Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

AP Teachers Transfers

టీచర్ల బదిలీలకు గ్రీన్ సిగ్నల్

AP Teachers Transfers


నేడో, రేపో మార్గదర్శకాలు

ఒకే స్కూల్ లో రెండేళ్లు పూర్తి చేస్తే దరఖాస్తుకు అర్హులు

నెలాఖరుకు ప్రక్రియ పూర్తి

  • ఉపాధ్యాయుల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందుకు సంబంధించిన మార్గదర్శకాలు సోమ, మంగళవారాల్లో విడుదల కానున్నాయి.
  • ఈ ఏడాది ఫిబ్రవరి 29 నాటికి ఒకే పాఠశాలలో రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులంతా బదిలీకి దరఖాస్తు చేసుకొనేందుకు అర్హులేనని ప్రభుత్వం ప్రకటించింది.
  • అదేవిధంగా ఒకే పాఠశాలలో ఐదు సంవత్సరాలు పూర్తిచేసిన గ్రేడ్-2 ప్రధానోపాధ్యాయులు, 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సెకండరీ గ్రేడ్ టీచర్లు, స్కూలు అసిస్టెంట్లు తప్పనిసరిగా బదిలీకావాల్సిందే.
  • వీటిని ఆన్లైన్ వెబ్ కౌన్సెలింగ్ విధానంలో నిర్వహిస్తారు. అన్నికేటగిరీల్లోని పాఠశాలల్లో ఖాళీలు సమానంగా ఉండేలా చర్యలు తీసుకుంటారు.
  • ప్రతి స్కూల్ లోనూ కనీస సంఖ్యలో ఉపాధ్యాయులు ఉండేలా టీచర్ పోస్టులను సర్దుబాటు చేస్తారు.
  • ప్రాథమిక, ఉన్నత పాఠశాలలకు ప్రాధాన్యం ఉపాధ్యాయుల కేటాయింపు, బదిలీల్లో ప్రాథమిక, ఉన్నత పాఠశాలలకే ప్రాధాన్యం ఇస్తున్నారు.
  • విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రతి స్కూల్లో ఇద్దరు ఉపాధ్యాయులను నియమించనున్నారు.
  • పునర్విభజనలో తక్కువ మంది పిల్లలున్న యూపీ పాఠశాలల్లోని స్కూలు అసిస్టెంట్లను హైస్కూళ్లకు పంపి, వారి స్థానాల్లో సెంకడరీ గ్రేడ్ టీచర్లను నియమించే ఆలోచన చేస్తున్నారు.
  • కొత్తగా అప్ గ్రేడ్ ఆయిన అన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలకు ప్రతి సబ్జెక్టుకు కనీసం ఒక టీచర్ చొప్పున నియమించనున్నారు.
  • ప్రాథమిక పాఠశాలల్లో ప్రతి 30 మందికి ఒక SGTని నియమిస్తారు.
  • 60 మందికి ఇద్దరు, 61నుంచి 90 మంది వరకూ ముగ్గురు,అక్కడి నుంచి 120 వరకూ నలుగురు,
  • 121 నుంచి 150 వరకూ ఐదుగురు, 151 నుంచి 200 మంది వరకూ ఐదుగురు SGT లు, ఒక LFL హెచ్ఎంను నియమిస్తారు. 
  • 150 మందిలోపు విద్యార్థులు ఉన్న పాఠశాలల్లో పనిచేస్తున్న LFL హెచ్ఎంలను SGT లుగానే పరిగణిస్తారు.
  • హైస్కూళ్ళలో 240 మంది వరకూ సబ్జెక్టుకు ఒకరు చొప్పున హెచ్ఎంతోపాటు ఎనిమిది మందిని మాత్రమే నియమిస్తారు.
  • టీచర్ల బదిలీల ప్రక్రియను ఈనెలాఖరుకు పూర్తి చేసే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "AP Teachers Transfers "

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0