Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Mental Health During Corona: Expert Recommendations

కరోనా సమయంలో మానసిక ఆరోగ్యం: నిపుణుల సూచనలు
Mental Health During Corona: Expert Recommendations

కరోనా సమయంలో మానసిక ఆరోగ్యం: నిపుణుల సూచనలు
ప్రస్తుత సమయంలో భయము, ఆత్రుత సహజంగానే ప్రతి ఒక్కరిలో కనిపిస్తాయి. మన ఆరోగ్యం గురించి, మన ఆప్తుల ఆరోగ్యం గురించి, మన పనుల గురించి, మన ఆర్ధిక పరిస్థితి గురించి కంగారు పడడం సహజమే. మన కుటుంబ సభ్యుల కోసం మన స్వంత ఆరోగ్యం కోసం తగిన శ్రద్ద తీసుకొని భయాన్ని తగ్గించుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి.


  • మీరు నియంత్రించలేని వాటిని గూర్చి ఆలోచించకుండా మీరు నియంత్రించ గలిగిన వాటిపై ఎక్కువ దృష్టిని పెట్టండి.
  •  ఆరోగ్య శాఖ మరియు ఇతర ప్రభుత్వ శాఖలవారి మార్గదర్శకాలను తప్పక పాటించండి.
  • చేతులను తరచూ శుభ్రపరచుకోవాలి
  • మీ ఇంట్లో పని చేసే చోట తరచూ ఉపయోగించే ప్రదేశాలను క్రిమి సంహారకాలతో శుభ్రపరచుకోండి
  • సరైన పద్దతిలో తుమ్మడం, దగ్గడం నేర్చుకోండి
  • మీకేమైనా అనారోగ్యంగా ఉంటే, ఇంట్లోనే ఉండండి
  • జన సాంద్రత ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు వెళ్లడం నివారించండి
  • సామాజిక దూరాన్ని అలవాటు చేసుకోండి
  • పై సూచనలు పాటిస్తే మీ వంతు బాధ్యతను మీరు సమర్ధవంతంగా నిర్వర్తిస్తున్నట్లే
  • తద్వారా మీరు మీ కుటుంబాన్ని, మీ ప్రియమైన వారిని మరియు మీ సమాజాన్ని సురక్షితంగా ఉంచుతున్నట్లే.
  • వార్తలను, సోషల్ మీడియాను ఎక్కువగా చూడడం, అనుసరించడం వలన బాధ, కంగారు ఎక్కువైయ్యే అవకాశం ఉంది. 
  • కనుక రోజులో కొంత సమయాన్ని మాత్రమే వీటికోసం వెచ్చించండి. కరోనా గురించి ఇతరులతో వాగ్వివాదాలు మరింత నిరుత్సాహాన్ని కలిగిస్తాయి.
  •  పుకార్లను నమ్మకండి. నిజమైన సమాచారం ఏదో గ్రహించగలగాలి.
  • మీ ఇంట్లోనూ, పని ప్రదేశాలలోనూ, ఒక ప్రణాళిక ప్రకారం జీవించడం నేర్చుకోండి.
  • పౌష్టికాహారం తీసుకుంటూ, ప్రతిరోజూ వ్యాయామం చేస్తూ, కనీసం ఆరు గంటలు నిద్రకు కేటాయించి రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోండి.
  • మీకు ఆహ్లాదం కలిగించే పనులకు కొంత సమయం తప్పనిసరిగా కేటాయించండి. 
  • పాటలు పాడడం, పాటలు వినడం, నృత్యం, ప్రార్ధన వంటి వాటికి కొంత సమయం కేటాయించండి.
  • సామాజిక దూరాన్ని పాటిస్తూనే, ఇతరులతో బాంధవ్యాలను కొనసాగించండి. 
  • మీ ఫోన్లు, వీడియోలు మరియు అంతర్జాలం ఉపయోగించి మీ ఆప్తుల సమాచారం తెలుసుకోండి.
  • అవసరత లో ఉన్న వారికి సహాయం చెయ్యడానికి కరుణను, సానుభూతిని అలవర్చుకోండి. 
  • ఈ సహాయం అత్యవసరాల  రూపంలోనో, వైద్య అవసరాల రూపంలోనో, లేక వైద్య సిబ్బందికి అవసరమైన పరికరాలు అందించడం ద్వారానో చెయ్యవచు.
  • పరిస్థితులలో తో పోరాడలేని వారు తమ స్నేహితుల సహాయం కోరండి. మీకు ఎటువంటి మానసిక అసౌకర్యము ఉన్నా, వెంటనే నిపుణులను సంప్రదించండి.

గమనించండి:
కరోనా సోకినవారు చాలామంది స్వస్తులైయ్యారు

శాస్త్రవేత్తలు, నిపుణులు కరోనా కు మందు కనుగొనుటకు కృషి చేస్తున్నారు.

ప్రభుత్వం, ప్రభుత్వేతర మరియు ఎన్నో స్వచ్చంద సంస్థలు సహాయం చెయ్యడానికి ముందుకు వస్తున్నారు.

శారీరకంగా మరియు మానసికంగా బలంగా ఉండడానికి మనందరం కలసి కట్టుగా కృషి చెయ్యాలి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Mental Health During Corona: Expert Recommendations"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0