Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

The coronavirus vaccine is not coming this year.

ఈ ఏడాది కరోనా టీకా రానట్టే ... ఎప్పుడొస్తుందో చెప్పిన పపంచ ఆరోగ్య సంస్థ !


జెనీవా: కరోనా వైరస్ మహమ్మారితో తల్లడిల్లిపోతున్న ప్రపంచమంతా ఇప్పుడు కోవిడ్-19 వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తోంది. ఈ నేపధ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ రాబోయే 2021 మధ్యభాగంలో వ్యాక్సిన్ వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేసింది. ప్రస్తుతం వ్యాక్సిన్‌లన్నీ ప్రయోగదశలో ఉన్నాయని పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి మార్గరెట్ హ్యారిస్ ఈ విషయమై మాట్లాడుతూ 'వ్యాక్సిన్ తయారుచేస్తున్న ఏ దేశం కూడా ఇప్పటివరకూ అడ్వాన్స్ ట్రయల్ వరకూ చేరుకోలేదని, అందుకే వచ్చే ఏడాది మధ్యస్థానికి ముందుగానే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందనే ఆశాభావం కలగడం లేదన్నారు.

వ్యాక్సిన్ ట్రయల్స్‌లో మూడవ దశ సుదీర్ఘంగా ఉంటుందని, ఈ సమయంలో ఆ వ్యాక్సిన్ ఎంతవరకూ రక్షణ ఇస్తున్నదనే విషయం పరిశీలించాల్సివున్నదన్నారు.

అలాగే కరోనా నుంచి ఎంతవరకూ కాపాడగలదనే అంశాన్ని కూడా పరిశీలించాలన్నారు. ఇప్పటి వరకూ ఏ వ్యాక్సిన్ కూడా కనీసం 50 శాతం వరకైనా ప్రభావవంతంగా ఉన్నాయన్న స్పష్టమైన సంకేతాలు అందలేదన్నారు. ఇదిలావుండగా రష్యాలో హ్యూమన్ ట్రయల్స్ పూర్తిచేసుకుని, ఆగస్టులోనే వ్యాక్సిన్ బయటకు వచ్చింది. అయితే ఈ వ్యాక్సిన్ అందించే రక్షణపై పలువురు శాస్త్రవేత్తలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా అమెరికాకు చెందిన వైద్యవిభాగపు అధికారులు అక్టోబర్ చివరి నాటికి టీకా సిద్ధమవుతుందని తెలిపారు. నవంబరు 3న జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందుగా ఈ టీకా అందరికీ అందుబాటులోకి వస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "The coronavirus vaccine is not coming this year."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0