Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

APS: Army Public School - Announcement for 8000 Teacher Jobs.

APS: Army Public School - Announcement for 8000 Teacher Jobs.

APS: Army Public School - Announcement for 8000 Teacher Jobs.

8000 టీచర్‌‌ ఉద్యోగాలకు ప్రకటన విడుదల.. దరఖాస్తు చేసుకోండి..!
దేశవ్యాప్తంగా 137 ఆర్మీ ప‌బ్లిక్ స్కూల్స్‌లో 8000 టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి ప్ర‌క‌ట‌న విడుద‌లైంది.
దేశ‌వ్యాప్తంగా కంటోన్మెంట్లు, మిల‌ట‌రీ స్టేష‌న్ల‌లో ఉన్న 137 ఆర్మీ ప‌బ్లిక్ స్కూల్స్‌లో 8000 టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి నిర్వ‌హించే ఉమ్మ‌డి నియామ‌క ప్రాథ‌మిక ప‌రీక్షా (ఆన్‌లైన్‌ స్క్రీనింగ్ టెస్ట్ 2020) ప్ర‌క‌ట‌న విడుద‌లైంది. ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేష‌న్ సొసైటీ ఈ ప‌రీక్ష నిర్వ‌హిస్తోంది. వీటిలో టీజీటీ, పీజీటీ, పీఆర్‌టీ పోస్టులున్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అక్టోబర్‌ 20 దరఖాస్తుకు చివరితేది. నవంబర్‌ 21, 22 తేదీల్లో ఈ పోస్టులకు సంబంధించి స్క్రీనింగ్‌ టెస్ట్‌ ఉంటుంది. అభ్యర్థులు పూర్తి వివరాలకు http://aps-csb.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.
గమనిక: ఈ ప‌రీక్ష‌లో ఉత్తీర్ణులైన‌వారు సంబంధిత పాఠ‌శాలలు విడుద‌ల చేసే ప్ర‌క‌ట‌న‌ను అనుస‌రించి మ‌ళ్లీ ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆయా పాఠ‌శాల‌లు త‌దుప‌రి నియామ‌క ప్ర‌క్రియ (ఇంటర్వ్యూ, బోధనా నైపుణ్యాల పరిశీలన, కంప్యూట‌ర్ ప్రొఫిషియ‌న్సీ) ద్వారా ఖాళీల‌ను భ‌ర్తీ చేస్తాయి. సాధారణంగా నవంబరు- మార్చి మధ్యలో ప్రకటనలు విడుదలయ్యే అవకాశం ఉంది.
ముఖ్య సమాచారం:
మొత్తం ఖాళీలు: దాదాపు 8000
పోస్టులు: టీజీటీ, పీజీటీ, పీఆర్‌టీ
అర్హ‌త‌: స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో డిగ్రీ, పీజీతోపాటు బీఈడీ/ రెండేళ్ల డిప్లొమా ఉత్తీర్ణ‌త‌. సీటెట్/ ఆయా రాష్ట్రాల టెట్‌లో అర్హ‌త సాధించి ఉండాలి.
వ‌య‌సు: 40 ఏళ్లు మించ‌కూడ‌దు. ఐదేళ్ల టీచింగ్ అనుభ‌వం ఉన్న‌వారికి గ‌రిష్ఠ వ‌యఃప‌రిమితి 57 ఏళ్లు.
స్క్రీనింగ్ ప‌రీక్ష తేది: న‌వంబ‌రు 21, 22 తేదీల్లో ఉంటుంది.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: విజయవాడ, హైదరాబాద్, సికింద్రాబాద్.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.500
దరఖాస్తుకు చివరితేది: 20.10.2020
వెబ్‌సైట్‌: http://aps-csb.in/

 NOTIFICATION

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

1 Response to "APS: Army Public School - Announcement for 8000 Teacher Jobs."

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0