Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Central Govt Jobs 2020: Modi government's sensational decision ... Central government jobs without interviews

 Central Govt Jobs 2020: మోదీ సర్కార్ సంచలన నిర్ణయం... ఇంటర్వ్యూ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.

Central Govt Jobs 2020: Modi government's sensational decision ... Central government jobs without interviews


Central Govt Jobs 2020 నిరుద్యోగులకు అతిపెద్ద శుభవార్త చెప్పింది మోదీ ప్రభుత్వం. కొన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలను రద్దు చేసింది. దేశంలోని 23 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ నిర్ణయం వర్తించనుంది.

1. నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కలిగించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో గ్రూప్ బీ (నాన్ గెజిటెడ్), గ్రూప్ సీ పోస్టులకు ఇంటర్వ్యూను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. 

2. దేశంలో ఉన్న 28 రాష్ట్రాల్లో 23 రాష్ట్రాలకు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ నిర్ణయం వర్తిస్తుంది. ఇటీవల కొత్తగా ఏర్పడ్డ జమ్మూ, కాశ్మీర్, లడఖ్ ప్రాంతాలకు కూడా ఇది వర్తిస్తుంది.

3. ఐదేళ్ల క్రితం 2015 ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి ఇచ్చిన హామీ ఇది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్-DoPT చేపట్టిన అతిపెద్ద సంస్కరణల్లో ఇది కూడా ఒకటి అని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు. 

4. ఇంటర్వ్యూ కాల్ వచ్చినప్పటి నుంచి అభ్యర్థితో పాటు అతని కుటుంబం ఆందోళన, భయంతో ఉంటారని అందుకే ఇంటర్వ్యూలు రద్దు చేసి కేవలం రాతపరీక్ష ద్వారానే ఉద్యోగాలకు ఎంపిక చేయాలని 2015 లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచించినట్టు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు.

5. ఇంటర్వ్యూ లేకుండా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించేందుకు కసరత్తు చేసిన మోదీ ప్రభుత్వం మొత్తానికి ఆ నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ నిర్ణయం 2016 జనవరి 1 నుంచి అమలులో ఉంటుందని ప్రకటించింది. 

6. ఇంటర్వ్యూ లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వాలన్న నిర్ణయాన్ని వెంటనే అమలు చేసేందుకు మహారాష్ట్ర, గుజరాత్ లాంటి రాష్ట్రాలు ఆసక్తి చూపించగా ఇంకొన్ని రాష్ట్రాలు అయిష్టత వ్యక్తం చేశాయి. 

7. రాష్ట్రాలను ఒప్పించడానికి ఇన్నాళ్లూ జాప్యం జరిగింది. ఈ నిర్ణయం 23 రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమల్లోకి రానుంది. ఈ నిర్ణయం వల్ల ఇంటర్వ్యూల్లో మార్కులపై వస్తున్న ఆరోపణలకు కూడా తెరపడ్డట్టేనని డీఓపీటీ వెల్లడించింది. 

8. రాత పరీక్షల్లో బాగా మార్కులు వచ్చినా ఇంటర్వ్యూల్లో మార్కులు తగ్గించారంటూ గతంలో అనేక మంది అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. డబ్బులు తీసుకొని ఇంటర్వ్యూల్లో మార్కులను తారుమారు చేస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. 

9. ఇప్పుడు ఇంటర్వ్యూలు రద్దు చేయడంతో రాతపరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారు చేస్తారని, దీంతో అందరికీ సమాన అవకాశాలు వస్తాయని డీఓపీటీ అధికారులు తెలిపారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Central Govt Jobs 2020: Modi government's sensational decision ... Central government jobs without interviews"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0