Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Are you shopping at the festive sale ...

 పండగ సేల్‌లో షాపింగ్ చేస్తున్నారా...

Are you shopping at the festive sale ...

డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌, ఈఎమ్ఐ స‌దుపాయం వంటి వాటిపై పూర్తి అవ‌గాహ‌న ఉంటే డ‌బ్బు ఆదా చేసుకోవ‌చ్చు.

పండుగ సీజన్ ప్రారంభమైంది. ఆన్‌లైన్‌ పోర్టల్ అమ్మకాలు జోరందుకున్నాయి. ప్రస్తుత పరిస్థితులలో సామాజిక దూరం పాటించడం తప్పనిసరి కావడంతో చాలా మంది ఆన్లైన్ షాపింగ్ వైపు మగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలు ఇప్పటికే పండుగ అమ్మకాలను ప్రకటించాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ అక్టోబరు 17 నుంచి ప్రారంభమవుతుండగా, మరో ఈ-కామర్స్ సంస్థ ఫ్లిఫ్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అక్టోబ‌రు 16 నుంచి ప్రారంభమై 21తో ముగియనుంది. ఈ సేల్‌లో తక్షణ రాయితీలతో పాటు క్యాష్‌బ్యాక్ ఆఫర్లను సంస్థలు ప్రకటించాయి. అయితే ఆన్‌లైన్‌లో ఉన్న అన్ని ఆఫర్లు మీకు ఉపయోగకరం కాకపోవచ్చు. ఏదైనా కొనుగోలు చేసే ముందు కొన్ని అంశాల‌ను విశ్లేషించాలి. ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసే ముందు ఈ కింది వాటిని గుర్తించుకోండి

ధర తగ్గింపు:

సాధారణంగా ఇటువంటి సేల్లో సంస్థలు భారీ తగ్గింపులను ప్రకటిస్తుంటాయి. ఒక్కోసారి 80 శాతం వరకు డిస్కౌంటును ప్రకటించడం మనం చూస్తుటాం. అయితే సేల్‌లో ఉన్న అన్ని వస్తువుపై ఈ డిస్కౌంట్‌ వర్తించక‌పోవ‌చ్చు. " ప్రచారం ద్వారా, తమ వెబ్‌సైట్‌కి ఎక్కువమందిని ఆకర్షించేందుకు కొన్నింటిపై మాత్రమే ఇటువంటి భారీ డిస్కౌంట్లు‌ అందుబాటులో ఉంటాయి. ఇతర ఉత్పత్తులపై అంత డిస్కౌంట్ వర్తించకపోవచ్చు." అని ప్రముఖ క్యాష్‌బ్యాక్ సైట్ క్యాష్‌క‌రో.కామ్ సహా వ్యవస్థాపకులు స్వాతి భార్గవ తెలిపారు

"సాధారణంగా, దుస్తులు వంటి ఫ్యాషన్ ఉత్పత్తులపై 70 నుంచి 80 శాతం డిస్కౌంట్ ఉంటుంది. పాత స్టాక్, నాణ్యత లోపం ఉన్న వాటిని విక్రయించే సమయంలో ఈ స్థాయిలో భారీ డిస్కౌంటు ఇచ్చే అవకాశం ఉంటుందని స్వాతి భార్గవ తెలిపారు. ఎలక్ట్రానిక్ వస్తువల విషయంలో కూడా పాత మోడళ్ళపై డిస్కౌంట్ ఎక్కువగా ఉంటుంది.

చెక్ చేయండి:

భారీ డిస్కౌంట్లలో కొనుగోలు చేసే ముందు, మీరు అనుకున్న వస్తువు మోడల్ అందుబాటులో ఉందో లేదో చూడండి. ఆ వస్తువు మోడల్ ఆధారంగా దాని అసలు ధర తెలుసుకోవాలి. ఇందుకోసం పలు రకాల వెబ్‌సైట్ల‌ను పరిశీలించి, ధరలను పోల్చి చూడండి. ఈ విధంగా చేయడం ద్వారా మీరు కొనుగోలు చేయాలనుకునే వస్తువుపై నిజంగా రాయితి పొందుతున్నారో లేదో తెలుస్తుందని స్వాతి భార్గవ అన్నారు

నో-కాస్ట్ EMI:

ఈ కామర్స్ సంస్థలు, సాధారణంగా అధిక ధర గల మొబైల్ ఫోన్లు, ఎక్కువ మన్నికగల వస్తులపై నో-కాస్ట్ ఈఎమ్ఐ సదుపాయాన్ని అందిస్తాయి. 

ఈ పథకం కింద మనం ఒక వస్తువు కొనుగోలు చేసినప్పుడు, దాని మొత్తం ధరను ఏకమొత్తంగా చెల్లించనవసరం లేదు. ఎంచుకున్న కాలానికి సమాన వాయిదాలలో నెలవారీగా చెల్లించవచ్చు. 

ఈ స‌దుపాయం నగదు నిర్వహణకి సహాయపడుతుంది. అయితే ఈఎమ్ఐల వ‌ల్ల ఖ‌ర్చు పెరుగుతుందా అంటే అద‌న‌పు ఛార్జీల కార‌ణంగా వ్య‌యం పెరుగుతుంది. ఈఎమ్‌ల‌పై వ‌ర్తించే వ‌డ్డీ, ప్రాసెసింగ్ ఛార్జీల గురించి ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న లేక‌పోవ‌డం ఇందుకు కార‌ణ‌మ‌ని ఆన్‌లైన్ ఫైనాన్షియ‌ల్ స‌ర్వీస్ సంస్థ -“మైమ‌నీమంత్ర‌.కామ్” మేనేజింగ్ డైరెక్ట‌ర్ రాజ్ ఖోస్లా తెలిపారు.

నో-కాస్ట్ ఈఎమ్ఐ సాధారణంగా రెండు విధాలుగా పనిచేస్తుంది. మొదటి విధానంలో తయారీదారులు బ్యాంకు\నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలు(ఎన్బీఎఫ్సీ)కి వడ్డీని చెల్లిస్తారు. ఇందుకోసం వస్తువుపై ఇచ్చే అదనపు రాయితీని రద్దు చేస్తారు. ఇక రెండో విధానంలో, వడ్డీ వ్యయాన్ని వస్తువు తయారీ ఖర్చులకు జోడిస్తారు. అంటే నిజానికి నో-కాస్ట్ ఈఎమ్ఐ విధానంలో కూడా అదనపు మొత్తం చెల్లించాలి. అయితే ఇది కొనుగోలుదారులు గ్రహించలేరు.

ఇలా చెక్ చేయండి: వ‌స్తువును నో-కాస్ట్ ఈఎమ్ఐలో కొనుగోలు చేస్తున్న‌ప్పుడు ఆ వ‌స్తువు ధ‌ర‌ను ఇత‌ర వెబ్‌సైట్ల‌తో పోల్చి చూడండి.

క్యాష్‌బ్యాక్‌‌:

కొనుగోలుదారుల‌ను ఆక‌ర్షించేందుకు ఆన్‌లైన్ షాపింగ్ వైబ్‌సైట్‌లు ఉప‌యోగించే మ‌రొక విధానం క్యాష్‌బ్యాక్‌. ఇది అత్య‌తం ప్ర‌జాధ‌ర‌ణ పొందింది. ఈ విధానంలో కొనుగోలు ఖ‌ర్చులో, ఎంతో కొంత శాతాన్ని తిరిగి వినియోగ‌దారునికి చెల్లిస్తారు. 

సాధార‌ణంగా క్యాష్‌బ్యాక్ ఆఫ‌ర్ చేసే ఆన్‌లైన్ పోర్ట‌ల్స్‌ కొన్ని నియ‌మ నిబంధ‌న‌ల‌ను విధిస్తాయి. క్యాష్‌బ్యాక్ వ‌ర్తించాలంటే క‌నీస మొత్తంతో కొనుగోలు చేయాల‌ని ఉంటుంది. అదేవిధంగా ల‌భించే మొత్తంపై గ‌రిష్ట ప‌రిమితి ఉంటుంది. ఉదాహ‌ర‌ణ‌కి, ఒక వ‌స్త‌వుపై 20శాతం క్యాష్‌బ్యాక్ ఇస్తున్న‌ప్ప‌టికీ గ‌రిష్టంగా రూ.1000 వ‌ర‌కు మాత్ర‌మే క్యాష్ బ్యాక్ ల‌భిస్తుంద‌నే నిబంధ‌న ఉంటుంది. అందువ‌ల్ల క్యాష్‌బ్యాక్ ఆఫ‌ర్ ఉన్న వ‌స్తువును కొనుగోలు చేసేప్పుడు నియ‌మ, నిబంధ‌న‌లు జాగ్ర‌త్త‌గా చ‌దివి తెలుసుకోవాలి.

చివ‌రిగా:

కోవిడ్‌-19 నేప‌థ్యంలో చాలా మంది ఉద్యోగాల‌లో అనిశ్చితి నెల‌కుంది. కొంత‌మంది వేత‌న కోత‌ల‌తో ఇబ్బంది ప‌డుతూ ఆర్థికంగా ఒత్తిడికి లోన‌వుతున్నారు. ఈ స‌మ‌యంలో అధిక వ్యయాల గురించి జాగ్ర‌త్త వ‌హించ‌డం చాలా ముఖ్యం. అందువ‌ల్ల కొనుగోలు చేసే ముందు, మీకు అవ‌స‌ర‌మైన వ‌స్తువుల జాబితాను త‌యారు చేసుకోవాలి. వాటిపై ల‌భించే డిస్కౌంట్లు ఆఫ‌ర్ల‌ను ప‌రిశీలించి కొనుగోలు చేయండి. మీరు త‌యారు చేసుకున్న జాబితాలోని వ‌స్తువుల‌ను మాత్ర‌మే కొనుగోలు చేసేందుకు ప్ర‌య‌త్నించండి. అధికంగా చేసే ఖ‌ర్చులు ఆర్థికంగా ఒత్తిడికి గురిచేస్తాయ‌ని గుర్తించుకోవాలి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Are you shopping at the festive sale ..."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0