Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Gubulu among the teachers! Bars for corona tests Swab‌ collection centers window

 గురువుల్లో గుబులు!

Gubulu among the teachers!  Bars for corona tests  Swab‌ collection centers window

కరోనా పరీక్షలకు బారులు

స్వాబ్‌ సేకరణ కేంద్రాలు కిటకిట

భావిభారత పౌరులను తీర్చిదిద్దే గురువులకు కరోనా గుబులు పట్టుకుంది. నవంబరు 2 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులందరూ ‘కొవిడ్‌’ నిర్ధరణ ధ్రువీకరణ పత్రం అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో స్వాబ్‌ సేకరణ కేంద్రాలకు పెద్దసంఖ్యలో తరలి వస్తున్నారు. ‘కరోనా’ అంటువ్యాధి.. దగ్గినా, తుమ్మినా ఇతరులకు వ్యాపిస్తుంది. నమూనాల కేంద్రాలకు టీచర్లతోపాటు అనుమానిత రోగులు వస్తున్నారు. ముక్కు లేదా గొంతు నుంచి నమూనా (స్వాబ్‌) తీయడానికి పట్టే సమయం నిమిషమే. కానీ గంటలకొద్దీ నిరీక్షించాల్సి వస్తోంది. ఎలాంటి లక్షణాలు లేకపోయినా కొందరికి కరోనా ఉన్నట్లు తేలుతోంది. దీంతో గురువుల్లో ఆందోళన మొదలైంది. మరోవైపు సంచార సేకరణ కేంద్రాలను ఎత్తేశారు. అనంత నగరంలోని సర్వజన ఆస్పత్రిలో మాత్రమే నమూనాల సేకరణ కేంద్రం ఉంది. ఇక్కడికి రెండు రోజులుగా వందలాది మంది ఉపాధ్యాయులు తరలి వస్తున్నారు. మరో నాలుగు పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో సేకరిస్తున్నట్లు ప్రకటించినా.. స్పష్టత లేదు.

18 వేల మందికి..

జిల్లా వ్యాప్తంగా 18వేల మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ విధిగా కొవిడ్‌ నిర్ధరణ పరీక్ష చేయించుకోవాలి. పాఠశాల విధులకు వెళ్లాలంటే ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సిందే. దీంతో గురు, శుక్రవారం ఉపాధ్యాయులు అనంత ఆస్పత్రిలో క్యూ కట్టారు. గురువారం 800 మందికిపైగా రాగా.. శుక్రవారం ఈ సంఖ్య వెయ్యి దాటింది. ఆస్పత్రిలో అదనపు కేంద్రాలు, సిబ్బందిని కేటాయించలేదు. ఒక కేంద్రంలోనే నమూనాలు తీస్తున్నారు. ఫలితంగా రెండుమూడు గంటలు నిరీక్షించాల్సి వస్తోంది. ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.

సంచార కేంద్రాలేవీ..

మూడు రోజులుగా సంచార నమూనాల సేకరణ కేంద్రాలు పని చేయడం లేదు. సదరు ఏజెన్సీ సిబ్బందిని తొలగించింది. కేవలం ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేకరిస్తున్నారు. ఉపాధ్యాయులు పనిచేసే మండలాల్లోని పీహెచ్‌సీల్లో నమూనాలు ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. కానీ ఎక్కువ మంది అనంత, హిందూపురం, కదిరి, తాడిపత్రి, ధర్మవరం, రాయదుర్గం, గుంతకల్లు పట్టణాల్లోనే నివాసం ఉంటున్నారు. దీంతో నియోజకవర్గ కేంద్రాల్లోని ఆసుపత్రులకు తరలివస్తున్నారు.

పెరిగిన నమూనాలు

మొన్నటి దాకా రోజూ ఐదారు వేల నమూనాలు సేకరిస్తూ వచ్చారు. రెండు రోజులుగా ఈ సంఖ్య 10 వేలు దాటిపోతోంది. ఉపాధ్యాయులు కరోనా పరీక్షలు చేయించుకోవడమే కారణం. ఉదయం 9 నుంచి మరుసటి రోజు ఉదయం 9 గంటల మధ్య సేకరించిన నమూనాలను ఒకరోజు సంఖ్యగా లెక్కిస్తారు. ఈ ప్రకారం 27న 7,171 నమూనాలు తీయగా, 28న ఏకంగా 10,374కు పెరిగింది. 29న 11,697 మంది నుంచి నమూనాలు తీశారు. శుక్రవారం కూడా 10 వేలు దాటినట్లు అధికారుల ద్వారా తెలిసింది.*

1లోగా పరీక్షలు చేయించుకోవాలి

ప్రతి ఉపాధ్యాయుడు నవంబరు 1వ తేదీ లోపు కొవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలని డీఈఓ శామ్యూల్‌ ఆదేశించారు. శనివారం అగళి, అమరాపురం, బుక్కపట్నం, చిలమత్తూరు, గోరంట్ల, గుడిబండ, హిందూపురం, కొత్తచెరువు, లేపాక్షి, మడకశిర, పరిగి, పెనుకొండ, పుట్టపర్తి, రొద్దం, రొళ్ల, సోమందేపల్లి మండలాల్లోని ఉపాధ్యాయులు సంబంధిత ఆరోగ్య కేంద్రాల్లో పరీక్షలు చేయించుకోవాలి. వివరాలను ఒకటో తేదీ సాయంత్రం 4గంటల్లోగా డీఈఓ కార్యాలయానికి మెయిల్‌ ద్వారా తెలపాలన్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Gubulu among the teachers! Bars for corona tests Swab‌ collection centers window"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0