Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Russia vaccine into the market‌

మార్కెట్ లోకి రష్యా వేక్సిన్‌ 
సెప్టెంబర్13 నుండి అందుబాటులోకి రానుంది.
Russia vaccine into the market‌

మాస్కో: ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కొవిడ్‌ వ్యాక్సిన్‌ రష్యా మార్కెట్‌లోకి విడుదలైంది. తాము అభివృద్ధి చేసిన 'స్పుత్నిక్‌-వి' వేక్సిన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసినట్లు రష్యా ఆరోగ్య శాఖ వెల్లడించింది. త్వరలోనే దీనిని దేశ వ్యాప్తంగా పంపిణీ చేస్తామని పేర్కొంది. ''కరోనా వైరస్‌ను నియంత్రించడానికి గమాలియా నేషనల్‌ రీసెర్చ్‌ సెంటర్‌ అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్‌ అన్ని రకాల ప్రయోగ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించింది. అందువల్ల దీనిని ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నాం'' అని రష్యా ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
సెప్టెంబర్13 నుండి అందుబాటులోకి రానుంది
ప్రపంచంలో మొదటి వాక్సిన్ ను రిలీజ్ చేసిన రష్యా ఇప్పుడు మరో న్యూస్ చెప్పింది. ప్రస్తుతం ఆ దేశంలో మూడో దశ ట్రయల్స్ ను నిర్వహిస్తున్నారు. ఈ ట్రయల్స్ అక్టోబర్ లేదా నవంబర్ నాటికి పూర్తవుతాయి. అయితే, ఒకవైపు ట్రయల్స్ నిర్వహిస్తూనే రష్యా వాక్సిన్ ను రిలీజ్ చేసేందుకు సిద్ధం అయ్యింది. సెప్టెంబర్ 10-13 మధ్యకాలంలో వాక్సిన్ కు సంబంధించిన అనుమతి ప్రక్రియను పూర్తి చేసుకొని సెప్టెంబర్ 13 నుంచి విస్తృత స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సిద్ధం అయ్యింది. సెప్టెంబర్ 13 నుంచే వాక్సిన్ ను ప్రజలకు అందించబోతున్నట్టు ప్రకటించింది. ప్రజలు వాక్సిన్ కోసం రిజిస్టర్ చేయించుకోవాలని అధికారులు పేర్కొన్నారు. అయితే, మొదట రిస్క్ ఎక్కువగా ఉన్న వ్యక్తులకు, పెద్దవారికి వాక్సిన్ ను ఇవ్వబోతున్నట్టు రష్యా పేర్కొన్నది.

తన కుమార్తె కూడా వ్యాక్సిన్‌ తీసుకున్నట్లు ఆ సమయంలో వెల్లడించారు. తమ వ్యాక్సిన్‌ కోసం పలు దేశాలు క్యూ కడుతున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు దాదాపు బిలియన్‌ డోస్‌ల వ్యాక్సిన్‌ కోసం 20 దేశాలు ముందస్తుగా ఆర్డర్‌ చేశాయని ఈ వ్యాక్సిన్‌కు నిధులు సమకూరుస్తున్న రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ సంస్థ వెల్లడించింది.

అయితే ఇప్పటికే రెండు దశల క్లినికల్‌ ట్రయల్స్‌ను మాత్రమే విజయవంతంగా పూర్తి చేసుకున్న రష్యా టీకా.. మూడో దశ ప్రయోగాలను భారత్‌లో చేపట్టాలని భావిస్తోంది. ఈ మేరకు రష్యా అధికారులు భారత్‌తో చర్చిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే సౌదీ అరేబియా, బ్రెజిల్‌, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్‌ లాంటి దేశాలు స్పుత్నిక్‌ మూడో దశ ప్రయోగాలను అనుమతిచ్చాయి. భారత్‌ కూడా అనుమతిస్తే.. టీకా ప్రపంచ వ్యాప్తంగా వీలైనంత త్వరగా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. కేవలం క్లినికల్‌ ట్రయల్స్‌కు మాత్రమే కాకుండా.. ఒక వేళ వ్యాక్సిన్‌ భారత్‌కు భారీ స్థాయిలో అవసరముంటుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Russia vaccine into the market‌"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0