Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Explains the precautions to be taken when schools open from November 2. Some of them are important.

22-10-2020 న ప్రకాశం  భవనం  లోని  స్పందన  మీటింగ్  హాల్ లో  జరిగిన  సమావేశం  లో M.E.O. లు,  Dy.E.O. లు  మరియు విద్యా సంస్థలు నుండి  కొంతమంది  సభ్యులు పాల్గొనడం  జరిగింది.  కలెక్టర్  గారు, జాయింట్  కలెక్టర్  గారు,  D.E.O.  గారు,  R.J.D.  గారు, నవంబర్  2 నుండి  స్కూల్స్  తెరిచి  నప్పుడు  తీసుకోవలసిన  జాగర్తలను  వివరించారు.  వానిలో  కొన్ని ముఖ్యమైనవి.

Explains the precautions to be taken when schools open from November 2. Some of them are important.

 • 1). 1, 3, 5, 7 తరగతులు  ఒక  రోజు,  2, 4, 6, 8 తరగతులు  ఒక రోజు,  9, 10 తరగతులకు  ప్రతి  రోజు  ఉదయం  9 గంటల నుండి  మధ్యాహ్నం  1 గంటలవరకు  తరగతులను  నిర్వహించాలి.
 • 2. పిల్లలు  స్కూల్  లోనికి  వచ్చేటప్పుడు  థర్మల్  స్క్రీనింగ్  చేసి  లోపలికి  అనుమతించాలి.
 • 3. మాస్క్  లేకపోతే  అనుమతించ రాదు.
 • 4. క్లాస్ లో  పిల్లలు 20 మంది  లోపే  ఉండాలి.
 • 5. స్కూల్  లోని  తరగతి  గదులను  ప్రతిరోజు  శానిటేషన్  చేయించాలి.
 • 6. 1st  పీరియడ్  లో  మరియు  లాస్ట్  పీరియడ్ లో  ప్రతిరోజూ  10 నిమిషాలు  Covid 19 పై  పిల్లలకు  అవగాహన  కల్పించాలి.
 • 7. స్కూల్  ఎంట్రెన్స్ లో, తరగతి  గదులలో, ముఖ్యమైన  ప్రదేశాలలో  Covid19  నివారణకు  తీసుకోవలసిన స్లొగన్స్ ను  ప్రదర్శించాలి.
 • అవి.
 •  A) మాస్క్  లేదు,  ప్రవేశం లేదు.
 • B) 6 అడుగులు  బౌతిక  దూరం  పాటిద్దాము.
 • C) తరసూ   చేతుల  సబ్బు  నీటితో  కడుగుకుందాం. మోడల్  పోస్టర్  లను  M E  O లు  ప్రతి  స్కూల్  కి  ఒకటి  ఇస్తారు.
 • 8. పిల్లలు  బుక్స్  కాని  పెన్నులు  కాని  ఒకరివి  మరొకరు  మార్చుకోకుండా  చూడాలి.
 • 9. ప్రతి  విద్యార్థి నోట్స్  కరెక్ట్ చేయకుండా  బోర్డు  పై  వ్రాసి  Self  కరెక్షన్  ప్రోత్సహింస  వలయును.
 • 10. పేరెంట్స్  నుండి  Willing  లెటర్  కచ్చితంగా  తీసుకోవాలి.
 • 11. Staff  అందరు  ఆరోగ్యసేతు  అప్  డౌన్లోడ్  చేసుకోవాలి.
 • 12. స్కూల్  లో  ఒక  Isolation  రూమ్  ఏర్పాటు  చేసుకో వాలి.
 • 13. పిల్లలు  చేతులతో  ముక్కు,  నోరు,  కళ్ళు ఎక్కువగా  తాకవద్దని  తెలియచేయాలి.
 • 14. పిల్లలలో  కాని,  టీచర్ లలో  కాని  Covid  లక్షణాలు  ఉంటే  వారిని  స్కూల్  లోపలకి  అనుమతించ కూడదు.
 • 15. పిల్లల ఇంటిలో  కుటుంబ  సభ్యుల లో  ఎవరికైనా  Covid  ఉంటే  వారిని  స్కూల్  లోపలికి  అనుమతించ కూడదు.
 • 16. స్కూల్  లో  యాక్టీవ్ గా  ఉంటూ  40 సంవత్సరాల  లోపు  వయస్సు  ఉన్న  ఒక  టీచర్స్ ను  Covid  Resource  Person  గా  నియమించాలి.
 • 17. అతనికి  పిల్లలందరి  తల్లిదండ్రుల ఫోన్  నంబర్లు,  ఆ  ప్రాంతములోని  ANM ల ఫోన్ నంబర్లు  ఇవ్వాలి.
 • 18. పిల్లలను,  టీచర్లను అతను  గమనిస్తూ  ఉండాలి. ఎవరైనా  నీరసంగా  గాని   ఉంటే  వారిని  Pulse  Oxy meter  తో  oxygen  లెవెల్  ను  చెక్  చేయాలి.
 • Oxygen  level  90 కంటే  (సాధారణంగా  94శాతం ఉండాలి  ) తక్కువగా  ఉంటే  ఆ పిల్లలను  isolation  రూమ్  లో  ఉంచి తల్లిదండ్రులను  పిలిచి  వారికీ  అప్పగించ వలయును.
 • 19.  ప్రతి  స్కూల్ కి  గవర్నమెంట్  మరియు  ప్రైవేట్  స్కూల్స్ కి  కూడా  ఒక  Pulse  Oxymeter అందజేస్తామని  కలెక్టర్  గారు  తెలియచేసారు.
 • 20. ప్రతి  టీచర్   Covid  కి  సంబందించిన  నియమాలను  పాటిస్తూ  పిల్లలు కూడా  పాటించేలా  చూడాలి.
 • 21. మొదటి  వారం  రోజులు  పిల్లలకు  Covid  నిబంధనలను  విస్తృతంగా  వివరిస్తే  తరువాత  వారు  అలవాటు  పడతారని  అలా  చేయాలనీ  తెలియచేసారు.
 • 22. స్కూల్  Busses  లో  తక్కువ  మంది  పిల్లలు  ఉండేటట్లు  చూసుకోవాలి.
 • 23. బస్ లను  రోజు  శానిటేషన్  చేయించాలి.
 • 24. హాస్టల్  ల  విషయం  గురించి  అడుగా  ఈవిషయం  చెప్పకుండా  దాటవేశారు.
 • 25. త్వరలో  రాష్ట్ర  ప్రభుత్వం  విధి  విధానాలను,  అకాడెమిక్  క్యాలెండరు  ప్రకటిస్తుందని,  దానిని  తప్పకుండా పాటించాలని  తెలియచేసినారు.
 • పైన  తెలిపిన నిబంధనలను  పాటిస్తూ పిల్లలు  మరియు  టీచర్స్  ఆరోగ్యానికి  తగిన  ప్రాధాన్యత  ఇస్తూ   అత్యంత  జాగర్తగా  పాఠశాలలను  నిర్వహించ వలసినదిగా  తెలియజేసారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Explains the precautions to be taken when schools open from November 2. Some of them are important."

Post a comment