Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

. The PAN number, also known as the Permanent Account Number (PAN), contains only one number per person in the country. There are easy ways to find out the PAN card status online.

PAN CARD : పాన్‌ కార్డ్ స్టేటస్ ను తెలుసుకోవాలంటే ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి.

పర్మనెంట్ అకౌంట్ నెంబర్ ( PAN ) గా పిలువబడే పాన్ నంబర్ దేశంలో ఒక వ్యక్తి కి ఒక నంబర్‌ను మాత్రమే కలిగి ఉంటుంది . ఆన్లైన్లో పాన్ కార్డు స్టేటస్ ను తెలుసుకునేందుకు సులభమైన పద్ధతులున్నాయి వాటి వివరాలు.
భారతదేశం డిజిటలైజేషన్ దిశగా దూసుకుపోతోంది. ఇంతకుముందులా సుదీర్ఘమైన రాతపని ప్రక్రియను పూర్తి చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆన్‌లైన్ సౌకర్యంతో క్షణాల్లో సేవలను అందుకోవచ్చు. దేశంలో పన్ను చెల్లింపుదారున్ని గుర్తించడానికి జారీ చేసే ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంఖ్యే పాన్ నెంబర్. పర్మనెంట్ అకౌంట్ నెంబర్‌ (PAN)గా పిలువబడే పాన్ నంబర్ దేశంలో ఒక వ్యక్తి ఒక నంబర్‌ను మాత్రమే కలిగి ఉంటాడు. ఆన్‌లైన్‌లో పాన్ కార్డు స్టేటస్‌ను తెలుసుకునేందుకు సులభమైన పద్దతులున్నాయి. క్రింద పేర్కొన్న పద్దతుల ద్వారా సులభంగాలో పాన్ కార్డ్ స్టేటస్ తెలుసుకోవచ్చు.
పాన్ లేదా కూపన్ నంబర్ ద్వారా
  • స్టెప్ 1: https://www.trackpan.utiitsl.com/PANONLINE/#forward లింక్‌పై క్లిక్ చేయండి.
  • స్టెప్ 2: మీ అప్లికేషన్ కూపన్ నంబర్ లేదా 10 అంకెల పాన్ నంబర్‌ను నమోదు చేయండి.
  • స్టెప్ 3: మీ పుట్టిన తేదీని నమోదు చేయండి.
  • స్టెప్ 4: పాన్ కార్డ్ ట్రాన్సాక్షన్ స్టేటస్ కోసం క్యాప్చా కోడ్ను నమోదు చేయండి.
  • స్టెప్ 5: తర్వాత ‘సబ్మిట్’ బటన్ పై క్లిక్ చేయండి.
  • స్టెప్ 6: మీ పాన్ కార్డ్ ట్రాన్సాక్షన్ స్టేటస్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.

మీ పేరు మరియు పుట్టిన తేదీని ఉపయోగించడం ద్వారా

  • స్టెప్ 1: ఆదాయపు పన్ను ఈ–-ఫైలింగ్ అధికారిక వెబ్సైట్ https://www.incometaxindiaefiling.gov.in/ కు వెళ్లండి.
  • స్టెప్ 2: ‘క్విక్ లింక్స్’ సెక్షన్లోని ‘వెరిఫై యువర్ పాన్ డీటెయిల్స్’ను ఎంచుకోండి.
  • స్టెప్ 3: మీ పాన్ నంబర్, పూర్తి పేరు, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయండి.
  • స్టెప్ 4: స్టేటస్ను ‘అప్లికెబుల్’ గా ఎంచుకోండి.
  • స్టెప్ 5: కాప్చా కోడ్‌ను నమోదు చేయండి.
  • స్టెప్ 6: ‘సబ్మిట్’ బటన్‌పై క్లిక్ చేయండి.
  • స్టెప్ 7: మీ పాన్ స్టేటస్ వివరాలను చూపించే ఒక కొత్త పేజీ తెరపై కనిపిస్తుంది.

ఫోన్ కాల్ ద్వారా..
పాన్ కార్డ్ స్టేటస్‌ను కాల్ సెంటర్ మొబైల్ నంబర్ /టెలిఫోన్ నంబర్ 020-27218080కు కాల్ చేయడం ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు. 15- అంకెల రసీదు సంఖ్యను అందించడం ద్వారా మీ పాన్ కార్డు స్టేటస్‌ను తెలుసుకోవచ్చు.
SMS పంపడం ద్వారా..
మీరు SMS ఉపయోగించి కూడా మీ పాన్ కార్డ్ స్థితిని చెక్ చేసుకోవచ్చు. 15 అంకెల రసీదు సంఖ్యతో పాటు ‘NSDLPAN’ అని టైప్ చేసి ‘57575’ ఎస్ఎంఎస్ పంపండి. మీ పాన్ కార్డ్ స్థితికి సంబంధించి మీకు SMS వస్తుంది.
ఆధార్ కార్డు సంఖ్య ద్వారా..

  • స్టెప్ 1: ఇన్కం టాక్స్ డిపార్ట్మెంట్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
  • స్టెప్ 2: ‘చెక్ పాన్ స్టేటస్’ పై క్లిక్ చేయండి.
  • స్టెప్ 3: అప్పుడు మీ 12 అంకెల ఆధార్ నంబర్ను నమోదు చేయండి.
  • స్టెప్ 4: కాప్చా కోడ్‌ను నమోదు చేయండి.
  • స్టెప్ 5: ‘సబ్మిట్’ బటన్‌పై క్లిక్ చేయండి. మీ పాన్ కార్డ్ స్టేటస్‌ స్క్రీన్‌పై కనిపిస్తుంది.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to ". The PAN number, also known as the Permanent Account Number (PAN), contains only one number per person in the country. There are easy ways to find out the PAN card status online."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0