Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

AP: YSSAR insurance start .. Application, eligibility details

 ఏపీ: వైఎస్సార్ బీమా ప్రారంభం.. దరఖాస్తు, అర్హత వివరాలు ఇవే

AP: YSSAR insurance start .. Application, eligibility details


రాష్ట్రవ్యాప్తంగా పేదలకు లబ్ది చేకూరేలా బియ్యం కార్డు ఉండి కుటుంబం ఆధార పడ్డ వ్యక్తికి ఏదైనా ప్రమాదం జరిగితే ఆదుకునేందుకు వైఎస్సార్‌ బీమా పథకానికి శ్రీకారం చుట్టింది.. దీనిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ఉదయం క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు.

రాష్ట్రంలో 1.41 కోట్ల బియ్యం కార్డు ఉన్న కుటుంబాలకు ప్రయోజనం కల్పించే ఈ పథకం కోసం ప్రభుత్వం ఏడాదికి రూ.583.50 కోట్లు ఖర్చు చేయనుంది.

అర్హతలు

18 నుంచి 70 ఏళ్లలోపు వయసు ఉండి కుటుంబాన్ని పోషించే వారికి ఈ పథకం వర్తిస్తుంది. 18 నుంచి 50 ఏళ్ల వయసున్న లబ్ధిదారులు సహజ మరణం పొందితే రూ.2 లక్షలు.. ప్రమాదవశాత్తూ మరణించినా, పూర్తి అంగవైకల్యం పొందినా.. రూ.5 లక్షల బీమా పరిహారం నామినీకి ఇస్తారు. 51 నుంచి 70 ఏళ్లలోపు వయసున్న లబ్ధిదారులు ప్రమాదవశాత్తు మరణించినా, శాశ్వత అంగవైకల్యం పొందినా నామినీకి రూ.3లక్షల పరిహారం అందిస్తారు. 18-70 ఏళ్లలోపు వయసున్న లబ్ధిదారులు ప్రమాదవశాత్తూ పాక్షిక, శాశ్వత అంగవైకల్యం పొందితే రూ.1.50 లక్షల బీమా పరిహారం అందుతుంది.

ఎంపిక విధానం

ఈ పథకం కోసం వాలంటీర్ల డోర్ టూ డోర్ సర్వే ద్వారా ఎంపిక చేస్తారు. రైస్ కార్డు కలిగి ఉండాలి (రైస్ కార్డుకు ఉండే అర్హతలు దీనికి వర్తిస్తాయి). సచివాలయం పరిధిలో సంక్షేమ కార్యదర్శి పర్యవేక్షిస్తారు. ఏదైనా జాతీయ బ్యాంకులో సేవింగ్స్ ఖాతా.. అది లేని పక్షంలో జన ధన్ ఖాతా తెరవాలి.. అప్పుడే నామినీ పేరును సూచించాలి. ఏడాదికి ప్రీమియం రూ.15/- వ్యక్తులు చెల్లించాలి. సచివాలయాలు బీమా నమోదుకు, బీమా ప్రాసెసింగ్, క్లెయిమ్ చెల్లింపుకు facilitation సెంటర్లగా ఉంటాయి. వయస్సుకు ప్రామాణిక నిర్ధారణ పత్రంగా ఆధార్ కార్డును తీసుకుంటారు.

నామినీలుగా భార్య, 21 ఏళ్లు నిండిన కొడుకు, పెళ్లి కాని కూతురు, వితంతువు అయిన కూతురు. ఒకవేళ Benificiarతో ఉంటే..Benificiary మీద ఆధార పడిన తల్లిదండ్రులు.. వితంతువు అయిన కోడలు లేదా ఆమె పిల్లలు తప్ప ఇంక ఎవరిని నామినీ గా పెట్టకూడదు. Benificiaryకి ఐడెంటిటీ కార్డు ఇస్తారు. అందులో విశిష్ట గుర్తింపు సంఖ్య (Unique Id), పాలసీ నెం. ఉంటాయి. క్లెయిమ్ ఇంటిమేట్ చేసిన 15 రోజుల లోపల బీమా చెల్లించాలి. SERP క్రింద ఉండే జిల్లా సమాఖ్య లు క్లెయిమ్‌ని ప్రొసెస్ చేస్తాయి. క్లెయిమ్ అమౌంట్ నేరుగా వాళ్ళ బ్యాంకు అకౌంట్‌లో వేస్తారు.. చేతికి ఇవ్వరు. బీమా Enrollment విషయంలో లేదా క్లెయిమ్ చెల్లింపు విషయంలో ఏమైనా ఫిర్యాదులు ఉంటే PD DRDAని సంప్రదించాలి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "AP: YSSAR insurance start .. Application, eligibility details"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0