Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

AP Governor calls for safe water for every student.

ప్రతి విద్యార్థికి సురక్షిత నీరు ఏపీ గవర్నర్ పిలుపు.

AP Governor calls for safe water for every student.

జల జీవన్ మిషన్ సద్వినియోగం చేసుకోండి ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పిలుపు.

 జల జీవన్ మిషనను సద్విని యోగం చేసుకొని చిన్నారులకు సురక్షిత నీరు అందేలా చూడాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పిలుపిచ్చారు . రాష్ట్రంలోని పాఠశాలలు , అంగన్‌వాడీ కేంద్రాల పిల్లలకు రక్షిత నీటిని అందించేందుకు ఉద్దేశించిన జల జీవన్ మిషన్ ప్రాధాన్యతను ప్రతి ఒక్కరూ గుర్తించాలని పేర్కొన్నారు . జలజీవన్ మిషన్ 100 రోజుల కార్యక్రమంలో భాగంగా సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని , సంబంధిత విభాగాల కార్యదర్శులతో గవర్నర్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు . కరోనా నేపధ్యంలో రాజ్ భవన్ నుంచి ఆన్ లైన్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధికారులు సచివాలయం నుంచి పాల్గొ న్నారు . సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్ మాట్లా డుతూ కలుషిత నీటి వలన పిల్లలు టైఫాయిడ్ , విరేచనాలు , కలరా వంటి వ్యాధుల బారినపడే అవకాశం ఉందన్నారు . దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు , కేంద్ర పాలిత ప్రాంతాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రధానిజల జీవన్ మిషన్ ప్రారంభించినట్లు పేర్కొన్నారు . ఈ పథకం చిన్నారుల ఆరోగ్యాన్ని మెరుగు పరడమే కాకు సంపూర్ణ వికాసానికి దోహదపడుతుందని చెప్పారు . కార్యక్రమ విజయవంతానికి కాల పరిమితితో కూడిన కార్యాచరణ రూపొం దించి ప్రచారం చేయాలన్నారు . గ్రామ పంచాయితీలు , జల , పారిశుద్ధ్య కమిటీలు , స్వచ్ఛంద సంస్థలు , స్వయం సహాయ కబృందాల సహకారంతో అన్ని పాఠశాలలు , అంగన్ వాడీ కేంద్రాల్లో 100 రోజుల కార్యక్రమం అమలు చేయాలని ఆదేశించారు . పాఠశాలలు , అంగన్వాడీ , పంచాయితీ భవనాలకు పైపులైన్ ద్వారా రక్షిత నీటిని అందించేందుకు స్పష్టమైన ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని తెలిపారు . పంచాయితీ రాజ్ , గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది , విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ , మహిళాభిృద్ధి , శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎఆర్ అనురాధ తది తరులు తమ తమ శాఖల పరిధిలో 100 రోజుల కార్య క్రమాన్ని విజయవంతం చేసేందుకు చేపట్టిన కార్యక్ర మాలను వివరించారు . కార్యక్రమానికి ముందు గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా జల జీవన్ మిషన్ ద్వారా పాఠశాలలు , అంగన్‌వాడీ కేంద్రాలకు పైపు లైను నీటిని అందించేందుకు నిర్దేశించిన 100 రోజుల కార్యక్రమం లక్ష్యాలను సమావేశం దృష్టికి తీసుకొచ్చారు . 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "AP Governor calls for safe water for every student."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0