Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Corona with Currency :

కరెన్సీ నోట్లతో కరోనా సోకుతుందా ? క్లారిటీ ఇచ్చిన RBI.


Corona with Currency :

Corona with Currency: కరెన్సీ నోట్ల ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాపించే అవకాశం ఉందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) చెబుతోంది. ఈ విషయాన్ని గతంలోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ధ్రువీకరించినట్లు ఆ సంస్థ తెలిపింది. కోవిడ్ వ్యాప్తిని పూర్తిగా అరికట్టాలంటే కరెన్సీ నోట్లకు బదులుగా డిజిటల్ పేమెంట్ విధానాలను ఎంచుకోవాలని సీఏఐటీ కోరుతోంది. ప్రభుత్వం ఇందుకు ప్రోత్సాహకాలను ప్రకటించాలని డిమాండ్ చేస్తోంది. కరెన్సీ నోట్ల ద్వారా బ్యాక్టీరియా, వైరస్ వ్యాపిస్తాయో లేదో తెలపాలని మార్చి 9న సీఏఐటీ... కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాసింది. ఈ లేఖను ఆర్థిక శాఖ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు పంపింది.
దీనిపై స్పందించిన ఆర్బీఐ... బ్యాక్టీరియా, వైరస్‌లతో పాటు కరోనా వంటి ప్రమాదకర వైరస్‌లకు కూడా కరెన్సీ నోట్లు వాహకాలుగా మారే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికైనా కరెన్సీ నోట్లకు బదులుగా డిజిటల్ పేమెంట్ పద్ధతులకు మారాలని సీఏఐటీ జాతీయ అధ్యక్షుడు బిసి భారతియా, సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ చెబుతున్నారు.
ప్రోత్సాహకాలు ఇవ్వాలనే సూచన: డిజిటల్ లావాదేవీలపై విధించే బ్యాంక్ ఛార్జీలు మాఫీ చేయాలని సీఏఐటీ కోరుతోంది. డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహించాలంటే ప్రభుత్వం నేరుగా బ్యాంకులకు సబ్సిడీ ఇవ్వాలని ఆ సంస్థ చెబుతోంది. ఇలాంటి సబ్సిడీలు ప్రభుత్వానికి ఆర్థిక భారంగా మారబోవని సీఏసీటీ అంటోంది. దీని వల్ల నోట్ల ముద్రణకు అయ్యే ఖర్చులు తగ్గుతాయని ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తిని అరికట్టాలంటే మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్రెడిట్, డెబిట్ కార్డులు వంటి ఆన్లైన్ డిజిటల్ ఛానల్స్ ద్వారా చెల్లింపులు చేయాలని ఆర్బీఐ గతంలో ఒక ప్రకటనలో తెలిపింది. సాధ్యమైనంతవరకు నగదు ఉపయోగించడం తగ్గించాలని ప్రజలకు సూచించింది.
నగదు వాడకం పెరుగుదల:

2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గతంలో ఆర్బీఐ విడుదల చేసిన గణాంకాల ప్రకారం గతంతో పోలిస్తే కరెన్సీ నోట్ల వాడకం విలువ పెరిగినట్లు తెలుస్తోంది. 2019 ఆగస్టు 29న విడుదల చేసిన వార్షిక నివేదికలో ఇందుకు సంబంధించిన వివరాలను ఆర్బీఐ పొందుపరిచింది. 2018-19 ఆర్థిక సంవత్సరం నాటికి చెలామణిలో ఉన్న నోట్ల విలువ 17 శాతం పెరిగి 21,109 బిలియన్లకు చేరింది. నోట్ల పరిమాణం(వాల్యూమ్) 6.2 శాతం పెరిగి 1,08,759 మిలియన్ పీసులు(అన్ని రకాల కరెన్సీ నోట్లు కలిపి) వరకు పెరిగిందని అని సీఏఐటీ పేర్కొంది. మార్చి 2018 చివరి నాటికి చలామణిలో ఉన్న మొత్తం నోట్ల విలువలో 80.2 శాతం వాటా రూ.500, రూ.2,000 నోట్లదే. 2019 మార్చి చివరి నాటికి వీటి విలువ 82.2 శాతానికి పెరిగింది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Corona with Currency :"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0