Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

The latest guidelines on school management

పాఠశాలల నిర్వహణపై తాజా మార్గదర్శకాలు.
The latest guidelines on school management


  • ఆంధ్రప్రదేశ్ లో  పాఠశాలలు పాక్షికంగా తెరిచిన క్రమంలో ఆరోగ్య పరంగా సమస్యలు  ఉన్న టీచర్లు ఇతర సిబ్బంది ఫ్రంట్ లైన్ పని కి దూ రంగా  ఉండాలని పాఠశాల విద్యాశాఖ  మార్గదర్శకాలు ఇచ్చింది. 
  • ఏపీ ప్రభుత్వమూ సెప్టెంబరు 21 నుంచి పాక్షికంగా స్కూళ్లు తెరిచింది.  పాఠశాలల్లో కార్యకలాపాల నిర్వహణ, పాఠశాలల నిర్వహణకు సంబంధించి విద్యాశాఖ కమిషనర్  బుధవారం మార్గదర్శకాలు ఇచ్చారు.  ఇందులో కొన్ని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి....
  • వయసు ఎక్కువ ఉన్న ఉద్యోగులు, టీచర్లు, గర్భిణులు, ఆరోగ్య సమస్యలు ఉన్న వారు ఫ్రంట్ లైన్ కార్యకలాపాల్లో పాల్గొనకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులతో నేరుగా కాంటాక్టు లేకుండా చూసుకోవాలి.
  • టీచర్లకు బయోమెట్రిక్  హాజరు వద్దు. ప్రత్యామ్నాయ మార్గం చూడాలి.  కాంటాక్టు లెస్ అటెండెన్సు తీసుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలి.
  • బోధన, బోధనేతర సిబ్బంది 50శాతం మంది హాజరు కావాలి.
  • పాఠశాలల్లో ఆరు అడుగుల దూరం  ఉండేలా చూసుకోవాలి. అందరూ మాస్కులు వినియోగించాలి.
  • పిల్లలు తరచు 40 నుంచి 6 0 సెకన్ల పాటు సబ్బుతో చేతులు శుభ్రం చేసుకునేలా చూడాలి.
  • ఆల్కహాల్ శానిటైజర్లు వినియోగించేలా  చూడాల్సి ఉంటుంది.
  • పిల్లల ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ  ఎవరికి  ఎలాంటి ఇబ్బంది వచ్చినా  తక్షణమే చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
  • తరగతి గదిలో ఆరడుగుల దూరం ఉండేలా బెంచీలు, డెస్కుల సిటింగ్ ఏర్పాటు చేయాలి
  • వాతావరణం సహకరిస్తే  టీచర్లకు -విద్యార్థులకు మధ్య సందేహాల నివృత్తికి బహిరంగ ప్రదేశాలు వినియోగించుకోవడమే మేలు.
  • ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేని టీచర్లు, సిబ్బంది, విద్యార్థులను మాత్రమే పాఠశాలలకు అనుమతించాల్సి ఉంటుంది.
  • విద్యార్థులు పెన్నులు, మంచినీళ్ల బాటిళ్లు ఇతర వస్తువులు ఒకరి నుంచి మరొకరు తీసుకోకుండా పర్యవేక్షించాలి.
  • పాఠశాలల్లో తరగతి గదులు, తలుపులు, కిటీకీలు ప్రతి రోజూ శుభ్రం చేయించాలి. కామన్  ఏరియాల్లో సబ్బులు, శానిటైజర్లు అందుబాటులో ఉండేలా చూడాలి.
  • పాఠశాలలు తెరవడానికి ముందు, తరగతులు పూర్తయిన తర్వాత ఇవన్నీ శుభ్రం చేయించాలి.
  • ఇందుకు అవసరమయ్యే నిధులను స్కూలు కాంపోజిట్ నిధుల నుంచి వినియోగించుకోవాలి.
  • టీచర్లు మాన్యువల్ పద్ధతిలో అటెండెన్సు నమోదు చేయాలి. విద్యార్థుల హాజరు కూడా నిర్ణీత నమూనాలో  తీసుకుని ప్రతి రోజు జిల్లా విద్యాధికారికి పంపాలి

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "The latest guidelines on school management"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0