Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Unlock 5.0 Guidelines: How is Alalock 5.0 ... which one will be given the green signal this time?

Unlock 5.0 Guidelines : అలాక్ 5.0 ఎలా ఉంటుంది ... ఈసారి వేటికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు ?

Unlock 5.0 Guidelines: ఇండియాలో సెప్టెంబర్‌లో అన్‌లాక్ 4.0 నడిచింది. సెప్టెంబర్ 30తో ఇది క్లోజ్ అవుతుంది. అక్టోబర్ 1 నుంచి అన్‌లాక్ 5.0 రాబోతోంది. అక్టోబర్ అంటే పూర్తిగా పండుగల మయం. కాబట్టి... ఈసారి మార్గదర్శకాల్లో మరిన్ని ఎక్కువ వెసులుబాట్లు ఉంటాయని అంతా భావిస్తున్నారు. ఇప్పటికే గైడ్‌లైన్స్ రెడీ చేసుకున్న కేంద్ర ప్రభుత్వం వాటిని ఇంకా రిలీజ్ చెయ్యలేదు. ఇవాళ లేదా రేపు వాటిని రిలీజ్ చేసే ఛాన్సుంది. ఈమధ్య సీఎంలతో జరిగిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో... మైక్రో కంటైన్‌మెంట్ జోన్ల ఏర్పాటుపై చర్చించారు. అంటే... కేసులు ఇప్పటికీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో లాక్‌డౌన్‌లు, కర్ఫ్యూలు అమలు చెయ్యాలని సూచించారు.
అందువల్ల అన్ లాక్ 5.0లో ఈ సూచనకు తగ్గట్టుగా మార్గదర్శకాలు ఉండే ఛాన్సుంది.

అక్టోబర్‌లో దసరా, దీపావళి పండుగలు ఉంటున్నాయి. ఆ తర్వాత క్రిస్మస్, న్యూఇయర్ సందడి మొదలవుతుంది. పండుగల్ని జరుపుకుంటూనే... కరోనా విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధాని మోదీ చాలాసార్లు చెప్పారు. అందువల్ల ప్రజల ఆర్థిక పరిస్థితి మెరుగవ్వడం కోసం... మరిన్ని వెసులుబాట్లను ఈసారి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.ప్రధానంగా అన్‌లాక్ 5.0లో థియేటర్లను తెరిచేందుకు అనుమతి ఇస్తారని తెలుస్తోంది. దాదాపు మూడు నెలలుగా ప్రతిసారీ ఈ డిమాండ్ వస్తూనే ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం వాయిదా వేస్తూ వస్తోంది. ఐతే... బెంగాల్ ప్రభుత్వం అక్టోబర్ 1 నుంచి థియేటర్లను తెరచుకోవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దాంతో... కేంద్ర ప్రభుత్వం కూడా అలాగే చేయనుందని తెలుస్తోంది. ఇప్పటికే దేశంలో బార్లు, క్లబ్బులు తెరచుకోవడం, బస్సులు, రైళ్లు తిరుగుతుండటం... అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు కూడా మొదలవ్వడం వల్ల... కేంద్రం ఇక మిగతా కండీషన్లను కూడా పక్కన పెట్టనున్నట్లు తెలుస్తోంది.
సినిమా హాళ్లకు అనుమతి ఇస్తే... ఒక లైన్ తర్వాత... మరో లైన్ పూర్తిగా ఖాళీగా ఉంచడం లేదా... సీటుకీ, సీటుకీ మధ్య ఖాళీ వదలడం లాంటి కండీషన్లు పెట్టనున్నట్లు తెలుస్తోంది. అలాంటి కండీషన్లతో అనుమతి ఇస్తే మాత్రం థియేటర్ల ఓనర్లకు ఇబ్బందే. ఎందుకంటే... హౌస్ ఫుల్ కాకుండా షో రన్ చేస్తే నష్టాలు తప్పవని వారు మొదటి నుంచి చెబుతున్నారు. అయినప్పటికీ... క్రమంగా కండీషన్లను తగ్గిస్తూ వెళ్తారనే ప్రచారం జరుగుతోంది.

ఇక ఈ సీజన్‌లో టూరిజం బాగా డెవలప్ అవుతుంది. అందువల్ల ఈసారి టూరిస్ట్ స్పాట్లకు పూర్తిగా అనుకూల నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తోంది. అందువల్ల పర్యాటక రంగం పుంజుకునే ఛాన్స్ కనిపిస్తుంది. ఇప్పటికే ఉత్తరాఖండ్ రాష్ట్రం... పర్యాటకులు హాయిగా వచ్చి... హ్యాపీగా పర్యాటక ప్రదేశాల్ని చూడొచ్చనీ, ఏ కండీషన్లూ ఉండవని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఇక ఆన్‌లైన్ క్లాసులు జరుగుతున్న విద్యా సంస్థలకు అక్టోబర్‌లో మరిన్ని సడలింపులు ఉండే ఛాన్స్ కనిపిస్తోంది. చాలా రాష్ట్రాల్లో కరోనా కేసులు బాగా తగ్గాయి. రికవరీలు బాగా పెరిగాయి. మరణాలు కూడా తగ్గాయి. అందువల్ల కేంద్రం ఓ అడుగు ముందుకు వేసే ఛాన్సుంది. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో 9 నుంచి ఇంటర్ వరకూ... క్లాసులు ప్రారంభమయ్యాయి. విద్యార్థులు స్కూళ్లు, కాలేజీలకు వెళ్తున్నారు. 8వ తరగతి లోపు విద్యార్థులకు మాత్రం ఆన్ లైన్‌లో క్లాసులు జరుగుతున్నాయి. అక్టోబర్‌లో కూడా ఈ తరగతులకు ఆన్ లైన్ లోనే క్లాసులు ఉంటాయని తెలుస్తోంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Unlock 5.0 Guidelines: How is Alalock 5.0 ... which one will be given the green signal this time?"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0