Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Children cannot be sent even if educational institutions are open

విద్యాసంస్థలను తెరిచినా పిల్లలను పంపలేం

Children cannot be sent even if educational institutions are open


  • తల్లిదండ్రుల్లో 83 శాతం నిశ్చితాభిప్రాయం 
  •  వెళ్లేందుకు పిల్లల్లోనూ 67 శాతం విముఖత
  •   విద్యాసంస్థలను తెరవడం సమంజసం కాదు తల్లిదండ్రుల్లో 79 శాతం మంది మాట ఇదే 
  •  కరోనా రూల్స్ పాటిస్తారనే నమ్మకం లేదని స్పష్టం 
  • ఆన్ లైన్ క్లాసులతో ప్రయోజనం లేదనీ పెదవి విరుపు 
  • ఆంధ్రజ్యోతి వెబ్ సైట్ లో ఆన్ లైన్ సర్వే  


కంప్యూటర్ తెర మీద ఉపా ధ్యాయుల బోధన ... ఎదురుగా కూర్చుని వింటూ నోట్సు రాసుకునే విద్యా రులు ! ఈ పరిస్థితి రాష్ట్రంలో ఇంకెన్నాళ్లు కొనసాగనుంది . ఇప్పటికే విద్యా సంవత్సరంలో దాదాపు ఐదు నెలల కాలం గడిచిపోయింది . ' ఆన్లైన్ క్లాసులు ' జరుగుతున్నా కూడా బోధన పరంగా విద్యార్ధులు ఎంతో విలువైన కాలాన్ని నష్టపోయారు . విద్యాసంస్థలను ఎప్పుడు తెరవాలనే విషయంలో  ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకో లేదు . ఒకవేళ ఇప్పటికప్పుడు పాఠశాలలు , కళాశాలలు తెరు చుకుంటే తమ పిల్లలను పంపేందుకు తల్లిదండ్రులు సిద్ధంగా ఉన్నారా ? బడులు , కాలేజీల్లో కరోనా వ్యాప్తి నియంత్రణ పరంగా నిర్దేశం చిన నిబంధనలను పక్కాగా పాటిస్తారని తల్లిదండ్రులు నమ్ముతున్నారా ? అసలు బడులు , కాలేజీలకు వెళ్లే విషయంలో పిల్లలు ఏమనుకుంటున్నారు ? ఈ విషయాలపై ' ఆంధ్రజ్యోతి ' వెబ్ సైట్లో ఆన్లైన్ సర్వేను నిర్వహించారు .

 సర్వే ఫలితాలు 

  •  కొవిడ్ -19 సెకండ్ వేవ్ వార్తల నేపథ్యంలో ప్రస్తుతం విద్యా సంస్థలను పునఃప్రారంభించడం సమంజసం కాదని తల్లిదండ్రుల్లో 79 శాతం తేల్చి చెప్పారు .
  •  అయితే తమ పిల్లలకు నష్టం జరుగుతోందని , విద్యా సంస్థ లను పునఃప్రారంభించక తప్పదని 20 శాతం అభిప్రాయపడ్డారు . 
  • ఒకవేళ బడులు , కళాశాలలు తెరుచుకుంటే అక్కడ కరోనా వ్యాప్తి నివా రణ పరంగా జాగ్రత్తలు తీసుకుంటారని తాము భావించడం లేదని తల్లిదండ్రుల్లో 85 శాతం అభిప్రాయపడ్డారు . 
  • నిబంధనలు పాటిస్తారని నమ్ముతున్నామని 14 శాతం పేర్కొన్నారు 
  • విద్యాసంస్థలను పునఃప్రారంభమైతే వెళ్లాలని పిల్లలు భావిస్తున్నారా ? అన్న ప్రశ్నకు తల్లిదండ్రుల్లో 67 శాతం లేదు అని స్పష్టం చేశారు . 
  • పిల్లలు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని 32 శాతం పేర్కొన్నారు .
  •  విద్యాసంస్థలను తెరిచినా కూడా పిల్లలను పంపేందుకు సిద్ధంగా లేమని తల్లిదండ్రుల్లో 83 శాతం స్పష్టం చేశారు .
  •  16 శాతం మాత్రం పంపుతామని చెప్పారు . 
  • ఆన్లైన్ విద్యా విధానం పట్ల ప్రయోజనం ఉందా ? అన్న ప్రశ్నకు కొంత వరకు పర్వాలేదు ' అని తల్లిదండ్రుల్లో 70 శాతం మంది చెప్పారు ఆస్సలు ఉపయోగం లేదు ' అని 21 శాతం మంది పేర్కొన్నారు . 
  • ప్రయో జనం ఎంతో ఉంది " అని 6 శాతమే చెప్పడం గమనార్హం .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Children cannot be sent even if educational institutions are open"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0