నీ కుప్పకూలుతున్నప్పటికీ కోట్లు వెనకేసుకున్నాడు ఈ ధనవంతుడు. కానీ ఇదంతా ఊరికే వచ్చింది కాదు. ఈ స్థాయి విజయం సాధించాలంటే ఎంతో కష్టపడి ఉండాలి. ఆయన ఆసక్తికరమైన జీవితంలోని విశేషాలు మీకోసం.
"నేను ప్రయత్నించి విఫలమైతే పెద్దగా బాధపడను. అసలు ప్రయత్నించకుండానే ఉండడమనే నిర్ణయమే నన్ను ఎక్కువ బాధపెడుతుంది." ఒకానొక సందర్భంలో జెఫ్‌ బెజోస్‌ అన్నమాటలివి.

ఈ ఆలోచనా ధోరణే అతన్ని ఆ స్థాయికి చేర్చి ఉండొచ్ఛు ప్రపంచంలోనే అత్యంత కుబేరుడిని చేసి ఉండొచ్ఛు. భూగోళం మొత్తం మీద 200 బిలియన్‌ డాలర్ల ( దాదాపు రూ.15 లక్షల కోట్లు) నికర విలువను కలిగి ఉన్న ఏకైక వ్యక్తిగా నిలబెట్టి ఉండవచ్ఛు  అలాంటిది ఈ స్థాయి విజయం సాధించాలంటే ఎంత కష్టపడి ఉండాలి. అమెజాన్‌కు సీఈఓగా, ద వాషింగ్టన్‌ పోస్ట్‌ యజమానిగా, అంతరిక్ష కంపెనీ బ్లూ ఆరిజిన్‌కు వ్యవస్థాపకుడిగా.. ఇలా ఎన్నో విజయవంతమైన వ్యాపారాలను నిర్వహించిన బెజోస్‌ జీవితం ఎవరికైనా ఆసక్తికరమే.
బాల్యం
టెడ్‌ జోర్గెన్‌సన్‌, జాక్లిని గిజ్‌ జోర్గెన్‌సన్‌ దంపతులకు 1964లో జెఫ్ బెజోస్‌ జన్మించారు. ఆయన పుట్టే సమయానికి, తండ్రి బైక్‌ షాపు యజమాని కాగా.. తల్లి జాక్లిని 17 ఏళ్ల విద్యార్థిని. బెజోస్‌కు నాలుగేళ్ల వయసున్నపుడు తల్లి మైక్‌ బెజోస్‌ అనే మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. 1986లో ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్‌ సైన్స్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ పట్టా పుచుకున్న బెజోస్‌కు ముందు నుంచీ కంప్యూటర్లపైన ఆసక్తి. 
వాల్‌స్ట్రీట్‌లో అడుగు
ప్రిన్స్‌టన్‌ నుంచి బయటకు వచ్చాక.. న్యూయార్క్‌లోని వాల్‌స్ట్రీట్‌లో బెజోస్‌ పలు కంపెనీల్లో పనిచేశారు. 1990లో డి.ఈ. షాలకు అత్యంత పిన్న వయస్కుడైన వైస్‌ ప్రెసిడెంట్‌గానూ మారారు. ఫైనాన్స్‌లో కొనసాగడానికి అతని మనసు ఎంత మాత్రం అంగీకరించకపోవడంతో 1994లో ఆ ఉద్యోగానికి రాజీనామా చేశారు.
తొలి అడుగు అదే..
అతనికున్న కంప్యూటర్‌ పరిజ్ఞానంతో ఇ-కామర్స్‌ ప్రపంచంలోకి అడుగుపెడదామని అనుకున్నాడు. 1995లో ఆన్‌లైన్‌ బుక్‌స్టోరును ప్రారంభించారు. దాని పేరే అమెజాన్‌.కామ్‌. అదృష్టమో..పడ్డ కష్టమో ఏమో కానీ.. ఎటువంటి ప్రచారమూ లేకుండానే.. అమెరికాతో పాటు 45 దేశాల్లో 30 రోజుల్లో పుస్తకాలు భారీగా విక్రయించారు. . గ్యారేజీ నుంచి రెండు పడక గదుల ఇంటికి కార్యకలాపాలను మార్చారు.
1997లో అమెజాన్‌
1997లో అమెజాన్‌ను స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదు చేసినపుడు చాలా మంది విశ్లేషకులు పెదవి విరిచారు. షాపులున్న వారే సొంతంగా ఇ-కామర్స్‌ సైట్లు నిర్వహిస్తున్న వేళ ఎటువంటి షాపులూ లేకుండా ఎలా విజయం సాధిస్తారని అనుమానాలు వ్యక్తం చేశారు.  పుస్తకాల దగ్గరే ఆగిపోతే.. అమెజాన్‌ గురించి కానీ.. బెజోస్‌ గురించి కానీ ప్రపంచానికి తెలిసేది కాదు.

విస్తరణ
1998లో సీడీలు, వీడియాలను విక్రయించడం మొదలుపెట్టిన బెజోస్‌ క్రమంగా.. దుస్తులు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు, బొమ్మలు.. ఇలా అన్నిటినీ విక్రయిస్తూ.. వ్యాపారాన్ని విస్తరించుకుంటూ పోయారు. 1995లో 510,000 డాలర్ల వార్షిక అమ్మకాలు కాస్తా 2011 నాటికి 17 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి. 2018 నాటికి అమెజాన్‌ పెయిడ్‌ చెల్లింపుదార్లు 10 కోట్లకు చేరుకోవడం గమనార్హం. అదే ఏడాది సెప్టెంబరుకు అమెజాన్‌ విలువ లక్ష కోట్ల డాలర్లకు చేరుకుని.. యాపిల్‌ తర్వాత ఆ స్థాయికి చేరుకున్న సంస్థగా నిలిచింది.
కరోనా సమయంలోనూ..
ఈ ఏడాది జనవరి 1న బెజోస్‌ నికర విలువ 115 బిలియన్‌ డాలర్లే. అయితే అమెజాన్‌ షేరు అప్పటి నుంచి ఇప్పటి దాకా 80 శాతం దూసుకెళ్లడంతో అందులో బెజోస్‌కున్న 11 శాతం వాటా(90 శాతం నికర సంపద ఇందులోదే) కూడా కాసులు కురిపించింది. కరోనా వల్ల వినియోగదార్ల ధోరణిలో వచ్చిన మార్పే 56 ఏళ్ల బెజోస్‌ను 200 బి. డాలర్ల నికర సంపదను అధిగమించేలా చేసింది.


  • బెజోస్‌కు అంతరిక్షంలో ప్రయాణించాలన్న కోరిక ఉంది. అందుకే స్పేస్‌లోకి వెళ్లే నౌకలను తయారు చేయడానికి తన సంపదలో కొంత భాగాన్ని ఖర్చు చేస్తున్నారు.
  • 2020లో 100 మి. డాలర్లను ఫీడ్‌ అమెరికా అనే లాభాపేక్ష రహిత సంస్థకు విరాళం ఇచ్చారు. దీని ద్వారా అమెరికాలో ఆకలితో ఉన్న వారికి చేయూతనిచ్చారు.
  • కరోనా సమయంలోనూ 1,75,000 మందికి ఉద్యోగాలిచ్చారు.
  • 2026 కల్లా లక్ష కోట్ల డాలర్ల(ట్రిలియన్‌ డాలర్లు)ను సాధించే తొలి వ్యక్తి ఈయనే అవుతారన్న అంచనా ఉంది.
  • గతేడాది తన భార్యతో విడాకులకు సంబంధించిన సెటిల్‌మెంట్‌ కింద అమెజాన్‌లో 25% వాటా ఇచ్చారు. ఆ వాటా విలువ ఇపుడు 63 బి. డాలర్లు.
  • డేవిడ్‌ జిఫెన్‌ను చెందిన వార్నర్‌ ఎస్టేట్‌ను 165 బి. డాలర్లతో కొనుగోలు చేశారు. ఇంతకంటే విలాసమైన కలల సౌధం ఈ ప్రపంచంలో ఉండదని వినికిడి.



SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Inspiration"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0