Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

It is enough to follow these ten principles to be perfectly healthy

సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పది సూత్రాలు పాటిస్తే సరిపోతుంది.
It is enough to follow these ten principles to be perfectly healthy

మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటేనే ఏ పనైనా మనసు పెట్టి చేయగలుగుతాం. మరి, అలాంటి ఆరోగ్యం మన సొంతం కావాలంటే చక్కటి పోషకాహారం తీసుకోవడమే కాదు.. వాటిని తినడానికీ ఓ పద్ధతుందని చెబుతున్నారు ప్రముఖ పోషకాహార నిపుణురాలు రుజుతా దివేకర్‌. అలాగే ఆహారంతో పాటు వ్యాయామానికీ సమ ప్రాధాన్యం ఇవ్వాలంటున్నారు. సెప్టెంబర్‌ 1-7 ‘జాతీయ పోషకాహార వారం’ సందర్భంగా సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవాలంటే కొన్ని ప్రాథమిక సూత్రాలు పాటించాలంటూ తాజాగా ఇన్‌స్టాగ్రామ్ లో ఓ పోస్ట్‌ పెట్టారామె. మరి, ఏంటా సూత్రాలు? తెలుసుకుందాం

ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై అవగాహన పెంచే క్రమంలో ఆయా పదార్థాలు-వాటిలో దాగున్న ఆరోగ్య రహస్యాలు, శారీరక-మానసిక దృఢత్వం కోసం చేయాల్సిన వ్యాయామాల గురించి ఫొటోలు, వీడియోల ద్వారా అందరిలో ఆరోగ్య స్పృహ పెంచుతున్నారు.
అందరికీ ఇవి అవసరం!
చక్కటి ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ ఈ పది సూత్రాలు తప్పక పాటించాలి.

  • 1. తినడానికీ ఓ పద్ధతుంది.. కూర్చొనే తినాలి.. అది కూడా స్పూన్స్‌తో కాకుండా చేతులతో తినడం అలవాటు చేసుకోవాలి. ఆహారాన్ని ఆదరాబాదరాగా మింగడం కాకుండా బాగా నమలాలి.
  • 2. తినేటప్పుడు గ్యాడ్జెట్స్‌ చూడడం, ఇతర విషయాలపై పరధ్యానం తగదు.
  • 3. రోజువారీ ఆహారంలో భాగంగా గుప్పెడు నట్స్‌ తీసుకోవడం మంచిది. ఉదాహరణకు.. ఉదయం పూట బాదంపప్పులు/వాల్‌నట్స్‌, మధ్యాహ్నం వేరుశెనగ/జీడిపప్పులు తీసుకోవచ్చు.
  • 4. ఆయా సీజన్లలో లభించే ఆకుపచ్చ కాయగూరలు ఆరోగ్యానికి చాలా మంచివి. ఈ వర్షాకాలంలో పొట్లకాయ, బెండకాయ, గోంగూర.. వంటివి తినాలి.
  • 5. రాగులు, జొన్నలు.. వంటి చిరుధాన్యాలను కూడా రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి.
  • 6. ఇంట్లో తోడు పెట్టుకున్న పెరుగునే తీసుకోండి.
  • 7. అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనంలో కచ్చితంగా టీస్పూన్‌ నెయ్యి తీసుకోవడం మాత్రం మరవద్దు.
  • 8. రోజూ అరగంట వ్యాయామం మనల్ని ఆ రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది.
  • 9. ఎప్పుడు పడితే అప్పుడు పడుకోవడం, నిద్ర లేవడం కాకుండా.. దానికంటూ ఒక కచ్చితమైన సమయం పెట్టుకొని రోజూ అదే ఫాలో అవ్వండి.
  • 10. అవసరం లేకున్నా మొబైల్‌తో కాలక్షేపం చేయడం, టీవీ చూడడం.. వంటివి తగ్గించుకుంటే మంచిది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "It is enough to follow these ten principles to be perfectly healthy"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0