Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

. Good news for SBI customers, EMI offer on debit card

 SBI కస్టమర్లకు గుడ్ న్యూస్ , డెబిట్ కార్డుపై EMI ఆఫర్.

.  Good news for SBI customers, EMI offer on debit card

దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI తన కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆన్‌లైన్ షాపింగ్, ఆఫ్‌లైన్ షాపింగ్ చేసే వారికి ప్రయోజనం కలిగే నిర్ణయం తీసుకుంది. దీంతో పండుగ సీజన్‌లో షాపింగ్ చేయాలని ప్లాన్ చేసుకునే వారికి ఊరట కలుగనుంది. స్టేట్ బ్యాంక్ డెబిట్ కార్డు ఉపయోగించే వారి కోసం బ్యాంక్ తాజాగా సులభమైన ఈఎంఐ ఆప్షన్ ప్రకటించింది. షాపింగ్ చేసిన మొత్తాన్ని ఈజీగానే ఈఎంఐ రూపంలోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు లేకపోయినా పర్లేదు. షాపింగ్ చేయొచ్చు. షాపుల్లో పీఓఎస్ మెషీన్లు, ఈకామర్స్ వెబ్‌సైట్లలో డెబిట్ కార్డుపై ఈఎంఐ ఆఫర్ పొందొచ్చని స్టేట్ బ్యాంక్ తెలిపింది.

ప్రస్తుతం ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ సైట్లలో పండుగ సేల్స్ అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. వీటిల్లో నచ్చిన ప్రొడక్టును కొనుగోలు చేసి ఈజీ ఈఎంఐ ఆప్షన్ ఎంచుకోవచ్చు. అయితే ఇక్కడ డెబిట్ కార్డు ఈఎంఐ ఆప్షన్ అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు. ప్రిఅప్రూవ్డ్ కస్టమర్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది.

రూ.లక్ష వరకు లోన్ అకౌంట్ పొందొచ్చు. ఉపయోగించిన మొత్తాన్ని 6, 9, 12, 18 నెలలలోపు తిరిగి చెల్లించొచ్చు. ఈ తరహా రుణాలపై రెండేళ్ల ఎంసీఎల్ఆర్‌కు అదనంగా 7.5 శాతం వడ్డీ పడుతుంది. జీరో ప్రాసెసింగ్ ఫీజు బెనిఫిట్ ఉంది. ఎలాంటి డాక్యుమెంట్లు అవసరం లేదు. మీరు కూడా మీ కార్డుపై ఈ ఆఫర్ ఉందో లేదో ముందే తెలుసుకోవచ్చు. దీనికి 567676 నెంబర్‌కు డీసీఈఎంఐ అని టైప్ చేసి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి మెసేజ్ పంపాలి

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to ". Good news for SBI customers, EMI offer on debit card"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0