Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

CIPET Recruitment 2020 :

రూ35 వేల వేతనంతో ఉద్యోగాలు పూర్తి వివరాలు

CIPET Recruitment 2020 :

కరోనా వేళ అనేక మంది ఉద్యోగాలు కోల్పోయి.. మరి కొంత మంది కొత్త నోటిఫికేషన్లు రాక ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారికి CIPET(Central Institute of Petrochemicals Engineering and Technology) శుభవార్త చెప్పింది. త్వరలో నియామకాలు చేపట్టనున్నట్లు ప్రకటించింది. రూ. 35 వేల వరకు వేతనంతో 22 మందిని కాంట్రాక్టు పద్ధతిలో నియమించనున్నట్లు తెలిపింది. స్కిల్ డవలప్మెంట్ ఇన్ స్ట్రక్టర్, కన్సల్టెంట్ ట్రైనీ, అసిస్టెంట్ ప్లేస్మెంట్ ఆఫీసర్ స్థానాల కోసం ఈ నియామకం చేపట్టనున్నారు. ఎంపికైన అభ్యర్థులు సెంట్రల్ ఇనిస్ట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. సంస్థ అధికారిక వెబ్ సైట్ లో రెండు వేర్వేరు నోటిఫికేషన్లు విడుదల చేశారు.

నోటిఫికేషన్ ప్రకారం.. మొత్తం 22 పోస్టులను భర్తీ చేయనున్నారు. అందులో 8 అసిస్టెంట్ ప్లేస్మెంట్ ఆఫీసర్లు, 11 స్కిల్ డెవెలప్మెంట్ ఇన్ స్ట్రక్టర్, మూడు కన్సల్టెంట్ ట్రైనీ పోస్టులకు నియామకాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.

అర్హత వివరాలు.. స్కిల్ డవలప్మెంట్ ఇన్ స్ట్రక్టర్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి BE లేదా BTech చదివిన వారు అర్హులు. ఈ జాబ్ కోసం ఎంపికైన వారికి రూ. 25 వేల వరకు వేతనం ఉంటుంది. కన్సల్టెంట్ ట్రైనీస్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకునే వారు మెకానికల్, ప్రొడక్షన్, ఇండస్ట్రియల్, కెమికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లో డిప్లొమో చేసిన వారు అర్హులు. ఈ విభాగంలో ఎంపికైన వారికి వారికి రూ. 20 వేల వరకు వేతనం ఉంటుంది. అసిస్టెంట్ ప్లేస్ మెంట్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేయాలుకున్న వారు BE లేదా BTech పూర్తి చేసి ఉండాలి. మరియు మేనేజ్ మెంట్ కోర్సుల్లో మాస్టర్ డిగ్రీ పొందిన వారై ఉండాలి. ఈ పోస్టుకు ఎంపికైన వారికి రూ. 35 వేల వరకు వేతనం ఉంటుంది. ఇతర అర్హతలు, మిగతా వివరాలను నోటిఫికేషన్ లో పొందుపర్చారు.

 దరఖాస్తు చేయు విధానం

ఇన్ స్ట్రక్టర్, కన్సల్టెంట్ పోస్టులకు ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు వారి దరఖాస్తును నోటిఫికేషన్ లో సూచించిన విధంగా నవంబర్ 20 లోపు పంపించాల్సి ఉంటుంది. అసిస్టెంట్ ప్లేస్ మెంట్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకున్న వారు ఆన్లైన్ లో నవంబర్ 6లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "CIPET Recruitment 2020 : "

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0