Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

A DA along with a November salary

నవంబరు జీతంతో పాటు ఒక డీఏ

A DA along with a November salary


  • ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రం అన్న సజ్జల
  • ముఖ్యమంత్రి సూచన మేరకే సమావేశాలు
  • ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చాలని గట్టిగా అడిగాం
  • కె ఆర్ సూర్యనారాయణ వెల్లడి

ఉద్యోగులకు అంత ఆశాజనకమైన సమాచారం ఏమీ లేదు. ప్రభుత్వం ప్రస్తుతానికి ఒక్క  డీ ఏ మాత్రమే ఇవ్వడానికి సిద్ధంగా  ఉందని చెప్పింది.

నవంబరు నెల జీతంతో పాటు డిసెంబర్లో ఒక డీ ఏ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కె.ఆర్. సూర్యనారాయణ ‘ ఉద్యోగులు న్యూస్’కు చెప్పారు. ముఖ్యమంత్రి సూచన మేరకు సజ్జల రామకృష్ణారెడ్డి ఉద్యోగ సంఘ నాయకులతో విడివిడిగా సమావేశమయ్యారు. కె.ఆర్.సూర్యనారాయణతోను విడిగా మాట్లాడారు. ప్రధానంగా రాష్ర్ట ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉందని ఈ సమావేశంలో ఆయన నేతలకు వివరించేందుకు ప్రయత్నించారు. ముఖ్యమంత్రి ఆదేశం మేరకే తాను ఉద్యోగ సంఘ నాయకులతో మాట్లాడుతున్నట్టు చెప్పారు . వీటిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చాల్సిందేనని డిమాండ్ చేసినట్లు సూర్యనారాయణ చెప్పారు. ఆయన డిమాండ్లు  ఇవి...

డిమాండ్లు

  • రెండు డీఏలు కచ్చితంగా ప్రకటించాల్సిందే
  • పీ ఆర్ సీ తక్షణమే అమలుచేయకపోతే ఉద్యోగుల్లో అసంతృప్తి పెరిగిపోతుంది, వెంటనే అమలుకు ప్రయత్నించాలి
  •  రిటైరైన ఉద్యోగుల బకాయిలు తక్షణమే అమలు చేయాలి
  •  కోవిడ్ వల్ల నిలిపివేసిన సగం జీతాలు తక్షణమే ఇవ్వాలి
  • సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ తక్షణమే అమలు చేయాలి.

ముఖ్యమంత్రి జగన్ తో తమ సంఘానికి విడిగా అపాయింట్ మెంట్ ఇప్పించాలని కూడా కె.ఆర్.సూర్యనారాయణ విన్నవించారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "A DA along with a November salary"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0