Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

SBI New Services ... Benefit for Debit Card Users How to BLOCK ATM easily in case of any difficulties

SBI కొత్త సర్వీసులు ... డెబిట్ కార్డు వాడే వారికి బెనిఫిట్ ఏదైనా ఇబ్బందులు జరిగినపుడు ATM ను ఈజీ గా BLOCK చేసే విధానం.
దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తాజాగా తన కస్టమర్ల కోసం అదిరిపోయే తీపికబురు అందించింది. సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. దీంతో SBI లావాదేవీలు మరింత సురక్షితంగా మారబోతున్నాయి. దీంతో ఖాతాదారులకు ఊరట కలుగనుంది. ఇకపై SBI ఏటీఎం కార్డు లావాదేవీలను సులభంగానే బ్లాక్ చేయొచ్చు. దీని కోసం మీరు ఒక SMS పంపితే సరిపోతుంది. మీ SBI డెబిట్ కార్డు ఎక్కడైనా పోయినా లేదంటే ఎవరైనా తస్కరించినా వెంటనే మీరు  SMS ద్వారా ట్రాన్సాక్షన్లను బ్లాక్ చేయొచ్చు. లేదంటే ఎస్‌బీఐ కస్టమర్ కేర్ సెంటర్‌కు కాల్ చేయడం లేదా నెట్ బ్యాంకింగ్ లేదా SBI క్లిక్ యాప ద్వారా కార్డును కూడా బ్లాక్ చేసుకోవచ్చు.

SBI కొత్తగా తీసుకున్న SMS సర్వీసుల ద్వారా కార్డు ద్వారా జరిగే లావాదేవీలను సులభంగానే బ్లాక చేసేయొచ్చు. అంతేకాకుండా కస్టమర్లు వారి బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుసుకోవచ్చు. ఇంకా మిని స్టేట్‌మెంట్ కూడా పొందొచ్చు. అంతేకాకుండా చెక్ బుక్ కోసం కూడా రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు.

గత ఆరు నెలల అకౌంట్ స్టేట్‌మెంట్ కూడా పొందొచ్చు. హోమ్ లోన్, ఎడ్యుకేషన్ లోన్ వడ్డీ సర్టిఫికెట్ కూడా లభిస్తోంది. ATM మోసాలను అరికట్టాలనే లక్ష్యంతో స్టేట్ బ్యాంక్ ఈ కొత్త ఫీచర్‌ను తీసుకువచ్చింది. 'కస్టమర్ల లావాదేవీలను సురక్షితంగా మార్చేందుకు కొత్త ఫీచర్ తీసుకువచ్చాం.

ATM నుంచి మిని స్టేట్‌మెంట్, బ్యాలెన్స్ ఎంక్వైరీ వంటి రిక్వెస్ట్‌లు వచ్చినప్పుడు కస్టమర్లను SMS ద్వారా అలర్ట్ చేస్తాం. అప్పుడు కస్టమర్లు ట్రాన్సాక్షన్ జరగడానికి ముందుగానే వారి డెబిట్ కార్డును వెంటనే బ్లాక్ చేసుకోవచ్చు' అని SBI ట్వీట్ చేసింది. SBI ఖాతాదారులు SMS సర్వీసులు పొందాలని భావిస్తే మీ వద్ద బ్యాంక్ అకౌంట్‌తో లింక్ అయిన రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఉండాలి. ఈ మొబైల్ నెంబర్ ద్వారా BLOCK అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి డెబిట్ కార్డు చివరి నాలుగు అంకెలు ఎంటర్ చేసి 567676 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి.

ఇప్పుడు మీ డెబిట్ కార్డు బ్లాక్ అవుతుంది. ఒకవేళ మీరు మీ బ్యాంక్ అకౌంట్‌తో నెంబర్ రిజిస్టర్ చేసుకోకపోతే అప్పుడు ముందుగా మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేసుకోవాలి. దీని కోసం మీరు 09223488888 నెంబర్‌కు REG అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి అకౌంట్ నెంబర్ ఎంటరర్ చేసి సెండ్ చేయాలి. అప్పుడు మీకు ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది.

తర్వాత మీరు మీ కార్డును బ్లాక్ చేసుకోవడానికి మరో SMS పంపాల్సి ఉంటుంది. ఇకపోతే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా కార్డును బ్లాక్ చేయొచ్చు. దీని కోసం నెట్ బ్యాంకింగ్‌తో లాగిన్ అయ్యి ఇసర్వీసెస్ అనే ఆప్షన్‌లోకి వెళ్లాలి. అక్కడ ATM సర్వీసెస్ అని ఉంటుంది. దీనిపై క్లిక్ చేస్తే బ్లాక్ ATM కార్డ్ అని చూపిస్తుంది. దీని ద్వారా కార్డ్ బ్లాక్ చేయొచ్చు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "SBI New Services ... Benefit for Debit Card Users How to BLOCK ATM easily in case of any difficulties"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0