Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Let's go home - insurance amulet.

ఇంటికి ఇద్దాం-భీమా రక్ష.

అనుకోని కష్టం వచ్చినప్పుడు ఆర్థికంగా మనం దెబ్బతినకుండా కాపాడే పథకాల్లో బీమా ఒకటి. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో దీని అవసరం మరింత పెరిగింది. జీవిత, ఆరోగ్య, వాహన బీమా పాలసీలతోపాటు.. మనం సురక్షితంగా ఉంటున్న ఇంటికీ బీమా రక్ష కల్పించాల్సిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉంది.

మరి, ఈ గృహ బీమాను ఎవరు తీసుకోవాలి? ఏయే అంశాలకు అది రక్షణ కల్పిస్తుందో తెలుసుకుందామా!

జీవితంలో అతి పెద్ద పెట్టుబడి ఇల్లు. కలల గృహానికి ఏదైనా నష్టం జరిగితే.. ఆర్థికంగా నష్టపోవడంతోపాటు మానసికంగానూ ఆందోళన ఉంటుంది. అందుకే, దీనికి బీమాతో ఆర్థిక రక్షణ కల్పించాల్సిన అవసరముంది.

ఎవరు తీసుకోవచ్చు?: సొంతిల్లు ఉన్న వారే కాకుండా.. అద్దెకుంటున్న వారూ గృహ బీమా పాలసీని ఎంచుకోవచ్ఛు.

ఎంత వ్యవధికి?: ప్రస్తుతం గృహ బీమా పాలసీలు 1 రోజు వ్యవధి నుంచి 5 ఏళ్ల దీర్ఘకాలిక వ్యవధికి అందుబాటులో ఉన్నాయి.
ఎందుకు అవసరం?

  •  ప్రస్తుత వర్షాకాలంలో పలు నగరాలు, పట్టణాల్లో వరదలతో నష్టం వాటిల్లిన సంఘటనలు చూశాం. 
  • ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలతో నిర్మాణానికేదైనా నష్టం వాటిల్లితే ఈ పాలసీద్వారా పరిహారం పొందే వీలుంటుంది.
  •  గృహోపకరణాలు, ఫర్నిచర్‌, దుస్తులు, సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టెలివిజన్‌ తదితరాలను గృహ బీమాలో భాగం చేయొచ్ఛు విలువైన వస్తువులు అంటే బంగారు ఆభరణాల్లాంటి వాటి కోసం ప్రత్యేకంగా అనుబంధ పాలసీ తీసుకోవాల్సి వస్తుంది. 
  • బంగారు ఆభరణాలకు ఇంట్లో ఉన్నప్పుడే కాకుండా.. బయట ధరించినప్పుడూ, వాటికేమైనా జరిగితే బీమా రక్షణ ఉండేలా పాలసీని ఎంపిక చేసుకోవచ్ఛు
  • ఇంట్లో జరిగే ప్రమాదం వల్ల వేరే వ్యక్తికి లేదా ఆస్తికి నష్టం వాటిల్లినప్పుడు దానికి పరిహారమూ గృహ బీమా చెల్లిస్తుంది.
  •  ఉదాహరణకు ఇంట్లో సిలిండర్‌ పేలినప్పుడు పక్కింటికీ నష్టం సంభవిస్తుంది. 
  • లేదా ఇంటికి మరమ్మతు చేస్తున్న సమయంలో ఏదైనా కిందపడి పక్క ఇంటికి నష్టం జరగొచ్ఛు ఇలాంటి సందర్భాల్లో ఈ పాలసీ ఉపయోగపడుతుంది.
  • పాలసీదారుడి ఇష్టానుసారం గృహ బీమాను ఎంచుకునే అవకాశం ఉంటుంది.
  •  విలువ ఆధారంగా లేదా స్థిరంగా ఇంత పరిహారం కావాలి అనేది నిర్ణయించుకోవచ్ఛు మీరు ఎంచుకున్నదాన్ని బట్టి, ప్రీమియం నిర్ణయిస్తారు.
  •  గృహ బీమా రోజుకు రూ.5 ఖర్చుతోనూ పొందే అవకాశం ఉంటుంది. అనుకోని సంఘటనల వల్ల నష్టం జరిగితే తప్ప చాలామంది ఈ బీమా గురించి ఆలోచించరు. 
  • ముందే మేల్కొంటే.. ఆర్థికంగా నష్టపోకుండా ఉండగలం.
  • అగ్ని ప్రమాదం జరిగితే ఇంట్లో ఉన్న వస్తువులు కాలిపోతాయి. ఇంటికీ మరమ్మతుల అవసరం పడుతుంది. 
  • ఇలాంటప్పుడు ఆ వస్తువుల విలువను ఈ పాలసీ ద్వారా తీసుకోవచ్ఛు దీంతోపాటు అనుబంధ పాలసీలను ఎంచుకుంటే ఇల్లు బాగయ్యేంత వరకూ వేరే చోట ఉంటే ఆ ఖర్చులూ చెల్లిస్తారు.
  •  దొంగతనం జరిగినప్పుడూ, జరిగిన ఆర్థిక నష్టానికి పరిహారం లభిస్తుంది.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Let's go home - insurance amulet."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0